తిరువెంకా
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరువెంకా భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
తిరువెంకా | |
---|---|
భౌగోళికాంశాలు : | 12°29′N 79°26′E / 12.49°N 79.43°E |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | యథోక్తకారి(శొన్నవణ్ణం శెయ్‌ద పెరుమాళ్) |
ప్రధాన దేవత: | కోమలవల్లి |
దిశ, స్థానం: | పశ్చిమ ముఖము |
పుష్కరిణి: | పొయిగై పుష్కరిణి |
విమానం: | వేదసార విమానము |
కవులు: | పొయిగై ఆళ్వార్, పేయాళ్వార్, తిరుమళిశై ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | కణికృష్ణునకు బ్రహ్మకు |
విశేషాలు
మార్చుఇది పొయిగై ఆళ్వార్ జన్మ స్థలము-వారు ఈ దివ్యదేశమున గల పుష్కరిణిలో లభించాడు. ఈ రాజ్య పాలకుడు తిరుమళిశై ఆళ్వార్ శిష్యులగు కణికృష్ణుడు అనువారిపై కోపించి రాజ్యము నుండి వెడలగొట్టెను. అంత శిష్యునితో తిరుమళిశై ఆళ్వారు ఊరువిడిచి పోవుచు "కణికణ్ణన్ పోగిన్ఱాన్ కామరపూమ్‌కచ్చి, మణిపణ్ణా నీకిడక్క వేణ్డా" అని అనగానే స్వామికూడా వారితోబాటు బయలుదేరెనట. రాజు భయపడి కణికృష్ణుని ప్రార్థించి వారిని మరల రాజ్యమున ఉండుమని కోరగా ఆళ్వార్లు తిరిగి "కణికణ్ణన్ పోక్కొళిన్దాన్ కామరపూమ్‌కచ్చి మణివణ్ణా నీ కిడక్క వేణ్డుమ్" అని అనగానే స్వామి తిరిగి యథా ప్రకారము వేంచేసారని భక్తుల కథనాలు వివరిస్తున్నాయి. ఈ భక్తులు చెప్పినట్లు నడిచాడు కనుక స్వామి అగుటచే వీరికి యథోక్త కారి అని పేరు వచ్చింది. ఇక్కడ స్వామి ఎడమ చేతిమీద శయనించి యుందురు. ఇచట పిళ్లై లోకాచార్యునికి ప్రత్యేకసన్నిధి ఉంది. ఈ సన్నిధిలోనే మణవాళ మహామునులు శ్రీభాష్యమును రచించాడు. ఈ క్షేత్రస్వామిని కీర్తిస్తూ శ్రీమద్వేదాంత దేశికన్ వేగాసేతు స్తోత్రమును రచించాడు.
సాహిత్యం
మార్చుశ్లో. శ్రీవెஃకా నగరే భుజంగశయన శ్రీసాయిగై పద్మాకరో
ద్దీపే తత్ర యథోక్తకారి భగవాన్ శ్రీవేదసారాహ్వయే
వైమానే వరకోమలాఖ్యలతికా నాథస్తు పశ్చాన్ముఖ:
ప్రత్యక్ష: కణికృష్ణ ధాతృసరసాం భాతి శ్రితేష్టార్థద:||
సరోజాత మహాయోగి భక్తిసార మహర్షిభి:|
కీర్తిత: కలిజిన్నామ మునినాచాపి సాదరమ్||
పాశురాలు
మార్చుపా. కూన్దలార్ మగిழ்;కోపలనాయ్;వెణ్ణెయ్
మాన్దழన్‌దైయిల్; క్కణ్డు మకిழ்న్దు పోయ్
ప్పాన్దళ్ పొழிయిల్; పళ్లి విరుమ్బియ
వేన్దనై చ్చెన్ఱు కాణ్డుమ్; వెஃకావిలే.
తిరుమంగై ఆళ్వార్లు-పెరియ తిరుమొழி 10-1-7.
వివరాలు
మార్చుప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
యథోక్తకారి(శొన్నవణ్ణం శెయ్‌ద పెరుమాళ్)- | కోమలవల్లి- | పొయిగై పుష్కరిణి | పశ్చిమ ముఖము | భుజంగ శయనం | పొయిగై ఆళ్వార్, పేయాళ్వార్, తిరుమళిశై ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ | వేదసార విమానము | కణికృష్ణునకు బ్రహ్మకు |