తిరువెళ్ళరై

తిరువెళ్ళరై (Thiruvellarai) తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చిరాపల్లి నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి శ్రీ పుండరీకాక్ష పెరుమాళ్ దేవాలయం వైష్ణవ దివ్యదేశాలుగా ప్రసిద్ధిచెందినది.

తిరువెళ్ళరై
One of the interior gateway towers of the temple with rectangular walls around
One of the interior gateway towers of the temple
తిరువెళ్ళరై is located in Tamil Nadu
తిరువెళ్ళరై
తిరువెళ్ళరై
భౌగోళికాంశాలు :10°29′N 78°25′E / 10.49°N 78.41°E / 10.49; 78.41Coordinates: 10°29′N 78°25′E / 10.49°N 78.41°E / 10.49; 78.41
ప్రదేశం
దేశం:భారత దేశము
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:Trichy
ప్రదేశం:Tamilnadu, India
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:Pundarikakshan(Vishnu)
ప్రధాన దేవత:Pankajavalli (Lakshmi)
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :Dravidian architecture

సాహిత్యంసవరించు

శ్లో. తీర్దై: పుష్కల పద్మ చక్ర కుశకై స్సంశోభ మానస్థితే
   రమ్యే శ్రీ మణి కర్ణి కాహ్వాయ వరాహఖ్యాత తీర్దాఞచ్‌తే |
   గంధ క్షీరసు దివ్య పుష్కరిణికా యుక్తే సితాద్ర్యాహ్వయే
   రాజంతం నగరేతు వెళ్లర పదే ప్రాగస్య సంస్థానగమ్‌ ||

శ్లో. శ్రీ మచ్చంపక వల్లికా పరిగతం శ్రీ పంగయచ్చెల్వికా
   నాయక్యా విమలాకృతిం సురుచిరం వైమాన వర్యశ్రితమ్‌ |
   మార్కండేయ శిబిక్షితీశ గరుడ క్షోణీ దృశాం గోచార
   పద్మాక్షాహ్వయ మాశ్రయే కలిరిపు శ్రీ విష్ణు చిత్త స్తుతమ్‌ ||

పాశురంసవరించు

   ఇన్దిరవోడు పిరమన్ ఈశన్ ఇమయవ రెల్లామ్‌
   మన్దిర మామలర్ కొణ్డు మఱైన్దువరాయ్ వన్దు నిన్ఱార్‌
   శన్దిరన్ మాళిగై శేరుం శదురరగళ్ వెళ్లఱై నిన్ఱాయ్‌
   అన్దియ మ్చోదిదువాగుమ్‌ అழగనే ! కాప్పిడ వారాయ్.
          పెరియాళ్వార్-పెరియాళ్వార్ తిరుమొழி 2-8-1

విశేషంసవరించు

ఈ క్షేత్రమునకు శ్వేతగిరి యనిపేరు. శిబి చక్రవర్తి ప్రార్ధనచే స్వామి పుండరీకాక్షునిగా వెలిసాడు. ఇచట స్వామికి ఇరువైపుల సూర్య చంద్రులు వింజామరలు వీస్తూ ఉంటారు. ఇచ్చట ఉత్తరాయణ-దక్షిణాయన ద్వారములు ఉన్నాయి. ఉయ్యక్కొండార్ (పుండరీకాక్షుడు) అవతార స్థలము. మీన మాసమున బ్రహ్మోత్సవం నిర్వహించబడుతుంది.

మార్గంసవరించు

శ్రీరంగము నుండి ఉత్తమర్ కోయిల్ మీదుగా తిరుచ్చి-ఉరయూర్ బస్ మార్గములో శ్రీరంగమున నుండి 15 కి.మీ దూరమున గలదు. బస్ దిగిన పిమ్మట 1/2 కి.మీ దూరంలో సన్నిధి ఉంది. ఏ వసతులు లేవు. శ్రీరంగము నుండి సేవించాలి.

వివరంసవరించు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
పుండరీకాక్షులు పంగయచ్చెల్వి తాయార్ (చంపకవల్లి) పుష్కల, పద్మ, చక్ర, కుశ, మణి కర్ణిక, వరాహ, గంద, క్షీర, పుష్కరణులు తూర్పు ముఖము నిలచున్న సేవ తిరుమంగై ఆళ్వారులు, పెరియాళ్వారులు శ్వేతాద్రి-విమలాకృతి విమానము మార్కండేయ, శిబి, గరుడ, భూదేవులకు

చిత్రమాలికసవరించు

చిత్రమాలికసవరించు

ఇవికూడా చూడండిసవరించు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు