తియ్యని పాకంలో నానబెట్టిన గారెలను తీపిగారెలంటారు.

తీపి గారెలు

రకాలు

మార్చు

వీటిలో పలు రకాల గారెలు కలవు

  • బెల్లం పిండిలో కలిపి వేయించే గారెలు
  • పంచదార పిండిలో కలిపి తయారుచేసే గారెలు
  • బెల్లం పాకం లేదా చెరకు పానకాల్లో నానబెట్టే గారెలు
  • పంచదార పాకంలో నానబెట్టిన గారెలు
  • పంచదారపాకం ముదరబెట్టి గారెలువేసి ముంచితీసిన గారెలు. (పాకం గడ్డకట్టి గారెలపైఅచ్చులాఏర్పడి గట్టిగా ఉంటాయి)
  • బెల్లంపాకం ముదరబెట్టి గారెలువేసి ముంచితీసిన గారెలు. (ఇవి కూడా పాకం గడ్డకట్టి గారెలు గట్టిగా ఉంటాయి)

తయరీ విధానం

మార్చు

ముందుగా వీటి తయారీకి కావలసినవి మినపప్పు, బెల్లం తురుము, ఉప్పు, నూనె

రెండు గంటల ముందుగా మినపప్పుని నానబెట్టుకోవాలి. పప్పులో నీళ్ళని వడగట్టేసి,ఉప్పుని జతచేసి మెత్తగా రుబ్బుకోవాలి. పాత్రలో నీళ్ళు వేడయ్యాక బెల్లం తురుము వేసి చిక్కగా పాకం వచ్చేవరకు ఉంచి దింపేయాలి.పాత్రలో నూనె వేడయ్యాక, చేతిని కొద్దిగా నీటితో తడుపుకుని పిండిని చిన్న ఉండగా తీసుకుని అరచేత్తో వత్తుకుని నూనెలో వేయించాలి.

పాకం గారెలు

మార్చు

గారెలను తయారుచేసాక వాటిని నూనే ఆరేవరకూ పేపర్లలోవేసి ఉంచుతారు. పంచదార లేదా బెల్లం నీళ్ళతో కలిపి లేతపాకం పట్టి, గారెలకు చిన్న చిన్న గాట్లుపెట్టి అందులోవేసి నానబెడతారు. కొంతసమయం తరువత అవి పాకంలో నాని మెత్తబడతాయి. కొంత పాకాన్ని పక్కన పెట్టుకుని తినే ముందు గారెల పై వేసి వేడివేడిగా వడ్డించాలి.

ఇతర విశేషాలు

మార్చు