తుంబా 2019లో విడుదలైన తెలుగు సినిమా. ఏ రీగల్ రీల్స్ ప్రై.లి. , రోల్ టైమ్ స్టూడియోస్ , కెజెఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు హరీష్ రామ్ ఎల్.హెచ్. దర్శకత్వం వహించాడు. దర్శన్, ధీనా, కీర్తి పాండియన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ అడ్వెంచరస్ ఫాంటసీ సినిమా మొదట తమిళంలో 11 ఏప్రిల్ 2019న విడుదలై, 21 జూన్ 2019న తెలుగు, మలయాళం, హిందీలలో డబ్బింగ్ చేసి విడుదల చేశారు.[1]

తుంబా
దర్శకత్వంహరీష్ రామ్ ఎల్.హెచ్
రచనహరీష్ రామ్ ఎల్.హెచ్
రామ్ రాఘవ్
ప్రభాకరన్ ఏఆర్
నిర్మాతసురేఖ న్యపతి
తారాగణందర్శన్
కీర్తి పాండియన్
ధీనా
ఛాయాగ్రహణంనరేన్ ఎలన్
కూర్పుకలైవనన్ ఆర్
సంగీతంఅనిరుధ్ రవిచంద్రన్
వివేక్ - మెర్విన్
సంతోష్ దయానిధి
నిర్మాణ
సంస్థలు
ఏ రీగల్ రీల్స్ ప్రై.లి.
రోల్ టైమ్ స్టూడియోస్
పంపిణీదార్లుకెజెఆర్ స్టూడియోస్
విడుదల తేదీ
2019 జూన్ 21 (2019-06-21)
సినిమా నిడివి
123 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

అనుకోకుండా అడవిలోకి వచ్చి పడిన పులి (తుంబా), దాని బిడ్డ ప్రమాదవశాత్తు అడివిలోకి వస్తాయి. అలా వచ్చిన ఈ రెండింటి లెక్క గవర్నమెంట్ రికార్డ్స్ లో ఎలాగూ ఉండదు కాబట్టి వీటిని అమ్ముకుని ఎలాగైనా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు అక్కడి ఫారెస్ట్ ఆఫీసర్. ఇదిలా ఉంటే ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఫోటోస్ తీయడానికి పర్మిషన్ తీసుకున్న వర్ష తో పాటు, ఆ అడవికి దగ్గరలో పులి రియల్ స్టాచ్యూ తయారు చేసే పనిలో ఉన్న మరో ముగ్గురు ఈ విషయాన్ని గ్రహించి ఎలాగైనా ఆ పులిని, దానిబిడ్డని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ నుండి కాపాడాలనుకుంటారు. ఇంతకీ తుంబని, దాని బిడ్డని వీళ్ళు కాపాడగలిగారా..? లేదా అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు మార్చు

  • దర్శన్
  • ధీనా
  • కీర్తి పాండియన్
  • ధరణి వాసుదేవన్
  • జార్జ్ విజయ్ నెల్సన్
  • విజయ్
  • కళైయారసన్ కన్నుసామి
  • జయం రవి (అతిధి పాత్రలో)

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఏ రీగల్ రీల్స్ ప్రై.లి. , రోల్ టైమ్ స్టూడియోస్ , కెజెఆర్ స్టూడియోస్
  • నిర్మాత: సురేఖ న్యపతి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హరీష్ రామ్ ఎల్.హెచ్
  • మాటలు: రామ్ రాఘవ్, ప్రభాకరన్ ఏఆర్
  • సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, వివేక్ - మెర్విన్, సంతోష్ దయానిధి
  • సినిమాటోగ్రఫీ: నరేన్ ఎలన్
  • ఆర్ట్: సురేష్
  • ఎడిటర్: కలైవనన్ ఆర్
  • ఫైట్స్: యాక్షన్ 100
  • కాస్ట్యూమ్స్: వాసుకి భాస్కర్, పల్లవి సింగ్
  • ఆడియోగ్రఫీ: ఉదయ్ కుమార్ టి, వినయ్ శ్రీధర్
  • సౌండ్ డిజైనర్: ఆనంద్ కృష్ణమూర్తి, కలరిస్ట్: ప్రశాంత్ సోమశేఖర్
  • విఎఫ్ఎక్స్ క్రియేటివ్ డైరెక్టర్: విల్లవన్ కే.జీ
  • విఎఫెక్స్ డైరెక్టర్: శ్రీరంగరాజ్ జె
  • విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్; చంద్రమోహన్ జె
  • పీఆర్వో: నాయుడు - ఫణి
  • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: అశోక్ వి
  • ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: మెల్విన్ సైమన్

మూలాలు మార్చు

  1. The Times of India (23 April 2019). "'Thumbaa' Telugu trailer: Get ready for India's biggest live action experience" (in ఇంగ్లీష్). Archived from the original on 14 ఆగస్టు 2021. Retrieved 14 August 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=తుంబా&oldid=3976670" నుండి వెలికితీశారు