తుమ్మలపాలెం (చెరుకుపల్లి)

(తుమ్మలపాలెం(చెరుకుపల్లి) నుండి దారిమార్పు చెందింది)

తుమ్మలపాలెం, బాపట్ల జిల్లాలోని చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ పంచాయతీ

మార్చు

జొన్నలగడ్డవారి పాలెం గ్రామం, తుమ్మలపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

గ్రామదేవత శ్రీ కావూరమ్మ తల్లి ఆలయం

మార్చు

ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే, అమ్మవారి ఏడురోజుల కొలువులు, 2014, జూన్-29, ఆదివారం నాడు, గ్రామ మహిళలు పసుపు, కుంకుమలు సమర్పించడంతో ప్రారంభమైనవి. రెండవరోజు సోమవారం నాడు, అమ్మవారికి ప్రత్యేక అలంకరణతోపాటు, కొప్పెరలు నిర్వహించి, వివిధనదుల నుండి తెప్పించిన నీటితో అభిషేకం నిర్వహించారు. మొత్తం ఏడురోజులు జరిగిన ఈ కొలువులు, జూలై-6, ఆదివారంతో ముగిసినవి. ఆదివారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసారు. మహిళలు పసుపు, కుంకుమలు సమర్పించారు. గ్రామానికి శుభం కలగాలని అమ్మవార్ని గ్రామంలో ఊరేగించుచూ నీరు వారపోసినారు. సాయంత్రం కొలువులు ముగియటంతో, గ్రామస్థులు అమ్మవారికి మొక్కులు చెల్లించారు. [1] & [2]

శ్రీరామాలయం

మార్చు

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నివహించెదరు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు