తుమ్మల రమాదేవి
తుమ్మల రమాదేవి వ్యాపారవేత్త, తెలుగు టెలివిజన్ ఛానెళ్ళ నిర్వాహకురాలు. ఆమె ప్రారంభించి నడిపిస్తున్న వనిత టీవీ ప్రత్యేకించి మహిళల కోసం నడుపుతున్న ఛానెళ్ళలో భారతదేశంలోకెల్లా మొదటిది.[1] ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత ఛానెళ్ళను నిర్వహిస్తున్న రచన టెలివిజన్ నెట్వర్క్స్ లో ఆమె డైరెక్టర్.
వ్యక్తిగత జీవితం
మార్చురమాదేవి గుంటూరులో జన్మించింది. ఆమె డబుల్ ఎం.ఎ., ఎల్.ఎల్.బి., ఎం.బి.ఎ. చదివింది. 2006 వరకు ఈ డిగ్రీలు, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుకున్నది. మీడియా రంగంలో పనిచేయడం ప్రారంభించాకా చదువుకు విరామం ఇచ్చింది. భర్త [[తుమ్మల నరేంద్ర చౌదరి]] ఎన్ టీవీ, భక్తి ఛానెళ్ళ వ్యవస్థాపకుడు, రచన టెలివిజన్ నెట్ వర్క్స్ అధినేత. వారి కుమార్తె రచన కూడా మీడియా నిర్వహణలోనే పనిచేస్తున్నది.[2]
మీడియా రంగం
మార్చురచన టెలివిజన్ నెట్ వర్క్స్
మార్చు2006లో రచన టెలివిజన్ నెట్వర్క్స్ ప్రారంభించినప్పుడు భర్త నరేంద్ర చౌదరితో కలిసి రమాదేవి డైరెక్టరుగా బాధ్యతలు స్వీకరించింది. 24 గంటల న్యూస్ ఛానెల్ అయిన ఎన్టీవీ, హిందూ ఆధ్యాత్మిక ఛానెల్ అయిన భక్తి టీవీలు ఈ సంస్థ ద్వారానే ప్రారంభమయ్యాయి.[2]
వనిత ఛానెల్
మార్చు2009లో భారతదేశంలో మహిళలకే ప్రత్యేకించిన తొలి టెలివిజన్ గా వనిత టీవీ ప్రారంభించింది. ఈ ఛానెల్ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా రమాదేవి వహించింది.[2] వనిత ఛానెల్ కార్యక్రమాలు పలు టీవీ నంది, యునిసెఫ్, లాడ్లీ మీడియా పురస్కారాలు వంటి అవార్డులు సాధించాయి.[3][4][5] లాభనష్టాలకు అతీతంగా వనిత ఛానెల్ నడుపుతోంది. "మహిళలు కేవలం వినోద సాధనాలకు ఆదాయమార్గాలుగా మాత్రమే మిగిలిపోతున్న వైనమే... వారి కోసం ప్రత్యేక ఛానెల్ ఆలోచన కలిగించింది" అన్నది వనిత ఛానెల్ ఏర్పాటు వెనుక రమాదేవి ఆలోచన.[2]
సాంఘిక సేవ, పరిశోధన
మార్చుఈ విభాగం ఖాళీగా ఉంది. మీరు ఇది జోడించడం ద్వారా సహాయపడుతుంది. |
మూలాలు
మార్చు- ↑ "Rachana Television Pvt. Ltd appoints Deepak Dubey as DGM- Sales and Marketing (North) – Exchange4media". Indian Advertising Media & Marketing News – exchange4media (in ఇంగ్లీష్). Archived from the original on 9 మే 2019. Retrieved 9 May 2019.
- ↑ 2.0 2.1 2.2 2.3 "వనిత ఠీవి...". సాక్షి (ఫ్యామిలీ ed.). 1 September 2009. p. 1.
- ↑ ఆర్., కృష్ణయ్య. "సామాజిక సందేశాలకు టీవీ మాధ్యమం". www.prajasakti.com. Archived from the original on 9 మే 2019. Retrieved 9 May 2019.
- ↑ "తెలుగు మీడియాకు యూనిసెఫ్ అవార్డులు". Update AP. Archived from the original on 9 మే 2019. Retrieved 9 May 2019.
- ↑ "Laadli media awards presented". The Hindu (in Indian English). 14 December 2013. Retrieved 10 May 2019.