తుమ్మల వెంకట్రామయ్య

(తుమ్మల వెంకటరామయ్య నుండి దారిమార్పు చెందింది)

తుమ్మల వెంకట్రామయ్య (1914 అక్టోబరు 6 - 1987 నవంబరు 7) తెలుగు రచయిత, అనువాదకుడు, జర్నలిస్టు. సోషలిస్టు దృక్పథంతో జర్నలిజం నిర్వహించిన వ్యక్తి.

తుమ్మల వెంకట్రామయ్య
జననం(1914-10-06)అక్టోబరు 6, 1914
కొల్లూరు గ్రామం, గుంటూరు జిల్లా
మరణంనవంబరు 7, 1987(1987-11-07) (వయస్సు 73)
వృత్తిరచయిత, అనువాదకుడు, విలేకరి

జీవితంసవరించు

1914 అక్టోబరు 6న గుంటూరు జిల్లాలోని కొల్లూరు గ్రామంలో తుమ్మల వెంకట్రామయ్య జన్మించాడు. అతని కార్యరంగం విజయవాడ నగరం. 72 సంవత్సరాల వయసులో 1987 నవంబరు 11న మరణించాడు.

పాత్రికేయ వృత్తిసవరించు

తుమ్మల వెంకట్రామయ్య జర్నలిజంలోకి కమ్యూనిస్ట్, సోషలిస్ట్ దృక్పథాన్ని ప్రవేశపెట్టిన తొలి తరం తెలుగు పాత్రికేయుల్లో ఒకడిగా పేరొందాడు. అతను నవశక్తి, ప్రజాశక్తి, విశాలాంధ్ర, అభ్యుదయ, ఉదయిని వంటి పత్రికల సంపాదక వర్గ సభ్యనిగా పనిచేశాడు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు, సోషలిస్టు, కార్మికోద్యమాలు వంటి అంశాల గురించీ, ప్రపంచ పరిణామాల గురించి తెలుగు పాఠకులకు తెలియజేసే ఉద్దేశంతో పలు రచనలు చేశాడు.

రచనలుసవరించు

  • మాతృహృదయం (1934) - గోర్కీ రాసిన ప్రఖ్యాత నవల్ మదర్‌కి సంక్షిప్త అనువాదం. తర్వాతికాలంలో పలు అనువాదాలు వెలువడ్డ ఆ నవలకు ఇది తొలి తెలుగు అనువాదం.
  • భారత కార్మికోద్యమ చరిత్ర (1936)
  • మాప్లా తిరుగుబాటు (1938)
  • పాలస్టయిన్ (1939)
  • మన లెనిన్ (1942)
  • రచయితా శిల్పము (1955)
  • కారల్ మార్క్సు సోషలిస్టు జీవిత చరిత్ర
  • కామ్రేడ్ డిమ్రిట్రోవ్ (1982)

పురస్కారాలుసవరించు

  • 1985: అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీపురస్కారం[1].

మూలాలుసవరించు

  1. పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.