తుమ్మి
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (సెప్టెంబరు 2016) |
తుమ్మి యొక్క వృక్ష శాస్త్రీయ నామం Leucas aspera.
ఇతర భాషలలో పేర్లు
మార్చుహిందీ : చోటాకల్కుస, కన్నడ : తుంబెగిడ, తమిళం : తుంబై, బెంగాలీ : చోటాకల్కుస, మలయాళం : తుంబ
వ్యాప్తి
మార్చుభారతదేశమంతటా, బంజరు భూములలో ఈ మొక్క పెరుగుతోంది.
మొక్క వివరణ
మార్చుఈ చిన్నమొక్క సాధారణంగా 30 సెం.మీ ఎత్తు పెరుగుతుంది. కాండం నాలుగు పలకాలుగా ఉండి, దానికి సన్నని నూగు ఉంటుంది. ఆకులు సన్నగా కొసుగా పొడవుగా ఉంటాయి. ఆకులు కాండానికి ఇరువైపుల ఎదురెదురుగా ఉంటాయి. సాధారణంగా మూడు, నాల్గు ఆకులు కలిసి గుత్తులుగా ఉంటాయి. పూవ్వులు తెల్లగా సాధారణంగా కొమ్మల చివర్లో గుత్తులుగా వస్తాయి.
ఉపయోగాలు
మార్చుమలబద్ధకమును పోగొట్టే విరేచనకారి, కడుపులో పురుగులను బైటకు కొట్టే లక్షణం కలిగి ఉండే బలవర్థకము. రొమ్ము పడిశమూ, జాండిస్, శరీరమంటలు, ఉబ్బసము, అజీర్ణము అనేక రకాల శరీరపునెప్పులు, పక్షవాతం - రోగాలపై పనిచేస్తుంది. దీనికి ఈ మొక్కను కషాయంగా చేసుకొని తీసుకోవాలి. ఆకుల కషాయం, జ్వరాలకు, తాజా మొక్క రసాన్ని బాహ్యంగా గజ్జి ఉన్న చోట్ల వ్రాస్తే గజ్జి పోతుంది. పూవులను సిరప్ గా చేసి తాగితే జలుబు తగ్గుతుంది.
మూలాలు
మార్చుఆదిమ గిరిజన వైద్యము