తుమ్ము
తుమ్ము అనేది ముక్కు, నోరు ద్వారా ఊపిరితిత్తులలోని గాలిని ఒక్కసారిగా బయటికి పంపివేసే చర్య. ముక్కు లోపల కొన్ని అన్యకణాలు ప్రవేశించి చిరాకు కలిగించడం దీనికి ముఖ్య కారణం. దీని వల్ల మ్యూకస్ నాసికా మార్గం ద్వారా, ఎంగిలి నోటి మార్గం ద్వారా బయటకు వెళుతుంది.[1]
తుమ్ము ఒక పెద్ద శబ్దంతో, హఠాత్తుగా అసంకల్పిత చర్య ద్వారా నోరు, ముక్కు నుండి గాలిని బలవంతంగా బయటకు పంపుతుంది.
తుమ్ములు సాంక్రమిక ఏరోసోల్ బిందువుల ద్వారా వ్యాధిని వ్యాప్తి చేయగలవు కాబట్టి, తుమ్మేటప్పుడు ముంజేయి, మోచేయి లోపలి భాగం, లేదా రుమాలుతో నోరు, ఇంకా ముక్కును కప్పుకోవాలని సిఫార్సు చేస్తారు.
నిద్రలో ఉన్నపుడు కండరాలు విశ్రాంతి స్థితిలో ఉండటం వలన సాధారణంగా తుమ్ములు రావు. ఒకవేళ అందుకు అనుగుణమైన పరిస్థితులు వచ్చినా, ముందు మెలకువ వచ్చిన తర్వాతనే తుమ్ము వస్తుంది. తుమ్మినప్పుడు, అసంకల్పిత క్రియ కారణంగా మానవుల కళ్ళు వాటంతట అవే మూసుకుపోతాయి.[2]
తుమ్ము | |
---|---|
Biological system | శ్వాస వ్యవస్థ |
ఆరోగ్యము | మంచి చేస్తుంది |
చర్య | అసంకల్పితం |
ప్రకంపనలు | Irritants of the nasal mucosa Light Cold air Snatiation Allergy Infection |
పద్దతి | నోరు, ముక్కు ద్వారా బయటకు |
ఫలితము | Removal of irritant |
సాంక్రమిక వ్యాధులు
మార్చుఆరోగ్యంగా ఉన్నవారిలో సాధారణంగా తుమ్ములు ఎటువంటి హానీ చేయనప్పటికీ ఒక్కోసారి తుమ్ముల ద్వారా గాలిలోకి విడుదలయ్యే తుంపరల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ తుంపరలు సుమారు 0.5 నుంచి 5 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటాయి. ఒక్కో తుమ్ము ద్వారా ఇలాంటి బిందువులు సుమారు 40,000 విడుదల అవుతాయి.[3]
మూలాలు
మార్చు- ↑ "Sneeze". The Free Dictionary. Retrieved April 6, 2012.
- ↑ "Sleep On, Sneeze Not". A Moment of Science. Indiana University. Archived from the original on 23 February 2019. Retrieved 2019-02-21.
- ↑ Cole EC, Cook CE (August 1998). "Characterization of infectious aerosols in health care facilities: an aid to effective engineering controls and preventive strategies". American Journal of Infection Control. 26 (4): 453–64. doi:10.1016/S0196-6553(98)70046-X. PMC 7132666. PMID 9721404.