తులసీ ఘాట్
వారణాసిలోని ఘాట్లలో తులసీ ఘాట్ ఒకటి. రామచరితమానస్, హనుమాన్ చాలీసా రచించిన కవి తులసీదాస్ ఇక్కడే నివసించాడు. అందుచేత ఈ ఘాట్‌కూ ఆ పేరు పెట్టారు. పూర్వం తులసీ ఘాట్‌ను లోలార్క్ ఘాట్ అని పిలిచేవారు. 1941లో తులసీ ఘాట్‌ను పారిశ్రామికవేత్త బల్‌దేవ్ దాస్ బిర్లా, సిమెంటుతో శాశ్వత నిర్మాణం చేయించాడు.[1]
తులసీ ఘాట్ | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 25°17′23.4″N 83°0′23.435″E / 25.289833°N 83.00650972°E |
దేశం | భారతదేశం |
తులసీ ఘాట్‌లో పడవ ద్వారా యాత్రలు చెయ్యవచ్చు. ఒక ప్రైవేటు పడవను అద్దెకు తీసుకుని అన్ని ముఖ్యమైన ఘాట్‌లను సందర్శించవచ్చు, గంగానదిపై సూర్యోదయాన్ని చూడవచ్చు.
తులసీ ఘాట్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు
మార్చుతులసీ ఘాట్ లోని లోలార్క్ కుండం వద్ద లోలార్క్ షష్ఠి (పుత్ర సంతాన ప్రాప్తి, సంక్షేమం కోసం నిర్వహిస్తారు), కుష్టు వ్యాధి వంటి చర్మ వ్యాధుల నుండి విముక్తి కోసం పవిత్ర స్నానాలు చేస్తారు. లోలార్క్ షష్ఠి పండుగ భాద్రపదంలోని శుక్ల షష్ఠి నాడు వస్తుంది.[2] కార్తీక మాసంలో ఇక్కడ కృష్ణ లీలలు (నాగ్ నాథయ్య పండుగ) ప్రదర్శిస్తారు.
దొంగతనం
మార్చు2011 డిసెంబరులో తులసీదాస్ రచించిన రామచరితమానస్ ప్రతిని తులసీ ఘాట్‌లోని హనుమాన్ దేవాలయం నుండి దొంగిలించారు. 1623 లో లభించిన ఈ అవధి భాష లోని గ్రంథం 1701 నుండి ఈ ఆలయంలో ఉంది.[3]
మూలాలు
మార్చు- ↑ "Tulsi Ghat Ganga Ghats of Varanasi". Retrieved 7 January 2017.
- ↑ "::Uttar Pradesh Tourism, Official Website of Government of Uttar Pradesh, India ::". Archived from the original on 3 May 2011. Retrieved 2012-05-18.
- ↑ Srivastava, Piyush (24 December 2011). "Tulsidas's rare manuscript stolen from Varanasi temple". indiatoday.intoday.in. Retrieved 24 February 2012.