తూతూ మంత్రం
మానవ సమాజంలో కొన్ని పురాతన సాంప్రదాయాలుంటాయి. వాటిని తప్పకుండా పాటించాల్చిందే. అలా పాటించకపోతే అది అతి పెద్ద పొరపాటు. కాని వాటిని యధాతదంగా పాటించడం అంత సులభ సాధ్యంకాదు. దానికి ప్రత్యామ్నాయంగా కొంత మంది పెద్దలు, మతాధిపతులు ఆయా వ్యవహారాలను నెరవేర్చడానికి కొన్ని ప్రత్యామ్నాయ పద్దతులను తమ వ్యక్తిగత హోదాలో సూచిస్తుంటారు.
ఉదాహరణకు పెళ్లిల్లలో/ చావు సందర్భంలో/ ఇలా అనేక సందర్భాలలో చేయవలసిన కార్యక్రమాలు చాలావున్నాయి సమాజంలో....కానీ ఈ రోజుల్లో ఆయా కార్యక్రమాలను యధాతదంగా నిర్వర్తించడము కుదరదు. కనుక ప్రజలు ఆయా కార్యక్రమాలను అయిందనిపించడానికి తమతమ కుల / వ్యక్తిగత / లేదా సమయానుకూలంగా అసలు సాంప్రదాయంలో కొన్ని మార్పులుచేసి ఆ విధంగా పని అయిందనిపించి కార్యం నెరవేర్చడాన్ని తూతూ మంత్రం అంటారు.