తృణ కుటుంబము

(తృణకుటుంబము నుండి దారిమార్పు చెందింది)

తృణ కుటుంబము

మార్చు

వరి మనకు ముఖ్యాహార పదార్థముగాన వానిని విస్తారము సాగు చేయు చున్నాము

ప్రకాండము మూడు నాలుగడుగులెత్తు పెరుగును. ఇది సన్నము గాను కొంచెము నాలుగు పలకలుగాను నుండుడును. కణుపుల వద్ద మాత్రము గట్టిగ నుండి మిగిలినిన చోట్ల బూలగ నుండును.

ఆకులు లఘు పత్రములు. ఒంటరి చేరిక. పాద పీఠము గలదు. ఇది ప్రకాండమును జుట్టికొని యుండును. పత్రమును పాద పీఠమును గలియు చోట పొలుసు వంటిది యొకటి గలదు. పత్రము సన్నముగా నుండును. సమ రేఖ పత్రము. సమాంచలము కొన సన్నము.

పుష్ప మంజరి
కొమ్మల చివరలనుండి రెమ్మ కంకులు. వీనిలోను తుంగ మొక్కలందు వలె నల్ప కణికములు గలవు. వీనిలోను, పుష్ప కోశము, దళ వలయము లేదు. అల్ప కణికములలో తుషములు గలవు. కొన్ని తుషముల కెదురుగ, నట్టివియే, అంత కంటే పలుచని గలవు. వీనికి బుసమని పేరు. ముఖ్యముగగు పుష్పాంగము లీ రెండిటికి మధ్య నుండును. అచ్చట కింజల్కములు అండ కోశమే గాక దళసరిగా నున్న పొలుసుల వంటివి రెండు గలవు. వీనికి ఉన్మద్రకము లని పేరు. వీని మూళముననే తుషము బుసము విప్పారును. ఒకయల్ప కణిశములో మూడు తుషములుండును. మూడవ తుషమునకే బుసము గలలదు. వీని మధ్య పుష్పము గలదు.
కింజల్కములు ఆరు. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
అండ కోశము. అండాశయము ఒక గది. ఒక అండము, కీలము రెండుగా చీలి యున్నది. కీలాగ్రము పక్షి రెక్క వలె నున్నది.

అన్ని కుటుంబముల కంటెను తృణ కుటుంబమే పెద్దది. ఈ కుటుంబపు మొక్కలు ప్రపంచమంతటను గలవు.

ఇవన్నియు చిన్న మొక్కలే. ఎత్తుగా పెరుగునవి చెరకు,. ఎదురు మాత్రమే. వీనికి సాధారణంగా మూల వహములుండును. అందు చేతనే గడ్డిని పైపైన చెక్కి వేసిన మరల త్వరగా పెరిగి వచ్చు చుండును. వీనికి కొమ్మలు తరుచుగా నుండవు. పుష్పములు చాల మార్పు చెంది యున్నవి. పువ్వుల రేకులు లేవు. రక్షక పత్రములు లేవు. పువ్వులు కొన్ని సపుంసకములు. కొన్ని మిధునములు. కొన్ని ఏక లింగ పుష్పములు. అండాశయము ఒక గదియె. వీనిలే గొన్నిటికి యందు చిట్ట చివర నున్న తుషములో సదా ముధున పుష్పముండును. వరి కొన్నిటి యందు చిట్ట చివర సదా పురుష పుష్పమో, నపుంసక పుష్పమో యుండును. ఈ లక్షణమును బట్టి ఈ కుటుంబమును రెండు ముఖ్య భాగములుగ విభసించి యున్నారు.

వరి ప్రపంచములో కెల్ల మన దేశములోనె ఎక్కువగా పండు చున్నది. మన దేశములో సాగగు 20,76,83, 741 ఎకరములకును 7,34,00,522 ఎకరములు వరి పంట క్రింద నున్నవి. హిందూ స్థానము కంటే మన రాష్ట్రములోనే ఎక్కువ పంట గలదు. 66,04,400 ఎకరములు వరి పండు చున్నది. వరిలో పలు రకములు గలవు. నాలుగు వేల రకములకు తక్కువ లేవు. వీని సేద్యము రకమును బట్టియు

భూసారమును బట్టియు నుండును. మిక్కిలి సార వంతమగు నేలల మీద కొన్ని రకముల వరిని మూడు పంటలనైన పండించ వచ్చును. వీని పంట కిట్లు చేయు చున్నారని చెప్పుట కస్టము. పాలువురు పలు విధములుగా చేస్తున్నారు. కొందరు పొలము దున్ని విత్తులు వెద జల్లు చున్నారు. కొందరు ఒక పంటకు వెద జల్లి రెండవ పంటకు ఆకు పోసి ఊడ్చు చున్నారు. కొన్ని చోట్ల ఆకు మళ్ళు జల్లి ఊడ్చిన గాని పంట పండుట దుర్ఘటము. వర్షములకు కొంచము ముందు కొంచ మెత్తుగా నున్న చెక్కలలో నాకు జల్లెదరు. ఆకు మళ్ళకు నీరు విస్థారముగ నున్న యెడల నది పోవుటకును, తక్కువగా నున్న యెడల నీరు పెట్టుటకును వీలుగ నుండ వలెను. విత్తనములు త్వరగ మెలకెత్తుటకు వానిని జల్లుట కొనదినము ముండు వానిపై కొంచము నీరు జల్లి గాలితగల కుండ కప్పుదురు. లేదా వానిని బస్తాలలో పోసి ఒక రాత్రి వానిని చెరువులోనో కాలువలోనో నాన బెట్టుదురు. ఆకు బాగుగ నెదిగిన పిదప దానిని దీసి దున్ని, ము చేసిన పొలములో నూడ్చెదారు. వరి పంటయు రకమును బట్టి యుండును. కొన్ని మూడు నెలలకె పంటకు వచ్చును. కొన్ని చాల ఆలశ్యముగ పంటకు వచ్చును. చేను కోతకు వచ్చు నప్పటికి అందు నీరుండ రాదు. చేను కోసి కుప్పలు వేసి నూర్చెదరు. ఈ నూర్చుట ఎడ్లచే తొక్కించుటయే గాక బల్లలతో కొట్టుట వలన కూడా జరుగు చున్నది. వరినంతయు రెండు ముఖ్య భాగములుగ విభజింప వచ్చును. పెద్ద వరులు, దాళ వాలు, పెద్ద వరులలో సాధారణంగా ఆట్ర కడాలను జల్లుదురు. దీని పంటకు నీరు చాల కాయలయును.

==కొసారులు==

కొంచెముపచ్చగా నుండును. వీని గింజలు చిన్నవి. వీని నంతగా సేద్యము చేయుట లేదు.

==కృష్ణ నీలాలు==
ధాన్యము చిన్నవి. కొంచెము నీలపు వర్ణము గలదు గాని బియ్యము తెల్లగానే యుండును. ఈ బియ్యము సన్నముగా నుండును. వీనిని తరుచుగా ఆవిరి మీద వండుదురు.
==బంగారు తీగలు==
సువరములు, కృష్ణ కాటుకలు, కొణామణులు, అక్కుళ్ళు, ప్రయాగలు, రత్న భోగములు మొదలగు పెక్కు రకములు గలవు.

దాళ వాల పంట పెద్ద వరి పంట కంటే తక్కువ కాలము పట్టును. ఇవి తినుటకంతగా బాగుండవు. కాని బీద సాదలును ఉప్పుడి బొయ్యమునకును వీనుపయోగించు చున్నారు. వీనిలోను, గౌరి కుంకాలు కొడమలు, బుడమలు, మొదలగు పెక్కు రకములు గలవు.

ధాన్యము సగము వండి చల్లార బోసి దంపినచో నవి ఉప్పుడు బియ్యమగును. అవి పేద వారు తప్ప మన దేశములో ఎవరు దినరు. కాని ఎగుమతి అగునవి విస్తారము. ఉప్పుడు బియ్యమే. ధాన్యము నుండి బియ్యము చేయుట కిప్పుడు మరలు గలవు. కాని మర బియ్యముకంటె దంపుడు బియ్యమునే మనమెక్కువ వాడు చున్నాము. ఇదివరకు పై కెగుమతి యగు ధాన్యము మీద బన్ను ఉంది. 1875 సంవత్సరమునుండి నీలి, లక్క, నూనె, ధాన్యము, మొదలగు వాని మీద పన్నుండెడిది గాని, కొన్ని సంవత్సరములైన తరువాత ధాన్యము మీద నుంచి ఇతర వస్తువులపై పన్ను దీసి వేసిరి. ప్రపంచములో చాల దేశములకు మన దేశము నుండియే, ధాన్యమో, బియ్యమో, పిండియో ఎగుమతి అగు చున్నవి. ధాన్యము దంపగా వచ్చు తవుడు చిటు పశువులకు ముఖ్యాహారము. ఊక కంసాలి వాండ్రకు అవస్యకము.

గోదుమ

మార్చు

గోదుమలను ఐరోపా దేశస్తులంత విశేషముగ మనము వాడక పోయినను మన దేశమునందును చిరకాలమునుండి సేద్యము చేయు చున్నాము. గోదుమల పంట విషారముగ హిం దూస్థానము నందే గలదు. దక్షిణ దేశమునంది వేడిమియు వర్షములును ఎక్కువగా నుండును కావున వీని పంటకంత అనుకూలముగ నుండదు. గోదుమలతో గలపి ఇతర పైరులను కూడా చల్ల వచ్చును. ఒక భూమిలో నేటేట వానినే జల్లుట కంటే ఒక సంవత్సరము వానిని రెండవ సంవత్సరము చిక్కుడు కుటుంబము లోని దగు నేపైరునైన చల్లుట మంచిది. చిక్కుడు కుటుంబములోని వానిని జల్లుట వలన భూమి సార వంతమగును., కాని సారము తగ్గదు. గోదుమలలో నాలు ముఖ్య మైన అరకములు గలవు, 1, తెల్లగాను మెత్తగాను నుండును. 2, తెల్లగాను గట్టిగాను నుండును. 3. ఎర్రగాను మెత్తగాను, 4. ఎర్రగాను గట్టిగాను నుండును. పంజాబు రాష్ట్రమునందు 10,184 ఎకరములు గోదుమలు పండు చున్నవి.

గోదుమల పంటకు మెరక నేలలందు వర్షములకు ముందును, పల్లపు నేలలందు వర్ష ఋతువైన పిదపను సాగు చేయుట నారంభింతురు. వీని కప్పుడప్పుడు తెగుళ్ళు పట్టు చుండును. ఇవి లేత మొక్కలుగ నున్నప్పుడొక విధమైన బూజు ప్రవేశించి కంకులలో చేరి యుండును. మొక్కకు తెగులు గుట వెన్ను లీను వరకును తెలియ రాదు. చేలు నాలుగు మాసములకు పంటకు వచ్చును. గోదుమలకు మన దేశము నందంత వాడుక లేదు. మహారాష్ట్రులు, పంజాబు దేశస్థులు మొదలగు వారు గోదుమ రొట్టెలను దిందురు. చాల కాలము వరకు గోదుమల యెగుమతిలో మన దేశమును పరిగణింప నక్కర లేదను కొనిరి గాని ఇటీవల ఆ అభిప్రాయము మారెను. 1904 సంవత్సరములో ఇంగ్లాండు దేశానికి ఇతర దేశముల నుండి కంటే మన దేశమునుండియే ఎక్కువ గోదుమలు వెళ్ళెను. కాని తరువాత మన ఎగుమతి తగ్గెను. మనమును గోధుమలను గోధుమ పిండిని కూడా దిగుమతి చేసి కొను చున్నాము.

ముక్క జొన్నలు

మార్చు

ముక్క జొన్నలు చిరకాలము క్రిందట పోర్చు గీసువారు అమెరికా దేశమునుండి తెచ్చి మన దేశములో నాటిరి. అవి ఇప్పుడెక్కువగానె మన దేశములో సిధ్దమగు చున్నవి. దాదాపు 6012230 ఎకరములు వాని పంట క్రింద నున్నవి. కాని హిందూస్థానము నందేగాని మన రాష్ట్రములో అంత సాగగుట లేదు. సారవంత మగు భూములందు వానిని చల్లినను లాభ మంగగా లేదు. ఈ పైరు వలన ఎకరమునకు నిరువది యైదు రూపాయల లాభమున కంటే ఎక్కువ రాదు. కాని రెండ వంటగ జల్లిన జల్లవచ్చును. వీనిలోను చాల భేదములు గలవు. కొన్ని కొంచెమెర్రగా నుండును, కొన్నింటి గింజలు పెద్దవి, కొన్నిటిలో బంతులు మెలిదిరిగి యుండును. కొన్నిటిలో వంకర టింకరగా నుండును. ఇవి రకమును బట్టి మూడు ఆరు నెలలకు మధ్య పంటకు వచ్చును. మనము లేత పొత్తులను కాల్చి తినుటయే గాని అంఅగా వాడుట లేదు. హిందూ స్థానమునందు కొందరు ముదురు గింజలను పిండిగాగొట్టి ఆపిండితో రొట్టెలు మొదలగునవి చేసి కొందురు. గింజలనుండి చెక్కెర వంటి పదార్థము చేసి దాని నుండి బ్రాందిని చేస్తున్నారు. అట్లు బ్రాంది చేయగా మిగిలిన తుక్కు నుండి రబ్బరు చేయుట ఇటీవల నేర్చు కొనిరి. గింజలనుండి చమురు దీస దానిని సబ్బు మొదలగు నవి చేయుటకు వాడు చున్నారు. కాడలును ఆకులును కాగితములు చేయుటకు పనికి వచ్చును. వీనిని పశువులు తినును గాని ముదిరినచో దినలేవు. మొక్క జొన్నల వర్తకము మన దేశమున కంతగా లేదు.

జొన్నలు

మార్చు

జొన్నలు కూడా మన దేశములో విశేషముగనే బండు చున్నవి. ఇవి నీరు దొరకక వారికి పనికి రాని మెట్ట నేల లందు పైరు చేస్తున్నారు. జొన్న పంటకు అరిష్టము లును చాల గలవు. మొక్కలు లేఅగా నున్నప్పుడొక విధమగు బూజు ప్రవేశించి మొక్కలను నాశనము చేయును. ఈ ఆపదను పో గొట్టుటకు విత్తనములను కొంచెము సేపు వేడి నీళ్ళలో నైన (మిక్కిలి వేడి నీళ్ళలో చాలపు వుంచిన నవి చచ్చి పెరుగనే పెరుగవు) మైల తుత్తపు నీళ్ళలోనైన నాన బెట్టవలెను. కానికి లీన బోవునపుడు పక్షులు మిడతలు వచ్చి తిని వేయ కుండ కాపాడు చుండ వలెను. ప్రత్యేకముగను ఎప్పుడును జొన్నలనే జల్లుట కంటే కందులు, అనుములు, గోగు మొదలగు వానితో కల్సి గాని ఒక సంవత్సర మవి రెండవ సంవత్సర మివి జల్లిన గాని మంచిది.

జొన్నలు కొందరు అన్నంవండుకొని తిందురు. వానానినరిగించుట కొనుటకు కష్టము. వాని ఆకులు, కాడలు పశువులకు బలము నిచ్చును. వీనిలో నాలుగైదు తెగలు గలవు.

తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు, ఎర్ర జొన్నలు అని భేదములు గలవు.

గడ్డి జొన్నలు ఇసుక నేలలో ఒకటి, రెండు అడుగులెత్తు పెరుగును గాని మిక్కిలి సారవంతమైన చోట్ల పది, పదునైదడుగులెత్తు కూడా పెరుగును. వీని కణుపుల వద్ద వేళ్ళు పారును. ఆకులు నున్నగనే యుండును గాని అంచులు మాత్రము గరుకుగా నుండును.

పెద్ద చోళ్ళ కాడలు నిడువుగాను, బల్ల పరుపు గాను రెండు మొదలై దడుగు లెత్తు వరకు పెరుగును. ఆకులు కాడకు రెండు వైపులనే యుండును. చోళ్ళ కంకులు వంగి యుండును. కాని పెద్ద చోళ్ళ కంకులు వంగి యుండవు. ఇవి అంత కంటే ఎత్తుగా నుండును. వీణి గింజలును పరువుగా నుండును. వీని పంటకు అప్పుడప్పుడు నీరు తగులు చుండ వలెను గాని చేనులో నిలకడగా నుండ రాదు. నూతులు, చెరువుల ఆధారమున్న చో నెప్పుడైనను పంట పండింప వచ్చును. గాలి లేనిచో వర్షకాలము వఱకు వేచి యుండ వలెను. క్రొత్త చోళ్ళు క్రొత్త బియ్యము వలెనే పాత వాని యంత బాగుండవు. వీనిని బీదలు తిందురు. ఇవియు బలమగు ఆహారమే. వీని నుండి కొన్ని చోట్ల సారాయిని కూడా దీయు చున్నారు.

అడవి చోళ్ళు మొక్కలు ఒకటి రెండడుగు లెత్తు పెరుగును. వానిపై తెల్లని రోమములు గలవు. గింజలు మూడు పలకలుగా నుండు. వీనిని పశువు లంతగా దినవు.

నిమ్మ గడ్డి

మార్చు

నిమ్మ గడ్డి లోను చాల రకములు ఉన్నాయి. కొన్ని ఆరడుగుల వరకు పెరుగును. నీని కణుపు సందులందు చిగుళ్ళు పుట్టు చుండును. ఈ చిగుళ్ళను నాటినను మొక్కలు మొలచును. వీని యల్పకణిశములు జతలు తజలుగా నుండును. వీని ఆకులకు నిమ్మ వాసన గలదు. దీని కాడలను ఆకులను కూరల లోను మజ్జిగ లోను వేసి కొందురు. ఆకులను తేయాకు వలె గాచి కొందరు త్రాగుదురు. కాడలను గోసి కట్టలు గట్టి వానికొక రాగి డేదిస లోవేసి బట్టి పట్టి చమురు తీయు చున్నారు. ఈ చమురు సబ్బులలో వేయుటకును, అత్తరవులో వేయుటకును, సుగంధ ద్రవ్యములు చేయుటకును వాడు చున్నారు.

పెద్ద కంట్లు ఇసుక నేలలో బాగుగ పెరుగును. వీని కంతగా వర్షమక్కర లేదు. వానలకు ముందె వీనిని జల్లెదరు.

ఇవి మూడు మొదలు ఆరడుగుల ఎత్తు వస్రకు పెరుగును. వీనిలో పిట్ట గంట్లు, ఎర్రగంట్లు మొదలగు భేదములు గలవు.

కొర్రలు

మార్చు

కొర్రలు ఒక గింజ నుండియే నాలుగైదు కాడలు బయలు దేరు చున్నవి. ఇవి గుండ్రముగా మూడు మొదలు ఆరడుగుల యెత్తు వరకు పెరుగును. ఆకులు గరుకుగా నుండును. కొఱ్ఱలను బీదలు తిందురు.

నక్క కొఱ్ఱలు మెట్ట పంటలు పండు చోట పెరుగును. అవి మూడడుగులు ఎత్తు వరకు పెరుగును. కాని ఒక్కొక్కప్పుడు నేల మీదనఏ పడి యుండి వేళ్ళు వేయు చుండును. అల్ప కణిశముల క్రింద బిరుసగు రోమములు గలవు.

బొంత చామలు మెట్ట పంట. కాడలు రెండు మొదలు నాలుగడుగుల ఎత్తు వరకు నుండును ఆకుల అంచులు గలవు. చిరుకంకులు దగ్గిర దగ్గిరగా నుండును. వీనిని సాధారణముగా, బొలములలో వెద జల్లుదురు కాని ఆకు నీళ్ళు పోసి యూడ్చరు. కొన్ని చోట్ల ఆరు వారములకే పంటకు వచ్చును. వీనిని బీదలు తిందురు.

నల్ల చామలు ఆకులు పొడుగుగాను, సన్నగా నుండును. కంకులు గోదుమ వర్ణము ఇవియు మెట్ట పంటయే. వీనిని తిందురు.

వర్గలు నాలుగడుగులెత్తు వరకు పెరుగును. వాని మీద రోమములు గలవు.

వీనిని అన్నము వండుకొని తిందురు. కొన్ని దేశములందు వివాహాది శుభ కార్యము లందు వర్గులను పాలు పంచ దార కలిపి వండక మానరు.

చెరుకు

మార్చు

మన దేశమునందంటటను సాగు చేస్తున్నారు. పంచ దార బెల్లము నిచ్చు మొక్క లితరములున్నని మన దేశములోనిదియే ముఖ్యము. మన రాష్ట్రములో చెరుకు బళ్ళారి, కడప అనంతపురము, గోదావరి, విశాఖ పట్టణం, ఆర్కాటు, కోయంబత్తూరు, సేలము జిల్లాలలో ఎక్కువగ పండు చున్నది. చెరకు పంటకు సంవత్సరమునకు పది మాసములు నీరు సమృద్ధిగ నుండ వలెను.

చెఱుకు గడలను గాని పైనుండు దవ్వ వంటి ముక్కలను గాని మూరెడు మూరెడు ముక్కలుగా కోసి, నిలుగ పాతి పెట్టక, పడుకొన బెట్టి పైనున్న మన్ను గప్పుదురు. కొన్ని చోట్ల అట్లు పాతుటకు పూర్వము గోతులు దీసి, వానిలో గడ్డి పరచి, దానిమీద ముక్కలను బెట్టి తడిగడ్డి కప్పి వారము దినములుంచెదరు. మొదటి నెలలో వారమున కొన నాడు నీరు పోయుచుండ వలెను. త్రువాత ప్రతి పదునైదు దినములకును తడి పెట్టు చుండ వలెను.

చెరుకునకు, చేప పెంట, పేడ ముఖ్యమైన ఎరువులు. తెలక పిండి, ఆముదపు తెలక పిండి మొదలగునవి మధ్యమములు. ఎముకలు మొదలగునవి మూడవరకము. చెరుకునకు తెగుళ్ళు కలుగుట కూడా ఉంది. ఆకుల లోను, గడలలోను బూజు పట్టి ఎర్రని చుక్కల వలె నగుపడును. కొన్ని పురుగులు వానిని తొలిచి తిని వేయును. ఎలుకలు నక్కలు కూడా వానిని ధ్వంసము చేయు చుండును.

ప్రతి సంవత్సరము నొక చోట చెరుకు వేయుట కంటే సంవత్సరము విడిచి సంవత్సరము వేసిన మంచిది. కాని కొన్నిచోట్ల చెరుకు గడలను పూర్తిగా పెరికి వేయక వాని మొదల్ళునుంచెదరు. అవి మరుసటి సంవత్సర మెదిగి పంటకు వచ్చును. కాని ఏటేటికి సారము తగ్గి పోవును.

చెరుకుల లోను చాల రకములు గలవు. కొన్ని చిన్నవిగానే యుండును. కొన్ని చాల పెద్దవి. కొన్ని తినుటకు వీలుగాను మెత్తగాను నుండును. కొన్ని ఎర్రగా నుండును. కొన్నిటిపై దగ్గర దగ్గర చారలు గలవు.

చెరుకు క్ర్రలను కోసి గానుగులలో పెట్టి ఆడుదురు. ఈ గానుగలు నూని గానుగులవలె నుండవు. ఇంచు మించు డోలంత లావున, అంత పొడుగున రెండు ఇనుపవి యుండును. అవి నున్నగా నుండక అంచులు అంచులుగా నుండును. వాని మధ్యను ఒక్కొక్క మారు మూడు నాలుగు గెడలను పెట్టు చుందురు. కారెడు రసమంతయు అడుగున వున్న కుండలో పడు చుండును. ఏడెనిమి కుండల రసము వచ్చిన తరువాత దానిని పెద్ద పెనములలో పోసి కాచి బెల్లము వండుదురు. కాచుటకు చెరకు పిప్పియే పనికి వచ్చును. అందులోని మురికి పోవుటకు సున్నమునో, పాలనో చమురో, జిగురో వేసెదరు. మురికి పైకి తేలగనె దానిని దీసి వేయుదురు. బెల్లమునకు సున్నమెక్కువైన కొలది గట్టి వచ్చును. ముదరగాగ మునుపే చెరుగు పానకము దీసి దాని తోడను పటిక బెల్లము వండుదురు.

యంత్ర శాలలందు చెరుకును పలుచగను అయి మూలగను ముక్కలు ముక్కలు క్రింద యంత్ర సహాయమున జీల్చెదరు. ఆ బ్రద్దలను వేడి నీరున్న మరియొక దానిలో పెట్టగ చెక్కెర యంతయు నీటిలోనికి దిగును. ఈ విధమున చేయుట వలన గానుగాడిన దాని కంటే ఎక్కువ చెక్కర వచ్చును. దినిని సున్నము తోనైనను పాలతోనైన కాచి శుభ్ర పరచెదరు. ఆద్రవము నుండి నీరు పోయి పంచదార మిగులుటకు దానిని పెనుమలలో పోసి కాతురు. పంచ దార పలుకులు పెద్దవిగా నుండుట చిన్నవిగా నుండుట ఈ కాచిన పద్ధతిని బట్టి యుండును. తరువాత దాని రంగును పోగొట్టి తడి లేకుండా చేసి శుభ్ర పరచుదురు. పంచ దార వండగ మిగిలిన పదార్థముల నుండి రమ్ము, బీరు సారాయిలను చేయుదురు. చెరుకు పిప్పితో కాగితములు చేయ వచ్చును గాని దీనిని యంత్ర శాలల వద్దకు కొనిపోవుటయు చెరుకు గానుగల వద్దకు పంట చెరుకు దెచ్చుటయు చాల ప్రయాస మగును.

ప్రపంచములో కొన్ని దేశములు బెల్లము నెరుగక మునుపే మనము బెల్లపు వర్తకము నారంబించితిమి. కాని ఇప్పుడు ఐరోపా దేశస్తులు యంత్ర సహాయమున చౌకగా చేయుట నేర్చు కొనుట చేతను, ఒక దుంప నుండి చౌకగ పంచ దార చేయుట చేతను మన వర్తకము తగ్గి పోయింది. మనమే ఇప్పుడు పంచ దార నన్ని దేశములనుండి తెప్పించుకొను చున్నాము. 1902 సంవత్సరము వరకు అన్య దేశపు పంచ దార పైన పన్ను గలదు కాని దాన్నిప్పుడు కొట్టివేసిరి. చెరుకు గడలు పుష్పించి కాయలు గాయుట కూడా గలదు. వాని పుష్పములకు

వేరు వేరు తెగల పుప్పొడిని సమావేశము చేసినచో రకరకముల చెరుగు గడలు వచ్చును. కొన్ని చోట్ల అట్లును చేస్తున్నారు. మన దేశమునందును బర్మా దేశమునందూ గలసి 88800 ఎకరములు చెరుకు పండు చున్నది. పంచదార చేయుటకు 24 యంత్ర శాలలు గలవు. వీనిలో 19 బంగాళాదేశము లోనె గలవు. మంచి చెరుకును నాటుచు యంత్ర శాలల నెక్కువ చేసిన యెడల అన్య దేశముల నుండి వచ్చుట తగ్గును.చెరకు గెడల తినుటకు చాల బాగుండును. చెరుకులన్న ఏనుగులకు ప్రీతి మెండు.

వెదురు

మార్చు

వెదురు కొండల మీదను అడవుల లోని విరివిగానే పెరుగు చున్నది. వెదురు మొక్కలు గుబురుగా మొలచి అందముగా నుండుట చేత వానిని తోటలందును బెంచుచున్నారు. వెదురు గింజలు చెట్టున నుండగనే మొక్కలు మొలవ నారంబించును. లేత మొక్క అరంగుళముల పొడుగుగా నున్నప్పుడు క్రింద పడీ, నాటుకొని వేళ్ళు బారును. ఇవి పెద్దవగుటకు భూమి సారమును బట్టి పది మొదలు ముప్పది సంవత్సర ముల వరకు బెరుగును. కావున సగమెదిగిన వెదురును దుంపతో కూడా పెల్లగించి మూడడుగుల ;అ ముక్కను కోసి పాతి పెట్టుదురు. అది వేళ్ళు బారి మొలక లెత్తగనే వానిని దీసి వేరు వేరుగ పాతెదరు. వెదురు శీతోష్ణ స్థితులు సమగూడి మొలచు చుండినా మనమంతగ పాటు పడ నక్కర లేకయే పెరుగును. వాని నుండి కాగితములు, నారయు చేయుటకు బనికి వచ్చు పదార్థము మెండుగ వచ్చును. కాని, వాని నుపయోగించుటకు కొన్ని అటంకములు గలవు.

(1) కాగితములు మిక్కిలి అనుకూలముగ నుండు లేత చిగుళ్ళు సంవత్సరము పొడుగున దొరకవు. (2) అట్టి వానిని గోసి వేసితిమా మొక్కలు బాగు పడవు. (3) వెదుళ్ళు విశేషముగ అడవులలోను, అనారోగ్యమగు తావుల యందును పెరుగును. అవి పుష్పించెడు కాలము మిక్కిలి అనారోగ్య మైనది. కావున ఆకాలములో వానిని యంత్ర శాల వద్దకు కొని వచ్చుటకు కూలి వాండ్రు దొరకుట దుర్ఘటము. (4) వెదుళ్ళ యందున్న బిరుసగు రోమములు పని వాండ్రకు హాని చేయును. ఆ రోమములు తీసి వేయకున్న మంచి కాగితములు రావు.

సాధాన్యప వెదురు ఎబది అడుగుల ఎత్తు పెరుగును. ఇది గుల్ల వెదురుగాదు. దీనితో బల్లెములు, అమ్ములు, గొడుగు కామము, కుర్చీలు చేయుదురు.

గొడుగు కామ వెదురు. ఇరువది యైదు మొదలు నలుబది అడుగులెత్తు పెరుగును. ఇవి బర్మా దేశములో విస్తారముగ గలవు. కొన్ని మిక్కిలి సన్నముగ నుండును. కొన్ని ఇతర చెట్లు యాధారము లేకుండా బెరుగ లేవు. ఇవి బుట్టలు సంచులు అల్లుటకు చాల వీలుగ నుండును.

వెదుళ్ళలో నింక ఎన్నో రకములు గలవు. కొన్ని చాల లావుగ నుండును. వానిని బండ్లకు ఉపయోగించెదరు. కొన్నిటితో తవ్వలు, సోలలు కూడా చేయుదురు. కొంచెము సన్నముగా నున్న వానిని చెరుకున కాధారముగ నుండు నట్లు చెరుగు తోటలందు ప్రాతుదురు.

వట్టి వేరు

మార్చు

వట్టి వేరు నీటి తీరమున బెరుగును. ఆకులు సన్నముగ పొడుగుగ నుండును. అల్ప కణిశములు జతలు జతలుగ నుండును. వేళ్ళు సన్నముగను గోదుమ వర్ణముగను నుండును. ఎండు వానిని తడికలుగ కట్టి అమ్ముదురు. వానికి సువాసన గలదు. వేసవి కాలమందు వానిని ధనికులు కొని ద్వారములకు కిటికీలకు కట్టు కొందురు.

నాగ సరము

మార్చు

నాగ సరము. ఎనిమిది మొదలు పండ్రెండు అడుగులెత్తు పెరుగును. ఆకులు వంకరగా ఖడ్గము వలె నుండు. అల్ప కణికము లొక్కొక చోట ఒక్కొక్కటియే గలదు. వీనిలో కింజల్కములు రెండు. నాగ సరపు కడలతో పిల్లంగోరులను పాముల వాండ్లూదు నగ స్వరముల గొట్టములను చేయుదురు.

దూర్వాలు ప్రతి చోట మొలచు చున్నవి. ఇవి భూమి మీద ప్రాకుచునే యుండును. పువ్వులు పూచు కాడ ఆరంగుళములు మొదలు అడుగెత్తు వర్కు లేచును. ఇది పవిత్రమైన గడ్డి, విఘ్నేశ్వరునకు ప్రీతికరమని దీనితో పూజ సేయు చుందురు.

దర్భ గడ్డి

మార్చు

దర్భ గడ్డి కాడలు అడుగు మొదలు మూడడుగులెత్తు వరకు మొలచును. ఇదియు పవిత్రమైన గడ్డియే. దీనినన్ని బ్రాహ్మణ కార్యములందు ఉపయోగింతురు.

రెల్లు గడ్డి

మార్చు

రెల్లు గడ్డి కాలువ గట్లు మీదను తేమ గానుండు స్తలములలోని పెరుగును. అది సాధారణంగా 5 మొదలు పది అడుగులవరకు పెరుగును కాని మంచి భూమియైనచో 15 అడుగుల వరకు కూడా పెరుగును. వేరు లోతుగా పారి యుండును. ఆకులు సన్నముగాను బొడుగుగా నున్నవి. వాని అంచులు గరుకు. రెమ్మ కంకి కొమ్మల చివరనుండి, ఒకటి, రెండడుగులు వ్యాపించి యుండును. అల్ప కణిశములు జతలు జత్లుగా నున్నవి. ఒక దానికి కాడ గలదు. రెండవదానికి లేదు. దీని ఆకులను మెలి వేసి త్రాళ్ళను చేయుదురు. ఇది ఇండ్ల మీద కప్పుటకు ఉవయోగించును. ముదురు కా డలతో కలములు చేసి వ్రాసెదరు. దీనిని పశువులు తింవు గాని మిక్కిలి లేత మొక్కలను గేదెలు తినును.

ఆరింగ
తేమ నేలలందైదు అడుగులెత్తు వరకు బెరుగును. దీనిని పశువులు తినవు.
రేవ గడ్డి
సార వంతమగు నేలలందు నాలుగైదు అడుగులెత్తు మొలచును.
పుత్సంగలి
చెట్ల క్రింద డొంకలవద్ద పెరుగును. ఇది నేల మీద ప్రాకుచునే యుండును. ఆకులు గరుకుగా నుండును. పురుష పుష్పమునకు మీసము లేదు గాని మిధున పుష్పమునకు గలదు.
తుమ్మగరిక
నేల మీద ప్రాకుచునేయుండును. ఆకులు చిన్నవి నున్నగానే యుండును.
చిప్పబూరగడ్డి
నీళ్ళలో నాలుగడుగులెత్తు వరకు పెరుగును. ఇది నీళ్ళమీద తేలు చుండును. గింజలు తెలుపు.
చంగలి
నేల మీద బ్రాకు చుండును. ఆకులు చిన్నవి. అంచుల వద్ద మెత్త్ని రోమములు గలవు.
చీపురు గడ్డి
రాతి ప్రదేశములందు బెరుగును. కాడ గుండ్రముగ రెండు మూడడుగులెత్తు పెరుగును. దీని కాడలే చీపురు. దీని ముండ్లే దీనికి విత్తనములు.
ఉడత తోక గడ్డి
పచ్చిక భయళ్ళలో పెరుగును. ఆకులు మెండుగా గలవు.
శంఖిణి గడ్డి
ఒకటి రెండడుగులెత్తు పెరుగును. కాడయు ఆకులును బిరుసుగా నుండును. అల్ప కణిశములు మూడేసి గలవు. మధ్య దానికి కాడ లేదు.
ఎడ్డి గడ్డి
కాడ బల్లపరుపుగా నుండును. ఆకులు కాడకు రెండు వైపులనే యుండును. కంకి మీద అడుగున పురుష యల్ప కణిశములు గాని, నపుంసకములుగాని యుండును. పైన, మధ్య స్త్రీ యల్ప కణిశము దానికిరు పక్కల పురుష అల్ప కణిశము గలవు. స్త్రీ అల్ప కణికమునకు కాడ లేదు

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు

ఇవీ చూడండి

మార్చు