తెరచాప
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తెరచాప అనగా వస్త్రం యొక్క ఒక పెద్ద భాగం, ఇది కొన్ని పడవల యొక్క పై భాగాన ఉంటుంది. నీటిపై పడవను తరలించడానికి ఈ తెరచాపలు ఉపయోగపడతాయి, వీచే గాలి పవనాలు పడవ వెళ్లవలసిన వైపుకి వెళ్లెందుకు ఉపకరించేలా ఈ తెరచాపలను ఉపయోగిస్తారు. తెరచాపను కట్టేందుకు ఎత్తుగా ఉన్న భాగాన్ని మాస్ట్ అంటారు. కొన్ని పడవలు అనేక తెరచాపలను కలిగి ఉండగా, కొన్ని పడవలు ఒక తెరచాపను మాత్రమే కలిగి ఉంటాయి. సాధారణంగా చిన్న పడవలు ఒక తెరచాప కలిగి ఉండగా, పెద్ద పడవలు ఎక్కువ తెరచాపలను కలిగి ఉంటాయి. తెరచాపలతో ఉన్న పడవలను తెరచాప పడవలని అంటారు, వీటిని ఆంగ్లంలో సెయిలింగ్ బోట్స్ అంటారు. సెయిలింగ్ బోట్స్ యొక్క విభిన్న రకాల కొరకు తెరచాపల యొక్క విభిన్న రకాలు విభిన్న పేర్లతో ఉన్నాయి. బొగ్గు లేదా నూనెను ఉపయోగించి నడిపే యంత్ర పడవల తయారీకి ముందు, పూర్వ ప్రజలకు సముద్రం గుండా ప్రయాణించడానికి తెరచాప పడవలు ఒక ముఖ్యమైన మార్గంగా ఉండేవి. ప్రస్తుత రవాణాకు తెరచాపలు అంత ముఖ్యమైనవి కానప్పటికి, వినోదం, పోటీలలో వీటిని ఇప్పటికి ఉపయోగిస్తున్నారు.