తెలంగాణా ఆంధ్రోద్యమము
నిజాం పాలనలో తెలంగాణా ప్రాంతంలో ఆంధ్రోద్యమాన్ని చేసిన మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహునిగా చరిత్రకెక్కారు. తెలంగాణా ప్రాంతంలో ఆనాడు కొనసాగుతున్న భాషా సంస్కృతుల పరంగా తెలుగువారి అణచివేతను ఎదుర్కునే ప్రయత్నాలు చేశారాయన. ఈ గ్రంథంలో నిజాం రాష్ట్రంలోని ఆంధ్రప్రాంతాలు, వాటిలో ఆంధ్రుల భాషా సంస్కృతుల అణచివేత, దాన్ని ఎదిరిస్తూ ప్రారంభమైన ఆంధ్రోద్యమం, దానికి మద్దతు, వ్యతిరేకత వంటి వివరాలు అందించారు. ఈ అంశాలను పలు పత్రికల ఆధారంగా, స్వీయానుభవాల ఆధారంగా రచన చేశారు.
దీని మొదటి భాగము యొక్క నాల్గవ ముద్రణము ఆంధ్ర చంద్రికా గ్రంథమాల వారు 1949లో ముద్రించారు.
మొదటి భాగము
మార్చు- ప్రాథమికాంశాలు
- ఉద్యమారంభం
- ఆంధ్రజన కేంద్రసంఘము
- ఆశయములు; కార్యవిధానము
- గ్రంథాలయోద్యమము
- వర్తక సంఘములు
- వెట్టి చాకిరి
- పాఠశాలల స్థాపన
- ప్రచారకార్యము : లఘుపుస్తకములు; ప్రచారకులు
- ప్రచారకార్యము : ఉపన్యాస సభలు; వార్తాపత్రికలు
- సింహావలోకనము.