రాజులు, రాచరికాలు, అరాచకంగా రాజ్యాలేలిన చరిత్ర ప్రపంచ వ్యాప్తమే....... అది గతించిన కాలం. మన దేశంలో రాచరిక వ్వవస్త రూపు మాసి పోయి శతాబ్దాల కాలమే అయినది. బ్రిటిష్ వారి పాలనలో మెల్లి మెల్లిగా రాచరికపు వ్వవస్త రూపు మాసి పోయింది. దేశం మొత్తానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం వచ్చినా ఈ దేశంలోని మూడు సంస్థానాలలోని ప్రజలు స్వాతంత్ర్యానికి నోచుకోలేదు. ఆయా సంస్థానాల రాజులు మొండి పట్టుదలతో స్వతంత్ర భారత్ లో కలవ డానికి ఒప్పుకోలేదు. అవి హైదరాబాద్ సంస్థానం, కాశ్మీర్ రాజ్యం, జునాఘడ్ సంస్థానం. కాష్మీర్ రాజ్యంలో ప్రజలందరు ఎక్కువగా ముస్లింలు అయితే [[రాజు మాత్రం హిందువు]]. కాని హైదరాబాద్ సంస్థానంలో ప్రజలందరు ఎక్కువగా హిందువులైతె రాజు మాత్రం ముస్లిం. హైదరాబాద్ నైజాం తన రాజ్యాన్ని పరిపాలన సౌలభ్యంకొరకు చిన్న చిన్న విభాలుగా చేసి ఆ ప్రాంతాన్ని ఒక దొర చేతిలో పెట్టాడు. ఆ దొర ఆ ప్రాంతానికి జమీందారు. పరిపాలన అంతా అతని కనుసన్నలలోనె జరిగేది. అతనొక నియంత, క్రూరుడు. ప్రజలను పీడించుకు తినె వాడు. ఆ దొర సంవత్సరాని ఇంత అని నిజాంకు కప్పం కట్టే వాడు. స్థానికి పరిపాల అంతా తన ఇష్ట ప్రకారమే జరిపేవాడు. అప్పటికే ప్రజలు నిజాం పైన, స్థానిక పాలకుడైన దొరల పైన కోపంగా ఉన్నారు. ఇంతలో భారత ప్రభుత్వం ఈ సంస్థానాలను స్వతంత్ర భారత్ లో విలీనం చేయాలని ఒత్తిడి తెచ్చింది. దానిని వ్వతిరేకించిన నిజాము, అతని సహచరులు స్థానిక దొరలు ప్రజలపై పడి విపరీతంగా భాదించి దోచుకోవడం ప్రారంబించారు. దీంతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు నిజాము పైన, స్థానిక దొరలపైన సాయుధ తిరుగుబాటు చేశారు. నిజాముకు మద్దతుగా కొన్ని దుష్ట శక్తులు, ప్రజలకు మద్దతుగా స్థానిక కమ్యునిష్టులు, ఇతరులు, భారత ప్రభుత్వం నిలవగా ఏడాదికి పైగా ఆలస్యంగా తెలంగాణకు స్వాతంత్ర్యం లభించింది.

శిథిలావస్థలోని పోచారం గడి. అందులోని ఒక బురుజు. స్వంత చిత్రము
పోచారం గడిలోని మరొక బురుజు. స్వంతచిత్రము

నైజాం రాజ్యంలో స్థానిక పాలకులైన దొరలు నివాసాలకు, రాజరికపు అరాచకపు కార్యకలాపాలకు నెలవులైన కట్టడాలే గడీలు. అనగ చిన్న చిన్న కోటలే ఈ గడీలు. ప్రజల తిరుగుబాటు సమయంలో గడీల పాలకులైన దొర లు తమ భూములను, గడీలను వదిలి హైదరాబాద్ నగరానికి పారిపోయి నిజాం రక్షణలో ఆశ్రమం పొందారు. ఆవిధంగా వెల్లిన దొరలు నగరంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని జీవించ సాగారు. ఇప్పుడు భూములకు, స్థిరాస్తులకు విపరీతమైన విలువ పెరగడంతో ఆ మాజీ దొరలకు, లేదా వారి వారసులకు తమ గడీలు, తమ భూములు గుర్తుకొచ్చి తమ పల్లె బాట పట్టారు. తమ గడిలను, భూములను అమ్మకానికి పెట్టారు. కాని స్థానిక ప్రజలు ఆ గడిలు భూములు తమ శ్రమ దోపిడి ఫలితాలను కనుక అవి తమ ఉమ్మడి ఆస్తి అని దొరలకు అడ్డు తగులుతున్నారు. నిజాం లొంగు బాటుతో నిజాం పాలనా భవనాలు, ఇతర రాజరికపు కట్టడాలు ఎలా ప్రభుత్వం పరమైనాయే అదే విధంగ ఈ గడీలు, దొరల భూములు తమ ఉమ్మడి ఆస్తులని ప్రజల వాదన. ఈ వాధనతో గత కాలపు గడీల చరిత్ర మరలా తెరపైకి వచ్చింది. ఆ గడీల చరిత్ర కొంతైనా తెలుసుకోవాలనుకునే తెలియని ప్రజలకొరకు ఈ వ్యాసం.