తెలంగాణ ప్రాధమిక విద్యామండలి

తెలంగాణ ప్రాధమిక విద్యామండలి తెలంగాణ ప్రభుత్వం పరిధిలోనిది. తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెలంగాణ ప్రాధమిక విద్యామండలి ఆధీనంలో ఉంటాయి. ఇది జూన్ 2014లో ఏర్పాటుచేయబడింది.[1] తెలంగాణ రాష్ట్రంలోని ప్రాధమిక విద్యామండలి వివిధ కోర్సులులను విద్యార్థులకు అందించి వారికి విశ్వవిద్యాలయ చదువులకు సిద్ధం చేస్తుంది.

తెలంగాణ ప్రాధమిక విద్యామండలి
స్థాపన2016 మే 10 (2016-05-10)
ప్రధాన
కార్యాలయాలు
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు, ఇంగ్లీష్ & ఉర్దూ
జాలగూడుతెలంగాణ ప్రాధమిక విద్యామండలి

అనుబంధాలు మార్చు

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు తెలంగాణ ప్రాధమిక విద్యామండలికి అనుబంధంగా ఉంటాయి. అందేకాకుండా ఉన్నత పాఠశాలను కూడా ఏర్పాటుచేసి, నిర్వహిస్తుంది.

పరీక్షలు మార్చు

ప్రాధమిక విద్యామండలి ప్రతి సంవత్సరం అన్ని తరగతులకు ఆఖరి పరీక్షలను నిర్వహిస్తుంది. 10 తరగతికి సర్టిఫికేట్ తో కూడిన పరీక్షలు నిర్వహిస్తుంది.

మూలాలు మార్చు

  1. "Board Of Secondary Education, Telangana Formed". Archived from the original on 2017-04-30. Retrieved 2017-02-02.