తెలుగునాడు (చలనచిత్రం)

తెలుగునాడు 1982 అక్టోబరు 23న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వీరకాకాని పిక్చర్స్ పతాకం కింద బి.నారాయణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు పి.లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించాడు. శరత్ బాబు, ప్రసాద్ బాబు, కె.విజయ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి.శంకర్ సంగీతాన్నందించాడు. [1]

తెలుగునాడు
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం లక్ష్మీదీపక్
తారాగణం శరత్‌బాబు ,
ప్రసాద్ బాబు ,
కె.విజయ
సంగీతం వి.శంకర్
నిర్మాణ సంస్థ శ్రీ వీర కాకాని పిక్చర్స్
భాష తెలుగు

రజాకార్ల దౌర్జన్యాలు, ఆంధ్ర తెలంగాణా ఉద్యమాలు మొదలైన వాటితో ఆంధ్ర దేశాం ఎలా అల్ల కల్లోలమైందన్నదీ అత్యంత చక్కగా వివరించిన చిత్రం. ఇందులో కథను కూడా ఈ ఉద్యమాలను దృష్టిలో పెట్టుకునే అల్లర్లు. ఒక ఇంట్లో ముగ్గురు కోడళ్ళు ఉంటారు. వాళ్ళు విడిపోదాం, విడిపోదాం అని కోరుకుంటారు. (ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ) "అనైక్యత", "సమైక్యత" కోరుకునే వారి మధ్య సంఘర్షణ అయితే క్లైమాక్స్ లో కలసి ఉంటేనే కలదు సుఖం అని నిరూపించిన చిత్రం "తెలుగు నాడు. ఈ చిత్రం పాటల్లో కొసరాజు రాసిన

ఒకరు కలసి ఉండాలంటారు
ఒకరు వేరు పడాదామంటారు
ఏమిటయ్యా ఈ వేదాంతం
తెలుగు వాళ్ళ ఈ రాద్ధాంతం

అనే పాటను చక్కని అర్థవంతంగా ఉన్న పాట అని చెప్పవచ్చు. చిత్రం పూర్తయిన తరువాత కోర్టు తీర్పుతో విడుదలైంది.

స్వర్గీయ రమణారెడ్డి నటించిన ఆఖరి చిత్రం ఇది. దర్శాకుడు దీపక్ చాలా ప్రయాసలు పడి ఉద్యమ దౌర్జన్యాలను వాస్తవంగా చిత్రీకరించడం సాహసోపేతమైన విషయం.

తారాగణం

మార్చు
  • శరత్ బాబు
  • ప్రసాద్ బాబు
  • కె.విజయ
  • రమణారెడ్డి
  • రవికాంత్
  • భవాని
  • సుశీల


పాటల జాబితా

మార్చు

1.అదిగదిగో ఎగిరింది మువ్వన్నెల జెండా, రచన: మైలవరపు గోపి, గానం.పులపాక సుశీల బృందం

2.ఒకరు కలసి ఉండాలంటారు ఒకరు వేరుపడదామంటారు, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, గిరిజ

3 .కసికసిగా చూడని మిసమిసలే దోచని, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల

4.చేయి చేయీ చేరనీయి చేరనిచ్చి బాసచేయి , రచన: గోపి, గానం.శిష్ట్లా జానకి , వి. రామకృష్ణ

మూలాలు

మార్చు
  1. "Telugunaadu (1982)". Indiancine.ma. Retrieved 2023-05-31.

. 2…ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .

బాహ్య లంకెలు

మార్చు