తెలుగులో తొలి బైబిల్

అనువాదానికి రెండు శతాబ్దాల పూర్తి . బైబిల్ తెలుగు అనువాదం అందుబాటులోకి వచ్చి రెండొందల సంవత్సరాలు. ఈ పవిత్ర కార్యక్రమానికి వేదిక విశాఖ నగరమే. అప్పట్లో పూర్ణా మార్కెట్‌లోని లండన్‌ మిషన్‌ మెమోరియల్‌ చర్చి వేదికగా లండన్‌ మిషన్‌ ప్రతినిధులు బైబిల్‌ను గ్రీకు భాష నుంచి తెలుగులోకి అనువదించారు.

కాలక్రమం లో పరిణితి[1]

మార్చు

అనువాదానికి రెండు శతాబ్దాల పూర్తి . క్రైస్తవ మతగ్రంథం బైబిల్‌ తెలుగు అనువాదం అందుబాటులోకి వచ్చి రెండొందల సంవత్సరాలు. ఈ పవిత్ర కార్యక్రమానికి వేదిక విశాఖ నగరమే. అప్పట్లో పూర్ణా మార్కెట్‌లోని లండన్‌ మిషన్‌ మెమోరియల్‌ చర్చి వేదికగా లండన్‌ మిషన్‌ ప్రతినిధులు బైబిల్‌ను గ్రీకు భాష నుంచి తెలుగులోకి అనువదించారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీ ఈ గ్రంథం ముద్రణకు అనుమతిచ్చింది. 1818లో చెన్నైలో బైబిల్‌ కొత్త నిబంధన గ్రంథం మొదటి ముద్రణ చేశారు. తమిళనాడులోన వేదాంత కళాశాలలో విద్యను అభ్యసించేందుకు ఇంగ్లండ్‌ దేశంలోని లండన్‌ నుంచి 1804లో పలువురు వచ్చారు. వారిలో అగస్టస్‌ డెస్‌ గ్రాంజెస్‌, జార్జ్‌క్రాన్‌లు 1805లో విశాఖకు వచ్చారు. ఇక్కడ ఉంటున్న బ్రిటిష్‌ సైనికాధికారులకు ఆరాధన కార్యక్రమాలు నిర్వహించేవారు. వారిద్దరూ కొద్ది కాలానికే తెలుగును బాగా నేర్చుకున్నారు.

ఆ తరువాత బైబిల్‌ అనువాదానికి శ్రీకారం చుట్టారు. ఆనాడు టిప్పుసుల్తాన్‌ దర్బారులో ఉన్నతోద్యోగి ఆనందరాయర్‌ సహకారంతో ఈ మహత్కార్యాన్ని భుజానకెత్తుకున్నారు. అనువాదాన్ని ప్రారంభించిన జార్జిక్రాన్‌ 1809లో శ్రీకాకుళంలో చనిపోయారు. 1810లో అగస్టస్‌ డెస్‌ గ్రాంజెస్‌ మరణించారు.

[2]ఈయన సమాధి విశాఖలోనే ఉంది. ఆ తరువాత ఎడ్వర్డ్‌ ప్రీచట్‌, జాన్‌ గోర్డెన్‌ ఈ ప్రకియ్రను నగరంలోని ఎల్‌ఎంఎం చర్చి కేంద్రంగా కొనసాగించారు. అనువాదం పూర్తయ్యాక బ్రిటిష్‌, ఫారెన్‌ బైబిల్‌ సొసైటీ ఆగ్జలరీ ఆధ్వర్యంలో మద్రాస్‌ ప్రెసిడెన్సీ అనుమతితో చెన్నైలోని కమర్షియల్‌ ప్రెస్‌లో 1818లో ముద్రించారు. ఓ ప్రతిని నెదర్లాండ్స్‌లోనూ, ఇంకో ప్రతిని ఫిలడెల్ఫియాలోను భద్రపరిచారు.

లండన్‌కు చెందిన లారీ డిక్కర్‌ 2005లో ఓ కార్యక్రమం కోసం విశాఖ వచ్చినపుడు నెదర్లాండ్స్‌లో భద్రపరిచిన బైబిల్‌ గ్రంథాన్ని తీసుకొచ్చి ఎల్‌ఎంఎం చర్చికి బహూకరించారు. తొలి తెలుగు ఆరాధన... బైబిల్‌ అనువాదానికి సహకారం అందించిన ఆనందరాయర్‌ ఆధ్వర్యంలో విశాఖలో 1809లో తొలి తెలుగు ఆరాధన జరిగింది. అప్పటి వరకు ఆంగ్లంలోనే దైవారాధన చేసేవారు. పురుషోత్తం చౌదరి, పులిపాక జగన్నాధం, డాసన్‌దొర తదితరులు రాసిన తెలుగు ఆరాధన గీతాలతో ప్రార్థనలు విశాఖలోనే మొదలయ్యాయి. 1860 నాటికి విశాఖలో ముద్రణ. 1818 నాటికి విశాఖలో ముద్రణాలయం లేదు. అందువల్లనే తొలి ప్రతులను నాటి మద్రాస్‌లో ముద్రించారు.

దాదాపు 1860 నాటికి పాత నిబంధనతో సహా కొత్త నిబంధన గ్రంథాన్ని విశాఖలోనే ముద్రించారు. అంతకుముందూ ప్రయత్నం... బైబిల్‌ను తెలుగులోకి అనువదించాలని అంతకుముందే కొంతమంది ప్రయత్నించారు. 1727లోనే బెంజిమన్‌ షుల్జ్‌ పాత నిబంధన గ్రంథాన్ని తర్జుమా చేశారు. ఈ ప్రతులు జర్మనీలో ఉండడం వల్ల ముద్రణకు లభ్యం కాలేదు. విలియం కేరీ ఆధ్వర్యంలో అచ్చు వేసిన కొన్ని తెలుగు అధ్యాయాలు 1812లో సింగపూర్‌ ప్రెస్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో కాలిపోయాయి.

ఇలా పలు ఆటంకాలు ఎదురైనా చివరకు ఎడ్వర్డ్‌ ప్రిచెట్ ఆధ్వర్యంలో తొలి తెలుగు బైబిల్‌ గ్రంథం ముద్రితమైంది.

ఈ విషయంలో విశాఖ నగర ప్రాధాన్యం ఎంతో ఉంది. మొదటి ముద్రిత గ్రంథం ఎల్‌ఎంఎం చర్చిలో ఉండడం విశాఖ కు గర్వకారణం. ఈ సందర్భంగా రెండొందల ఏళ్ల ఘనతను చాటుకొనే అవకాశం కలిగింది.

ప్రత్యేక తపాలా కవర్‌

మార్చు

తపాలా శాఖ గుర్తించి ప్రత్యేక కవర్‌ ముద్రించడం .. పరిశుద్ధ బైబిల్‌ కొత్త నిబంధన గ్రంథం ముద్రణ జరిగి రెండొందల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పోస్టల్‌ శాఖ కొత్త కవర్‌ను ఇటీవల ఆ శాఖ ఉన్నతాధికారి బాలసుబ్రహ్మణియన్‌ విశాఖలో విడుదల చేశారు. కవర్‌ ముఖభాగాన ఎల్‌ఎంఎం చర్చిని ముద్రించారు. ప్రత్యేక వేడుకలు.. ఎల్‌ఎంఎం సిఎస్‌ఐ చర్చి ఆధ్వర్యంలో ద్విశత ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. గత కొద్ది నెలలుగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

 
విశాఖ లో పోస్టల్ కవర్ ను విడుదల చేసిన తపాలా శాఖ

రెండొందల సంవత్సరాల చారిత్రక నేపథ్యంపై. చర్చి ప్రాంగణంలో పైలాన్‌ను ప్రారంభిస్తారు.

అనువాదాలు

మార్చు

భాషరాని వారు ఎంతో కృషి చేశారు... తెలుగు భాష రాని వ్యక్తులు మన దేశానికి వచ్చి ఇక్కడ నేర్చుకొని బైబిల్‌ అనువాదానికి ఎంతో కృషి చేశారు.

తెలుగులో తొలి బైబిల్ ప్రచురించి ఈ ఏడాదికి సరిగ్గా రెండు వందల ఏళ్ళు పూర్తయింది. అవును 1818లో బైబిల్ కొత్త నిబంధన తెలుగు అనువాదం రెండు భాగాలుగా ప్రచురితమయింది.

17 - 18 శతాబ్దాల్లో క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో క్రియాశీలంగా ఉన్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా బ్రిటిష్ పాలన ప్రత్యక్షంగా ఉన్న ప్రాంతాల్లో వారి కార్యక్రమాలు చురుకుగా సాగాయి.

అందులో భాగంగా భారతీయ భాషల్లో బైబిల్ అనువాదాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సీరాంపూర్‌లో ఈ అనువాదాలు జరిగాయి.

ఒక డానిష్ లూథరన్ మిషనరీకి చెందిన బెంజిమన్ షుల్జ్ అనే వ్యక్తి మొదటిసారి 18వ శతాబ్దపు తొలినాళ్లలో బైబిల్ తెలుగులోకి అనువాదం చేశారు.

ఆ చేతిరాత ప్రతులను ప్రచురించడం కోసం అప్పట్లో జర్మనీ పంపారు. కానీ ఏ కారణం చేతనో అవి ముద్రణ కాలేదు. ఆయన రాసిన చేతిరాత ప్రతులు కూడా దొరకలేదు.

ఇది జరిగిన చాన్నాళ్ల తరువాత రెండు వేర్వేరు సంస్థలు, వేర్వేరు ప్రాంతాల్లో బైబిల్ తెలుగు అనువాదం ప్రారంభించాయి.

విలియం కేరీ ఆధ్వర్యంలో బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ సంస్థ ప్రస్తుత పశ్చిమ బెంగాల్లోని సీరాంపుర్ దగ్గర బైబిల్ అనువాద ప్రక్రియ ప్రారంభించింది.

తొలి తెలుగు బైబిల్‌ను 1818లో ముద్రించారు↵అదే సమయంలో లండన్ మిషనరీ సొసైటీ సంస్థ నుంచి అగస్టస్ దె గ్రాంజెస్. జార్జ్ క్రాన్ అనే వ్యక్తులు ఆనందరాయర్ అనే స్థానికుడి సహకారంతో విశాఖపట్నంలో ఈ అనువాద ప్రక్రియ ప్రారంభించారు.

కానీ విశాఖలో ఈ అనువాదం ప్రారంభించిన అగస్టస్ 1809లో, జార్జి 1810లో చనిపోయారు. దీంతో ఆ అనువాద ప్రక్రియను జాన్ గార్డన్, ఎడ్వర్డ్ ప్రిచెట్‌లు కొనసాగించారు.

వారు మరణించడానికి ముందే మాథ్యూ (Mathew - ముత్తయి), మార్క్ (Mark - మార్కు), ల్యూక్ (Luke - లూకా) అధ్యాయాలను పూర్తి చేశారు లేదా చేయించారు. ఈ మూడు అధ్యాయాలు 1812లో విలియం కేరీ ఆధ్వర్యంలోని మిషనరీ ప్రెస్‌లో ముద్రించారు.

బైబిల్‌కి సంబంధించిన ఒక భాగం తెలుగులో ముద్రించడం ఇదే మొదలు.

నిజానికి అదే సమయంలో సీరాంపూర్‌లో విలియం కేరీ ఆధ్వర్యంలో మరో అనువాదం కొనసాగుతున్నప్పటికీ, తాము చేస్తున్న అనువాదం కంటే విశాఖ నుంచి వచ్చిన అనువాదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముద్రించారు కేరీ.

అదే సందర్భంలో బైబిల్‌ను అన్ని భాషల వారికీ తక్కువ ధరకు చేరవేయాలనే ఉద్దేశంతో ‘‘బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ’’ అనే సంస్థ 1804లో లండన్‌లో ఏర్పడింది. బైబిల్ అనువాదాలు, పంపిణీ చేసే ఇతర సొసైటీలకు ఈ సంస్థ ఆర్థిక సహకారం అందించింది.

ఈ బ్రిటిష్ సంస్థకు అనుబంధంగా భారత్ లో 1811లో కలకత్తా ఆగ్జిలరీ బైబిల్ సొసైటీ ఏర్పడింది.

↵మొట్టముదట ముద్రించిన బైబిల్.. గుటెన్‌బర్గ్.. బిబిలికల్ హీబ్రూ భాషలో దీనిని ముద్రించారు↵మరోవైపు సీరాంపూర్ లోనూ, విశాఖపట్నంలోనూ బైబిల్ తెలుగు అనువాదాలు కొనసాగుతూ వచ్చాయి. రెండు అనువాదాలూ 1818 నాటికి పూర్తయ్యాయి. ముందుగా సీరాంపూర్‌లో సిద్ధమయిన అనువాదం ముద్రణకు వెళ్లింది.

అదే సమయంలో విశాఖలో జరిగిన అనువాదం కలకత్తా ఆగ్జిలరీ సొసైటీ ఆమోదం కోసం పంపారు. ఆ ప్రతిని పరిశీలించడం కోసం మద్రాస్‌లో ఉండే థాంప్సన్‌కి పంపించింది కలకత్తా సొసైటీ.

అప్పటికే మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు పండితుడిగా పేరు గాంచి క్యాంప్ బెల్, ఫోర్ట్ సెయింట్ జార్జ్ కాలేజీలో పనిచేసే మరో స్థానిక తెలుగు పండితుడు ఈ ప్రతిని పరిశీలించారు. వారిద్దరూ కలిసి ఈ అనువాదమే బాగుందని తీర్మానించారు.

‘‘సరళంగా, సులువుగా అర్థమయ్యేలా, సమగ్రంగా ఉందనీ, ప్రజలకు సరిపోతుందనీ, సాధారణ ఉపయోగానికి పనికొస్తుందని’’ వారు తెలిపారు. ఈ వ్యాఖ్యలు చూసిన కలకత్తా ఆగ్జిలరీ సొసైటీ, విశాఖలో తయారయిన ఈ ప్రతినే ముద్రించాలని తీర్మానించింది.

దీంతో ఈ ప్రతిని ఎడ్వర్డ్ ప్రిచెట్ ఆధ్వర్యంలో మద్రాసులో ముద్రించారు. అప్పటికే సీరాంపూర్ లో అనువాదమయిన ప్రతిని కూడా ముద్రించినా, విశాఖలో తయారయిన ప్రతినే తెలుగులో ప్రామాణింకంగా తీసుకుని, దాన్నే సరఫరా చేశారు. ఆ తరువాత ముద్రితమైన బైబిల్ అనువాదాలు కూడా దీని ఆధారంగానే వచ్చాయి.

↵బైబిల్‌ని తెలుగులో అనువదించే ఘనత దక్కించుకున్న లండన్ మిషనరీ సొసైటీ.. మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఉత్తర సర్కారులో (ప్రస్తుత కోస్తాంధ్రలోని ఉత్తర భాగాలు - విజయవాడ నుంచి పైన) ప్రారంభమైన తొలి ప్రొటెస్టెంట్ మిషనరీ.

1805లో వారు విశాఖ కేంద్రంగా కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ తరువాత విశాఖలో వచ్చిన మిషనరీలు కూడా తెలుగు అనువాదాలు కొనసాగించాయి.

అనంతరం బైబిల్ అనువాదాలను రివిజన్ చేసే కార్యక్రమం జరిగింది. మద్రాస్ ఆగ్జిలరీ బైబిల్ సొసైటీ ఒక బైబిల్ రివిజన్ కమిటీ వేసింది. అప్పుడు బైబిల్ తెలుగును రివిజన్ చేసిన వారిలో జాన్ హే, రెవరెండ్ పులిపాక జగన్నాథంల పేర్లు ప్రముఖంగా వినిపించాయి.

1818లో కేవలం బైబిల్ కొత్త నిబంధన మాత్రమే అనువాదం అయింది↵అప్పటికి పాత నిబంధన అనువాదం ప్రారంభం కాలేదు↵అప్పట్లో కొత్త నిబంధనను కూడా రెండు సంపుటాలుగా ముద్రించారు↵బైబిల్ అనువాదానికి సంబంధించిన ఈ సమాచారం అంతా మిషనరీల రికార్డుల్లో నమోదయ్యాయి↵తొలి ప్రతి 2వ వాల్యూమ్ ప్రస్తుతం బెంగళూరులోని యునైటెడ్ థియోలాజికల్ కాలేజీలో ఉంది↵తొలి ప్రతి మరికొన్ని కాపీలు బెంగళూరులోని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి↵తొలి ప్రతి మొదటి వాల్యూమ్ మాత్రం లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో ఉంది↵తొలి ప్రతి 2వ వాల్యూమ్ కాపీ 2005లో విశాఖలో లండన్ మిషనరీస్ సంస్థ ద్విశతాబ్ది (200) వార్షికోత్సవం సందర్భంగా తెప్పించారు↵అప్పటి బిషప్ ఆదేశాల మేరకు దాన్ని బెంగళూరు పంపించారు↵కొత్త నిబంధన అనువాదానికి దాదాపు పదేళ్లు పట్టింది↵బైబిల్ పాత నిబంధన హిబ్రూ భాషలో, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాసి ఉంది↵కొత్త నిబంధనను గ్రీకు నుంచి లాటిన్ భాషకు అనువదించిన సెప్టెంబరు 30వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అనువాదాల దినోత్సవంగా నిర్వహిస్తోంది[3]

మూలాలు

మార్చు
  1. "Telugu Bible turns 200". The Hindu (in Indian English). 28 September 2018.
  2. "First 'Teloogoo' Bible translation happened in Vizagapatam". The Hindu (in Indian English). 30 September 2015.
  3. "History". Archived from the original on 2019-06-20. Retrieved 2018-11-30.

బయటి లింకులు

మార్చు

1) https://www.thehindu.com/news/national/andhra-pradesh/telugu-bible-turns-200/article25074935.ece

2) https://www.thehindu.com/news/cities/Visakhapatnam/first-teloogoo-bible-translation-happened-in-vizagapatam/article7710091.ece

3) http://www.lmmcsichurch.com/history.php

4) https://en.wikipedia.org/wiki/Bible_Society_of_India_Andhra_Pradesh_Auxiliary

5) https://www.youtube.com/watch?v=A-tPaqwMYHs

6) https://www.youtube.com/watch?v=JSFLWa2AU5o