తెలుగు సామెత

(తెలుగు సామెతలు నుండి దారిమార్పు చెందింది)

సామెతలు భాషలు మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి."సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు.సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి.సామెతలు మాటల రుచినిపెంచే తిరగమోత,తాలింపు దినుసులు.ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు కాబట్టి సామెతలు అనుభవ సారాలు.సామెతలు నిప్పులాంటి నిజాలు,నిరూపిత సత్యాలు.ఆచరించదగ్గ సూక్తులు.[1]

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు. ఆంగ్లంలో సామెతను byword లేదా nayword అని కూడా అంటారు. సామెతలలో ఉన్న భేదాలను బట్టి వాటిని "సూక్తులు", "జనాంతికాలు", "లోకోక్తులు" అని కూడా అంటుంటారు.

పుస్తకాలు

మార్చు
  • తెలుగు సామితలు:కెప్టెన్ ఎం.దబ్ల్యు.కార్,వి.రామస్వామి శా స్త్రులు 1955
  • తెలుగు సామెతలు:సంపాదక వర్గం-దివాకర్ల వెంకటావధాని,పి.యశోదా రెడ్డి,మరుపూరి కోదండరామరెడ్డి. *తెలుగు విశ్వవిద్యాలయం మూడవ కూర్పు పునర్ముద్రణ1986
  • తెలుగు సామెతలు: సంకలనం-పి.రాజేశ్వరరావు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1993.
  • తెలుగు సామెతలు:గీతికా శ్రీనివాస్,జే.పి.పబ్లికేషన్స్ 2002
  • తెలుగు సామెతలు:సంకలనం-రెంటాల గోపాలకృష్ణ,నవరత్న బుక్ సెంటర్ 2002
  • జాతీయ సంపద: తెలుగు నేర్చుకునేవారికి సామెతలు, జాతీయాలు, భవిష్యనిధి వివరణలతో, ఆరి శివరామకృష్ణయ్య, 2008.

మూలాలు

మార్చు
  1. "సరదా, సరదా సామెతలు! – thetageethi" (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). Retrieved 2021-04-14.