తెల్లం బాలరాజు
తెల్లం బాలరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోలవరం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]
తెల్లం బాలరాజు | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 - 3 జూన్ 2024 | |||
ముందు | మొడియం శ్రీనివాసరావు | ||
---|---|---|---|
తరువాత | చిర్రి బాలరాజు | ||
నియోజకవర్గం | పోలవరం, ఆంధ్రప్రదేశ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 4 మార్చి 1975 దుద్దుకూరు , బుట్టాయగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | |||
జీవిత భాగస్వామి | రాజ్యలక్ష్మి[1] | ||
సంతానం | సాయి విశాల్, రోహిత్ |
జననం, విద్యాభాస్యం
మార్చుతెల్లం బాలరాజు 4 మార్చి1975లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, బుట్టాయగూడెం మండలం, దుద్దుకూరు గ్రామంలో జన్మించాడు. ఆయన 1993లో ఈడుపుగల్లు పి.బి.పి.ఆర్ జూనియర్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుతెల్లం బాలరాజు కొంతకాలం వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగం చేసి 2004లో రాజకీయాల్లోకి వచ్చాడు. మాజీ Dccb చైర్మన్ కరాటం రాంబాబు గారి శిష్యుడి గా ఆయన ప్రోద్బలం తో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సున్నం బుజ్జి పై 18842 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2009లో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2012లో జరిగిన ఉప్పు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మొడియం శ్రీనివాసరావు పై 35,767 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించాడు 2004 ,2009 ఎన్నికలలో బాలరాజు గెలుపులో ఆయన కు టిక్కెట్ ఇప్పించిన రాంబాబు గారి పాత్ర కీలకం బాలరాజు రాజకీయ జీవితానికి కరాటం రాంబాబు గారు బాట వేశారు అని ఒక్క మాటలో చెప్పవచ్చు.
తెల్లం బాలరాజు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు.[3] ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బొరగం శ్రీనివాసులు పై 42070 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా నాల్గొవసారి గెలిచాడు.[4]
మూలాలు
మార్చు- ↑ Sakshi (3 January 2024). "పోలవరం సమన్వయకర్తగా తెల్లం రాజ్యలక్ష్మి". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
- ↑ Sakshi (2019). "Polavaram Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
- ↑ Sakshi (18 March 2019). "శాసనసభా స్థానాల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 9 October 2021. Retrieved 9 October 2021.
- ↑ Sakshi (24 May 2019). "ఏపీలో అత్యధిక, అతి స్వల్ప మెజారిటీలు". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.