తేనెటీగ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
తేనెటీగ | |
---|---|
![]() | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Tribe: | ఎపిని
|
Genus: | ఎపిస్
|
Species | |
ఎపిస్ ఆండ్రెనిఫార్మిస్ |
తేనెటీగలనేవి ఒక రకమైన తుమ్మెదలు. ఆర్థికపరంగా మానవులకు సహాయపడుతున్న ఉత్పాదక కీటకాలు. ఇవి పూలనుండి మకరందాన్ని సేకరించి తేనెపట్టులో ఉంచి తేనెగా మారుస్తాయి. ఇవి సంతానోత్పత్తి కోసం తేనెపట్టును ఏర్పరచుకొంటాయి.
తేనెటీగల సహనివేశం సాధారణంగా ఒక రాతికిగాని, భవనానికి చెందిన కమానుకుగాని లేదా చెట్టుకు చెందిన శాఖకు తేనెపట్టును నిర్మిస్తాయి. ఒక్కొక్క సహనివేశంలో దాదాపు 50,000 తేనెటీగలు ఉంటాయి. ఒక్కొక్క తేనెపట్టులో మైనంతో చేసిన షడ్భుజాకారపు కక్ష్యలు అనేకం ఉంటాయి. ఇవి రెండు రకాలు: 1. తేనెను, పుప్పొడి రేణువులను నిల్వ ఉంచేవి. 2. పిండ సంరక్షణకు ఉపయోగపడేవి. ఇవికాక రాణీ ఈగ కోసం పెద్ద కక్ష్య ఒకటి ఉంటుంది. పిండ రక్షణ కక్ష్యలో అండాలుంటాయి. తేనె పుప్పొడి రేణువులు పిండదశలకు ఆహారం. పిండదశలనుండి కొత్త ప్రౌఢ ఈగలొస్తాయి. ఒక తేనెటీగల సహనివేశంలో మూడు రకాల ఈగలుంటాయి. 1. రాణి ఈగలు, 2. డ్రోన్ లు, 3. కూలి ఈగలు. రాణి ఈగ (queen bee) : ఒక్కొక్క తేనెపట్టు (beehive) లో ఒక రాణి ఈగ ఉంటుంది.ఒకవేళ, పొరపాటున రెండు రాణి ఈగలు ఉంటే, ఒకటి మరో దానిని చంపేస్తుంది. రాణి ఈగలు ఒక రకమైన రసాయనాన్ని ఉత్పత్తిచేస్తాయి. అది కూలి ఈగలు (worker bees) సంతానోత్పత్తిపరమైన అభివృద్ధి (sexual development) చెందకుండా నిరోధిస్తుంది. తేనెటీగ యొక్క జీవిత చక్రము ( lifecycle) : 1.రాణి ఈగ, దినమంతా గదులను పర్యవేక్షించడం, గుడ్లను పెట్టడం చేస్తుంది.అది రోజుకు 2000 వరకు గుడ్లను పెడుతుంది. 1-2 రోజుల తరువాత డింభకాలు (larvae) బయటికి వస్తాయి. 2.కూలి ఈగలు డింభకాలకు తేనె, పుప్పొడి, రాయల్ జెల్లీ (royal jelly) ని అందిస్తాయి. రాయల్ జెల్లీని ఎక్కువగా త్రాగిన డింభకాలు, రాణి ఈగలుగా మారుతాయి. 5 వ రోజుకు డింభకాలు తమ చుట్టూ, ఒక గట్టి పొరను అల్లుకుంటాయి.కూలి ఈగలు గదిని మైనంతో మూసివేస్తాయి. 3.మూడు వారాలలో తేనెటీగ గదిని బద్దలు కొట్టి, బయటకు వచ్చేస్తుంది.
ఉపయోగాలు మార్చు
- తేనెపట్టు నుంచి తేనెను సేకరిస్తారు. ఇది మంచి పోషక ద్రవం.
- తేనెపట్టు నుంచి తయారైన మైనం కొవ్వొత్తులు, పాలిష్ లు, మోడల్స్ తయారీకి ఉపయోగిస్తారు.
- తేనెటీగలు పుప్పొడి రేణువులు, మకరందం కోసం పూలను చేరుతుంటాయి, కాబట్టి పూలకు సంబంధించి ఇవి 'ఉత్తమ సంపర్క కారులు'.
- తేనెటీగ విషాన్ని కీళ్ళనొప్పులు చికిత్సలో ఉపయోగిస్తారు.
- తేనె మంచి ఆంటీసెప్టిక్ పదార్థం. కాబట్టి దీన్ని పుండ్లమీద పూసి ఇన్ ఫెక్షన్ ను నివారిస్తారు.
తేనెపట్టులను చూపించే వీడియో ="http://www.youtube.com/v/i6r_QGbJgg0&hl=en&fs=1"></param><param name="allowFullScreen" value="true"></param><param name="allowscriptaccess" value="always"></param><embed src="http://www.youtube.com/v/i6r_QGbJgg0&hl=en&fs=1" ]