తేలుకుంచి పక్షి సంరక్షణా కేంద్రం
తేలుకుంచి పక్షి సంరక్షణా కేంద్రం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం తేలుకుంచి గ్రామంలోని సైబీరియా నుండి వలసవచ్చిన పక్షి సంరక్షణా కేంద్రం. ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది.[1]
వలస పక్షులు
మార్చుఈ వలస పక్షులు ఇచ్చాపురం మండలంలోని తేలుకుంచి గ్రామంలోని రెండు చెరువుల్లో మాత్రం నీరు నిల్వ ఉండడంతో వాటితోనే ఈ పక్షులు జీవనాన్ని ప్రారంభించాయి. వాతావరణంలో మార్పుల వల్ల సైబీరియా తీరం నుంచి సుమారు 13 వేల కిలో మీటర్లు ప్రయాణం చేసి వచ్చే ఈ పక్షులను పెలికాన్ పక్షులని పిలుస్తుంటారు.[2] వీటి ప్రధాన ఆహారం నత్తగుల్లలు, చేపలు. ఇవి గ్రామంలోని చెట్లపై వాటి నివాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి గ్రామ పొలిమేర దాటిన తరువాత చెట్లపైకి వెళ్ళవు. ఇవి వాటి ఆహార అన్వేషణకు ఇచ్ఛాపురానికి సుమారు 35 నుంచి 40 కిలో మీటర్ల వరకు వెళ్ళి ఆహారంతో సహా తిరిగి తేలుకుంచిలో చెట్ల దగ్గరకు చేరుకుంటాయి. అటవీ అధికారులు గ్రామంలో నత్తగుల్లల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.[3]
13 వేల కిలోమీటర్లు దాటి
మార్చుఏటా జూన్‌లో సైబీరియా తీరం నుంచి 13 వేల కిలోమీటర్ల దూరం దాటి వచ్చే ఈ పక్షులను ఓపెన్ బిల్డ్ స్టార్క్స్ (నత్తగొట్టు కొంగలు) అని వ్యవహరిస్తుంటారు. డిసెంబరులో తమ సంతతితో కలిసి తిరిగి వెళ్లిపోతాయి. ఇక్కడకు పది వేలకు పైగా సంఖ్యలో ఒకే జాతి పక్షులు వస్తుంటాయి. తేలుకుంచి గ్రామంలో ఉన్న చెట్లపైనే సర్ధుకుని గూళ్లు నిర్మించుకుని, గుడ్లను పెడతాయి. వీటి ప్రధాన ఆహారం నత్తగుల్లలు, కప్పలు, చిరుచేపలు. వేకువ జామున చెట్లపై పక్షులు చేసే విన్యాసాలు తిలకించేందుకు ఎంతో ఆహ్లాదాన్ని కల్గిస్తాయి. అలానే సాయంత్రం వేళ ఆహారాన్వేషణ నుంచి తిరిగివచ్చే విహంగాలు చెట్లపై సందడి చేస్తాయి. వీటిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. పొడవైన ముక్కుతో కనిపించే ఈ పక్షులకు కూనదశలో మామూలుగానే చిన్న ముక్కు ఉంటుంది. ఎదుగుతున్న కొద్ది ముక్కు పెరడగంతో పాటు, దవడల మధ్య ఖాళీ ఏర్పడుతుంది. అడుగున్నర పొడవున పక్షులు ఎదుగుతాయి. వాటి రెక్కలు కూడా ఒక్కొక్కటి అడుగున్నర వరకు ఉండటం వల్ల గాలిలో తేలిగ్గా ముందుకు సాగిపోతాయి. ఆ ఎగిరే తీరు కనువిందు చేస్తుంది.[4]
మూలాలు
మార్చు- ↑ "Sites - Important Bird Areas (IBAs)". Bird Life International. Archived from the original on 14 జూలై 2014. Retrieved 1 July 2014.
- ↑ తేలుకుంచి పులకింత
- ↑ "జిల్లాకు చేరుతున్న విదేశీ విహంగాలు రైతుల మోముల్లో ఆనందం". Archived from the original on 2012-06-13. Retrieved 2016-10-21.
- ↑ వేల మైళ్లు దాటి..ఆనందాన్ని పంచి..