తొట్లకొండ బౌద్ధ సముదాయం (17 15 ఉ - 83 23 తూ) విశాఖపట్నం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో భీమిలి వెళ్లే దారిలో సముద్రతీరానికి అభిముఖంగా 128 మీటర్ల ఎత్తున్న ఒక కొండపై ఉంది. కొండపై వర్షపు నీటిని సేకరించడానికి రాతిలో తొలచిన అనేక తొట్లు ఉండటంవళ్ళ తొట్లకొండ అని పేరు వచ్చింది. తొట్లకొండ ప్రాచీన కళింగ ప్రాంత ప్రభావంలో ఉండి ఇక్కడ నుండి బౌద్ధ సంస్కృతి శ్రీలంక, తదితర ఆగ్నేయాసియా దేశాలలో వ్యాపించేందుకు ప్రధాన కేంద్రంగా దోహదం చేసింది. తొట్లకొండ, భారతీయ సంస్కృతి ముఖ్యంగా బౌద్ధం ఖండాంతర ప్రదేశాలకు ప్రసరించిన పద్ధతికి అద్దంపడుతుంది.

తొట్లకొండ బౌద్ధవిహారంలో మహాస్థూపం
తొట్లకొండ బౌద్ధవిహారం యొక్క పనోరమా దృశ్యం
తొట్లకొండ సమీపంలోని తొట్లకొండ బీచ్

చిత్రమాలిక

మార్చు