తోట నిరంజనరావు
రంగస్థల నటుడు
తోట నిరంజనరావు (1906 - 1964) సుప్రసిద్ధ రంగస్థల నటులు.[1]
జననంసవరించు
వీరు డిసెంబరు 1906 లో రాజమండ్రిలో జన్మించారు.
నాటకరంగ ప్రస్థానంసవరించు
వీరు చిన్ననాటి నుండే నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు. ఉన్నత పాఠశాల దశకే మంచి నటుడిగా గుర్తించబడ్డాడు. నటనతో పాటు ఆట, పాటలలో కూడా నైపుణ్యం సంపాదించి బందరు నేషనల్ థియేటర్లో చేరాడు. శ్రీకృష్ణ లీలలో కృష్ణుడు గాను, భక్త ప్రహ్లాదలో ప్రహ్లాదుడు గాను, భక్త మార్కండేయలో మార్కండేయుడుగా బాల పాత్రలలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు. డి.వి.సుబ్బారావు గారు చనిపోయిన తరువాత హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్రను పోషించి దిగ్విజయంగా ప్రదర్శించారు. వీరు సినిమారంగంలో ప్రవేశించి 1937లో దేవదత్తా పిలింస్ వారు కలకత్తాలో నిర్మించిన సతీ సులోచన చిత్రంలో లక్షణుడుగా నటించారు.
మరణంసవరించు
వీరు 1964 ఏప్రిల్ 21 తేదీన రాజమండ్రిలో పరమపదించారు.
మూలాలుసవరించు
- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.391.