తోషిరో మిఫునె (тоширо миfune, 1920 ఏప్రిల్ 1-1997 డిసెంబరు 24) జపనీస్ నటుడు, నిర్మాత. సుదీర్ఘ కెరీర్లో అనేక అవార్డులు, ప్రశంసలను అందుకున్న మిఫునెని సినిమా చరిత్రలో గొప్ప నటులలో ఒకడిగా విస్తృతంగా పరిగణిస్తారు.[1][2][3][4] జపనీస్ చిత్ర పరిశ్రమలో ప్రముఖుఖుడైన అతను తరచుగా వీరత్వం, దారుఢ్యాలను ప్రదర్శించే పాత్రలను పోషించాడు. మంచి శారీరక సౌష్టవానికి, తెరపైన ఆకట్టుకునే ప్రదర్శనకు అతన్ని మెచ్చుకుంటూ ఉంటారు.[5]

తోషిరో మిఫునె
1954లో మిఫునె
జననం 1920 ఏప్రిల్ 1
కింగ్డావో, షాన్డాంగ్, చైనా
మరణం 1997 డిసెంబరు 24 (77 ఏళ్ళ వయసులో)
శ్మశానం నెలకొన్నది కవాసాకి, కనగావా, జపాన్
వృత్తులు.
  • నటుడు
  • చిత్ర నిర్మాత
  • చిత్ర దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు  1947–1995
జీవిత భాగస్వామి. Page మూస:Marriage/styles.css has no content.
సచికో యోషిమినె (1950లో వివాహం; 1995లో మరణించింది).
భాగస్వామి మికా కిటాగావా
పిల్లలు. 3
సైనిక వృత్తి
విధేయత  జపాన్ సామ్రాజ్యం
సేవ/శాఖ ఇంపీరియల్ జపనీస్ ఆర్మీ ఎయిర్ సర్వీస్
సేవల సంవత్సరాలు  1940–1945
ర్యాంక్ సార్జెంట్
యూనిట్ వైమానిక ఛాయాచిత్రం
యుద్ధాలు/యుద్ధాలు రెండవ ప్రపంచ యుద్ధం
సంతకం
వెబ్సైట్ mifuneproductions.co.jp

మిఫూన్ మొత్తం మీద 180 పైచిలుకు సినిమాల్లో నటించినప్పటికీ అకిరా కురొసావా దర్శకత్వంలో పనిచేసిన 16 సినిమాలు అతనికి అత్యంత ప్రఖ్యాతి తెచ్చిపెట్టాయి. వీటిలో విమర్శకుల ప్రశంసలు పొందిన కురసోవా జిదైజీకీ సినిమాలు (చారిత్రక సినిమాలు) అయిన రషోమాన్ (1950), సెవెన్ సమురాయ్ (1954), ది హిడెన్ ఫోర్ట్రెస్ (1958), యోజింబో (1961) ఉన్నాయి. మిఫూనె రషోమాన్ సినిమాకి గాను వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శాన్ మార్కో గోల్డెన్ లయన్ పురస్కారాన్నీ, యోజింబోకు గాను వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడిగా వోల్ఫి కప్‌నూ, బ్లూ రిబ్బన్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా పురస్కారాన్నీ పొందాడు.[6][7][8] అతను హిరోషి ఇనాగాకి తీసిన సమురాయ్ ట్రయాలజీ(1954-1956)లో మియామోటో ముసాషి పాత్రను, ఎన్‌బీసీ టెలివిజన్ వారి మినిసిరీస్ అయిన షోగన్‌లో లార్డ్ టోరానాగానూ, మూడు వేర్వేరు చిత్రాలలో అడ్మిరల్ ఇసోరోకు యమమోటోగానూ మంచి పేరు సంపాదించుకున్న పాత్రలను పోషించాడు.[9]

1962లో అతను మిఫూన్ ప్రొడక్షన్స్ స్థాపించి "ది సాండ్స్ ఆఫ్ కురోబ్" (1968), "సమురాయ్ బ్యానర్స్" (1969) వంటి భారీ సినిమాలు తీసి విజయాన్ని సాధించాడు. అతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం "గోజు మన్-నిన్ నో ఇసాన్" (1963). అతను అనిమాస్ ట్రుజానో (1962) వంటి చిత్రాలలో నటించాడు, దీనికి అతను ఉత్తమ నటుడిగా మరొక బ్లూ రిబ్బన్ అవార్డును గెలుచుకున్నాడు 1965లో రెడ్ బియర్డ్ సినిమా ద్వారా వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెండోసారి ఉత్తమ నటుడు పురస్కారం పొందాడు. ఆ సినిమా తర్వాత అతను జపనీస్ సినిమా పరిశ్రమ దాటి విదేశాల్లో పనిచేయడానికి ఎక్కువ మొగ్గచూపసాగాడు.[10] గ్రాండ్ ప్రిక్స్ (1966) అతని హాలీవుడ్ అరంగేట్రం కాగా హెల్ ఇన్ ది పసిఫిక్ (1968), రెడ్ సన్ (1971), పేపర్ టైగర్ (1975), మిడ్వే (1976), స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన 1941 (1979) వంటి చిత్రాల్లో నటించాడు.[11][12][13][14]

మిఫునె 1997 డిసెంబరు 24న అవయవాలు విఫలం కావడంతో (ఆర్గాన్ ఫెయిల్యూర్) మరణించాడు. 1999లో అతనికి మార్షల్ ఆర్ట్స్ హిస్టరీ మ్యూజియం హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం దక్కింది.[15] ఆయన తన జీవితాన్ని గురించి, చిత్రాల గురించి మిఫూన్: ది లాస్ట్ సమురాయ్ (2015) అనే పూర్తిస్థాయి డాక్యుమెంటరీ సినిమా తీశారు. 2016లో అతని పేరు హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్లో చేర్చారు.[16]

మూలాలు

మార్చు
  1. "Toshiro Mifune: The Honorary Samurai – Black Belt Magazine". Black Belt. Archived from the original on September 30, 2022. Retrieved April 24, 2023.
  2. "The ultimate beginner's guide to Toshiro Mifune's best films". Far Out (in అమెరికన్ ఇంగ్లీష్). April 1, 2021. Retrieved April 24, 2023.
  3. "The ultimate beginner's guide to Toshiro Mifune's best films". Far Out (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-04-01. Retrieved April 24, 2023.
  4. Travis, Ben; Butcher, Sophie; De Semlyen, Nick; Dyer, James; Nugent, John; Godfrey, Alex; O'Hara, Helen (20 December 2022). "Empire's 50 Greatest Actors Of All Time List, Revealed". Empire. Archived from the original on 29 December 2022. Retrieved 31 January 2023.
  5. https://www.cortis.com/toshiro-mifune-lived-with-style/
  6. http://kumomi.org/2024/01/08/learning-by-drinking-mifune-toshiro/
  7. https://faroutmagazine.co.uk/toshiro-mifune-6-best-films-guide/
  8. https://moreliafilmfest.com/en/toshiro-mifune-japanese-actor-who-conquered-mexico
  9. Hunter, stephen (December 27, 1997). "Toshiro Mifune: a World-Class Talent Appreciation: Japanese star, who had a great actor's gift, made an indelible mark on international cinema". Los Angeles Times. Archived from the original on January 6, 2016.
  10. http://kumomi.org/2024/01/08/learning-by-drinking-mifune-toshiro/
  11. https://moreliafilmfest.com/en/toshiro-mifune-japanese-actor-who-conquered-mexico
  12. https://cineccentric.com/2021/04/15/the-films-of-toshiro-mifune/
  13. http://kumomi.org/2024/01/08/learning-by-drinking-mifune-toshiro/
  14. https://www.cortis.com/toshiro-mifune-lived-with-style/
  15. "Hall of Fame".
  16. http://kumomi.org/2024/01/08/learning-by-drinking-mifune-toshiro/