త్యాగరాజ మొదలి ఓ తమిళ కవి. కానీ తెలుగులో కూడా ఈయన గ్రంథాలు, కవిత్వమూ రాశాడు. సుబ్రహ్మణ్య విజయం అనే అయిదాశ్వాసాల కావ్యానికి "విద్యుత్కర్ణామృతం" అనే మారు పేరు పెట్టాడు. ఇతడు ఛందో రత్నాకరం అనే పేరుతో ఓ ఛందో గ్రంథం కూడా రాశాడు. ఇంజనీరింగ్ శాఖలో అసిస్టెంట్ ఓవర్సీయరుగా పనిచేసిన త్యాగరాజ గురించి పలు గ్రంథాలలో ఉంది. ముఖ్యంగా వంగూరి సుబ్బారావు రచించిన శతకవుల చరిత్ర అనే పరిశోధక గ్రంథములో త్యాగరాజ ప్రస్తావన ఉంది. అదేవిధంగా ఆరుద్ర తాను రచించిన సమగ్రాంధ్ర సాహిత్యమనే గ్రంథంలో కూడా ఈయన గురించి తెలియజేశారు. చిన్న చిన్న పుస్తకాలు రాసి, వాటికి పెద్ద పేర్లు పెట్టడం అనేది త్యాగరాజకు అలవాటు. కందుకూరి వీరేశలింగం వంటి సాహితీవేత్తలు త్యాజరాజ కవిత్వాన్ని కొనియాడారు. [1]

త్యాగరాజ మొదలి
జననం1830
తమిళనాడు
మరణం1870
ప్రసిద్ధికవి, వ్యాకరణకర్త

మొదలి ఇంటిపేరు కలిగిన తెలుగు ప్రముఖులు ఎందరో ఉన్నారు. మొదలి నాగభూషణశర్మ, మొదలి వెంకటసుబ్రహ్మణ్యం మొదలైన వారిని అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. [2]

మూలములు

మార్చు

మూలాలు

మార్చు
  1. ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యం 3వ భాగం, పుట 469 తేది: 2019-11-12
  2. వంగూరి సుబ్బారావు, శతకవుల చరిత్ర, పుట 475