త్రిపురి ప్రజలు
త్రిపురి (టిప్రా, ట్విప్రసా, తిప్రాసా, ట్విప్రా, బోరోకు లేదా టిప్పెరా) ప్రజలు ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశులోని ట్విప్రా రాజ్యంలో ఆదిమ వాసులు. మాణిక్య రాజవంశానికి చెందిన త్రిపురి ప్రజలు 1949 లో రాజ్యం ఇండియను యూనియనులో చేరే వరకు 2000 సంవత్సరాలకు పైగా త్రిపుర రాజ్యాన్ని పరిపాలించారు.
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |
---|---|
1.5 మిలియన్లు India, Bangladesh | |
భాషలు | |
Kokborok (Debbarma, Jamatia, Tripura, Noatia, Rupini, Kalai, Murasing, Uchoi), Bru (Reang, Meska and Molsoi), Riam (Darlong, Hrangkhawl, Kaipeng, Molsom, Ranglong, Hmar, Pang, Bongcher, Chorei, Korbong), Mizo (Lusei, Hauhnar, Hrahsel, Ralte, Khiangte, Fanai, Hualngo, Hualhang, Lunkhua). | |
మతం | |
క్రైస్తవ మతం,హిందూమతం, సర్వాత్మమత, ఇస్లాం[1] |
చరిత్ర
మార్చుత్రిపురిలు తమ ప్రస్తుత దేశంలోకి దాని ఈశాన్య మూల నుండి ప్రవేశించి. అక్కడే స్థిరపడ్డారు. క్రమంగా త్రిపుర మొత్తం మీద వారి స్థిరనివాసం, ఆధిపత్యాన్ని విస్తరించారు. వారు తమ ప్రభావాన్ని దక్షిణాన చిట్టగాంగు వరకు, పశ్చిమాన కొమిల్లా, నోఖాలి (బ్రిటిషు కాలంలో ' టిప్పెరా మైదానం' అని పిలుస్తారు), ఉత్తరాన సిల్హెటు (ప్రస్తుత బంగ్లాదేశులో) వరకు విస్తరించగలిగారు. 1512 వ సంవత్సరంలో టిప్పెరాలు మొఘలులను ఓడించినప్పుడు వారి ఆధిపత్య శిఖరాగ్రంలో ఉన్నారు. 1587 లో అరకానీయులు పోర్చుగీసు సహాయంతో వారిని ఓడించి వారి రాజధాని ఉదయపూర్ స్వాధీనం చేసుకున్నారు.[2]. పాలక రాజవంశం అనేక కాలాల చరిత్రను దాటి 18 వ శతాబ్దం వరకు త్రిపురను అనేక శతాబ్దాలుగా పరిపాలించింది. ఆ తరువాత సాదా టిప్పెరా బ్రిటను కాలనీగా మారి హిల్ టిప్పెరా స్వతంత్ర రాచరిక రాష్ట్రంగా మిగిలిపోయింది. 1949 అక్టోబరు 14 న హిల్ టిప్పెరాను కొత్తగా స్వతంత్ర భారతదేశంలో త్రిపుర రాష్ట్రంలో విలీనం చేశారు.
భాష
మార్చుత్రిపురి ప్రజలు ప్రధానంగా కొక్బోరోకు మాండలికాలను మాట్లాడతారు. ఇది డెబ్బర్మ, త్రిపుర, మురాసింగు, జమాటియా, నోటియా, రీయాంగు (బ్రూ), కోలోయి, ఉచోయి, రూపని అగర్తాల చుట్టూ మాట్లాడే ప్రామాణిక మాండలికాలను కలిగి ఉంటుంది. ఇది త్రిపుర రెండవ అధికారిక భాషగా ఉంది. త్రిపురలో త్రిపురి మాండలికాలను మాట్లాడే ప్రజలు పదిలక్షలకు పైగా ఉండేవారు. మిజోరాం, అస్సాంలో భారతదేశంలో, నేపాలులో అలాగే సిల్హెటు, బంగ్లాదేశులోని చిట్టగాంగు కొండ ప్రాంతాలలో ఈ మాండలికాలు మాట్లాడేవారు అదనంగా ఉన్నట్లు అంచనా.
మతం
మార్చు2011 నాటి గణాంకాలు ఆధారంగా వీరిలో 90.73% హిందువులు ఉన్నట్లు అంచనా.[3]
సమాజం
మార్చుస్వదేశీ త్రిపురి ప్రజలలో గిరిజన వర్గాలు ఉన్నాయి. అంటే టిప్రా, రీయాంగు, జమాటియా, కైపెంగు, నోటియా, కోలోయి, హలాం మొదలైన గిరిజన జాతులు ఉన్నాయి. వారు ఒంటరిగా అభివృద్ధి చెందారు, కొన్నిసార్లు ఒకరినొకరు లొంగదీసుకున్నారు. ప్రతి సమాజానికి గ్రామ స్థాయి నుండి మొత్తం తెగ అధిపతి వరకు దాని స్వంత ప్రాథమిక సామాజిక, పరిపాలనా సంస్థ ఉంది.
ఈ స్వదేశీ సమాజాలు స్వీయ-నిర్ణయ భావన ఆధారంగా వారి సాంప్రదాయ స్వేచ్ఛను పొందుతాయి. రాజు, విషయ వర్గాల మధ్య సంబంధం త్రిపుర-మిస్సిపు మహారాజా (రాజు) లేదా అనుసంధాన అధికారి రాయి (సమాజానికి అధిపతి) - సర్దారు (గ్రామం -ఆధిపత్యం చేసే వ్యక్తి). ఇంతకు పూర్వం త్రిపురి క్షత్రియ సమూహంలో డెబ్బర్మ లేదా తిప్రా జాతి సమూహాన్ని మాత్రమే చేర్చారు. తరువాత రాజా తన పాలనలో ప్రజలలో బంధుత్వ భావాన్ని పెంపొందించే ప్రయత్నంలో రీయాంగు, జమాటియా, నోటియా వంటి ఇతర సమూహాలను కూడా చేర్చారు. [4]
త్రిపురి ప్రజలకు గొప్ప చారిత్రక, సామాజిక, సాంస్కృతిక వారసత్వం ఉంది. ఇది ప్రధాన భూభాగం భారతీయుల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వారి విలక్షణమైన సంస్కృతి - వారి నృత్యం, సంగీతం, పండుగలు, సమాజ వ్యవహారాల నిర్వహణ, దుస్తులు, ఆహారపు అలవాట్ల బలమైన వేదిక కలిగి ఉంది. కొక్బోరోకు, స్వదేశీ త్రిపురి 12 అతిపెద్ద భాషా సమూహాల భాష, త్రిపురలో మాట్లాడే ఇతర మాండలికాలు టిబెటో-బర్మా సమూహానికి చెందినవి. ఇవి భారతదేశంలో మాట్లాడే వాటికి భిన్నమైనవి. ఈశాన్య ప్రాంతంలో ఇతర ప్రజలు మాట్లాడే వారి భాషా ప్రభావం లేదు. సంగీత స్వరకర్త తండ్రి-కొడుకుల ద్వయం ఎస్.డి. బర్మా, ఆర్.డి. బర్మా త్రిపుర రాజ కుటుంబానికి చెందినవారు.
ప్రధాన స్థానిక త్రిపురి సంఘాలు:
- డెబ్బర్మ
- త్రిపుర
- రీయాంగు లేదా బ్రూ
- జమాటియా
- కొలోయి
- నొయాటియా
- మురాసింగు
- ఉచోయి
- రూపిణి
దినసరి జీవితం
మార్చుత్రిపురీలు ఐదు నుండి యాభై కుటుంబాల సమూహాలుగా కొండల వాలు మీద నివసిస్తున్నారు. ఈ ప్రాంతాలలో వారి ఇళ్ళు వెదురు లేదా యుఎతో నిర్మించబడ్డాయి. దీనిని కొక్బోరోక్లో అని పిలుస్తారు. అడవి జంతువుల ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఐదు నుండి ఆరు అడుగుల ఎత్తును పెంచి ఈ నివాసాలను నిర్మిస్తారు. ప్రస్తుతం ఈ సమాజంలో గణనీయమైన భాగం మైదానాలలో నివసిస్తున్నారు. వీరు మైదాన ప్రజలు నివాసుల వంటి ఇళ్లను నిర్మిస్తున్నారు. అలాగే వారి సాగు పద్ధతులను అవలంబిస్తున్నారు. దుస్తులు, మర్యాదలు, సౌందర్య సాధనాలు వంటి జీవితంలోని ఇతర అంశాలలో వారిని అనుసరిస్తున్నారు. త్రిపురి మహిళలు రిగ్నాయి అని పిలువబడే కండువా ధరిస్తారు. ఇది మోకాలికి దిగువకు చేరుకుంటుంది. వారు తమ మగ్గంలో ఒక చిన్న గుడ్డ ముక్కను నేస్తారు. దీనిని వారు రిసా అని పిలుస్తారు. వారు ఈ చిన్న వస్త్రాన్ని వారి రొమ్ము వస్త్రంగా ఉపయోగిస్తారు.
త్రిపురి ఆటలు, క్రీడాపోటీలు
మార్చుప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఉన్నట్లు త్రిపురిలో సాంప్రదాయ క్రీడలు ఉన్నాయి. త్రిపురి దాదాపు అన్ని వంశాలలో ఇది సాధారణం. త్రిపురిలో వాటిని థ్వంగుముంగు అంటారు. ప్రస్తుతం ఈ సాంప్రదాయ క్రీడలు క్రమంగా వదలివేయబడుతున్నాయి. ఎందుకంటే త్రిపురిలు ఆధునిక ఆటలు, క్రీడల వైపు ఆకర్షితులవుతున్నారు. కానీ కొన్ని క్రీడలు ఇప్పటికీ గ్రామీణ త్రిపురలో ఇష్టపడి ఆడుతుంటారు.
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ https://www.trtworld.com/magazine/a-muslim-convert-s-killing-exposes-bangladesh-s-ethnic-fault-lines-47838
- ↑ Book EASTERN BENGAL AND ASSAM DISTRICT GAZETTEERS by R.H.Snyed Huchinson, published in 1909 by Pioneer press, Allahabad
- ↑ http://censusindia.gov.in/Tables_Published/SCST/dh_st_tripura.pdf
- ↑ Asian Studies, Volume 4 by Netaji Institute for Asian Studies, p.4
వెలుపలి లింకులు
మార్చు- TipraTV Kokborok Blog/Website