త్రిపుర కథలు పుస్తకాన్ని త్రిపురగా ప్రాచుర్యం పొందిన ప్రముఖ కథారచయిత రాయసం వేంకట త్రిపురాంతకేశ్వరరావు రచించారు.

త్రిపుర కథలు
కృతికర్త: రాయసం వేంకట త్రిపురాంతకేశ్వరరావు
ముఖచిత్ర కళాకారుడు: రమణ
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కథాసంకలనం
ప్రచురణ: పర్‌స్పెక్టివ్స్
విడుదల: 2011

రచన నేపథ్యం

మార్చు

త్రిపుర రాసిన ఈ కథలను డిసెంబరు 2011లో పర్ స్పెక్టివ్స్ వారు ప్రచురించారు. ముఖపత్రాన్ని రమణజీవి డిజైన్ చేశారు. త్రిపుర కథలు సంకలనంలోని పాము కథను భారతి పత్రిక 1963 ఆగస్టు సంచికలో, హోటల్లోకథను భారతి పత్రిక 1963 జూన్ సంచికలో, చీకటి గదులు భారతి-జనవరి 1967 సంచికలో, భగవంతం కోసం జ్యోతి-జనవరి 1964 సంచికలో తొలిగా ప్రచురితమయ్యాయి. ప్రయాణీకులు భారతి - డిసెంబరు 1963 సంచిక, సుబ్బారాయుడి రహస్యజీవితం 1963 మే 31న ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో, కేసరివలె కీడు భారతి - డిసెంబరు 1967 సంచిక, జర్కన్ భారతి - జూన్ 1968 సంచికల్లో మొదటి ముద్రణ పొందాయి. కనిపించని ద్వారం భారతి - ఏప్రిల్ 1970 సంచికలో, వంతెనలు స్వాతి - జూన్ 1970 సంచికతో, సఫర్ తరుణ ఏప్రిల్ 1973 సంచికలో, అభినిష్క్రమణ తరుణు - జూన్ 1973 సంచికలో, గొరుసులు - చాపం - విడుదల భావం స్వాతి - జూలై 1981లో, వలస పక్షుల గానం 1990 డిసెంబరు 14న ఆంధ్రజ్యోతిలో తొలిప్రచురణ పొందాయి.[1]

ఇతివృత్తాలు

మార్చు

పాము కథ కాశీ విశ్వవిద్యాలయంలో చదివే ఒక యువకుడు తన అవసరాల కోసం రంగులు మారుస్తూ ఎలా పక్కదారి పడతాడో వివరిస్తుంది.

మూలాలు

మార్చు
  1. త్రిపుర కథలు పుస్తకానికి త్రిపురావరణలో శీర్షికన విషయసూచిక