త్రోయింగ్ (క్రికెట్)

క్రికెట్ ఆటలో చట్టవిరుద్ధమైన బౌలింగు పద్ధతి

త్రోయింగ్ అనేది క్రికెట్‌లో చట్టవిరుద్ధమైన బౌలింగు పద్ధతి. బంతిని వేసే బౌలర్ బౌలింగ్ చేస్తూండగా చేతిని నిటారుగా చేసినప్పుడు ఇది జరుగుతుంది. దీన్ని చకింగ్ అని కూడా పిలుస్తారు. బౌలరు బంతి విసిరినట్లు అంపైరు భావించినట్లయితే, వారు దాన్ని నో బాల్ అని ప్రకటిస్తారు. అంటే ఆ డెలివరీ వలన బ్యాటరు ఔట్ అవరు.

బయోమెకానికల్ పరీక్షలో బౌలర్లందరూ తమ చేతులను ఎంతో కొంత వంచుతున్నట్లు తేలడంతో నిబంధనలను మార్చారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వారి ప్రస్తుత నిబంధనల ప్రకారం, బౌలర్ల మోచేతిని 15 డిగ్రీల వరకు వంచవచ్చని నిర్ణయించాయి. బౌలింగు చేయి భుజం ఎత్తు నుండి బంతిని విడుదల చేసే పాయింటు వరకూ ఉన్న చలనంలో ఈ చట్టం వర్తిస్తుంది. డెలివరీ సమయంలో మోచేతి వద్ద సహజంగా చేతిని వంచడాన్ని అనుమతించడానికి ఈ పరిమితిని పెట్టారు.

'త్రోయింగ్' ఆరోపణ అనేది బౌలరుపై చేయగలిగే అత్యంత తీవ్రమైన, వివాదాస్పదమైన ఆరోపణ. ఎందుకంటే చట్టవిరుద్ధమైన యాక్షను ఉన్న బౌలరు తన యాక్షన్ను సరిదిద్దుకోవాలి లేదంటే ఆట నుండి నిషేధం పొందే అవకాశం ఉంది.

అవలోకనం

మార్చు
 
టామ్ విల్స్, టాప్-క్లాస్ మ్యాచ్‌లో బంతిని విసిరిన మొదటి ఆస్ట్రేలియా బౌలరు.

చట్టం 24, క్లాజ్ 3 చేతికి సంబంధించి న్యాయమైన డెలివరీని నిర్వచిస్తుంది:

బంతిని వేసే ఊపులో బౌలరు చేయి భుజం ఎత్తుకు చేరుకున్న తర్వాత, బంతి చేతిని విడిచిపెట్టే వరకూ మోచేతి కీలు వద్ద పాక్షికంగా గానీ పూర్తిగా గానీ నిటారుగా కానట్లైతే, అది సరైన డెలివరీయే. డెలివరీ స్వింగ్‌లో మణికట్టును వంచడం లేదా తిప్పడం, ఈ నిర్వచనం ప్రకారం నిషిద్ధం కాదు.

చరిత్ర

మార్చు

అభివృద్ధి చెందిన బయోమెకానికల్, ఆడియోవిజువల్ టెక్నాలజీ రాకముందు, 24 నియమం, క్లాజ్ 3 ను ఫీల్డ్ అంపైర్లే అమలు చేసేవారు. డెలివరీని చట్టవిరుద్ధంగా ఉందా, "త్రో"గా ఉందా అనేది వారే నిర్ధారించేవారు. 1864 లో ఓవర్‌ఆర్మ్ బౌలింగును చట్టబద్ధం చేసిన తరువాత కూడా త్రోకు వ్యతిరేకంగా ఉన్న చట్టం లోని సారాంశంలో మార్పేమీ రాలేదు.[1]

1950 లలో ఈ త్రోయింగు, క్రికెట్‌ను అంటువ్యాధి లాగా పీడించింది. అంపైర్ ఫ్రాంక్ చెస్టర్ 1951లో దక్షిణాఫ్రికా ఆటగాడు కువాన్ మెక్‌కార్తీని త్రోకు గాను, నో-బాల్ చేయాలనుకున్నాడు. కానీ లార్డ్స్‌లో అధికారులు అతన్ని అడ్డుకున్నారు, ప్లమ్ వార్నర్ దౌత్యపరంగా "ఈ వ్యక్తులు మా అతిథులు" అంటూ లౌక్యంగా వ్యాఖ్యానించాడు.

సర్రే, ఇంగ్లండ్‌ జట్లకు ఆడిన ఎడమ చేతి వాటం స్పిన్నరు టోనీ లాక్ వేసే ప్రమాదకరమైన వేగవంతమైన బంతిని త్రోయింగు చేస్తున్నాడని భావించారు; ఒక సందర్భంలో అతను వేసిన బంతికి బౌల్డ్ అయిన డగ్ ఇన్సోల్ లాక్, తాను 'బౌల్డ్ అయ్యానా లేదా రనౌట్' అయ్యానా అని అడిగాడు. అతను నిజానికి తన కెరీర్ ప్రారంభంలో కౌంటీ క్రికెట్‌లో త్రో చేసినందుకు తప్పు పట్టారు. అతని కెరీర్ చివరిలో, ఓ వీడియోలో త్రోయింగు చేస్తున్న ఒక బౌలరును చూసి, ఆ బౌలరు యాక్షను ఎంత పేలవంగా ఉందో అంటూ షాకయ్యాడు. కానీ, అది స్వయానా తానే అని ఆ తరువాత గ్రహించాడు. ఆ తరువాత తన దోషాన్ని సరిదిద్దుకున్నాడు.

లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలరు ఇయాన్ మెకిఫ్ 1958-59లో యాషెస్‌ను తిరిగి పొందడంలో ఆస్ట్రేలియాకు తోడ్పడ్డాడు. అయితే మెకిఫ్, తదితరులు ఆట నియమాలు, ఆట స్ఫూర్తికి విరుద్ధంగా బౌలింగు చేశారనే ఆరోపణలతో ఇంగ్లండ్ జట్టులో వ్యాపించాయి. గుబ్బి అలెన్, డాన్ బ్రాడ్‌మాన్‌తో సహా ఇరువైపులా ఉన్న పెద్దలు 1961 లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఈ అంశంపై ఉన్న మనోక్లేశాలను సరిచేయాలని నిర్ణయించుకున్నారు. 1963-64లో, బ్రిస్బేన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్‌లో మెకిఫ్‌ బౌలింగును కోలిన్ ఎగర్ తప్పు పట్టి, అతని కెరీర్‌ను ముగించాడు.

వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ చార్లీ గ్రిఫిత్, బహుశా అతని తరంలో అత్యంత భీతి గొలిపే ఫాస్ట్ బౌలరు. అతను తన బంతిని త్రో చేసినట్లు తరచుగా అనుమానాలు వ్యక్తమయ్యేవి. అయినప్పటికీ అతను టెస్ట్ మ్యాచ్‌లలో అతన్ని ఎవరూ తప్పు పట్టలేదు. డెర్బీషైర్ కు చెందిన హెరాల్డ్ రోడ్స్ బౌలింగు యాక్షను లోని చట్టబద్ధత గురించి నిరంతరం ఎదురైన అనుమానాలతో అతని కెరీర్ దెబ్బతింది. పాల్ గిబ్ 1960లో దక్షిణాఫ్రికా టూరిస్టులతో ఆడుతున్నప్పుడు అతన్ని 'తప్పు పట్టారు' కానీ చివరికి అతన్ని క్లియర్ చేసారు. ఆ తరువాత డెర్బీషైర్ కోసం దశాబ్దం పాటు గొప్ప విజయాలను సాధించాడు. అతను ఇంగ్లాండ్ తరపున కేవలం రెండుసార్లే ఆడాడు.

ఇటీవలి కాలంలో ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ కిర్ట్లీ, ఆస్ట్రేలియాకు చెందిన బ్రెట్ లీ, పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ అక్తర్, షబ్బీర్ అహ్మద్ వంటి బౌలర్లు వివిధ స్థాయిలలో పరిశీలనకు గురయ్యారు.

 
ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ యాక్షన్ అతని కెరీర్‌లో చాలా వరకు వివాదాస్పదం, చర్చనీయాంశం అయింది.

ఆధునిక యుగంలో అత్యంత ప్రసిద్ధ స్పిన్‌ బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్, ఒకడు. అతని అంతర్జాతీయ కెరీర్‌లో చాలా వరకు అతని బౌలింగ్ యాక్షన్‌పై వివాదాలు వచ్చాయి. శ్రీలంక తరఫున ఆడడం మొదలుపెట్టినప్పటి నుండి పుట్టుకతోటే వంపుగా ఉండే అతని చేయి అసాధారణంగా హైపర్ ఎక్స్‌టెన్షన్ అవడం చేత అంపైర్ల పరిశీలనలో ఉంటూ వచ్చింది. మొదట్లో విమర్శలు వచ్చినప్పటికీ, 1995లో మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా అంపైరు డారెల్ హెయిర్ త్రోయింగు చేసినందుకు అతనిపై చర్య తీసుకోవడాంతో సమస్యగా మారింది. మురళిని మళ్లీ మళ్లీ తప్పు పట్టడానికి వెనుకాడనని హెయిర్ బహిరంగంగా పేర్కొన్నాడు. అతని బౌలింగ్ యాక్షన్ "పాశవికంగా"గా ఉందని అతను అన్నాడు. మురళీధరన్ చర్య చట్టబద్ధతపై క్రికెట్ అధికారులలో అంగీకారం లేకపోవడం ఇతర అంపైర్లు అతనిపై చర్య తీసుకోవడానికి ఇష్టపడకపోవడం వల్ల హెయిర్ ఒంటరై పోయాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లలో అతన్ని అంపైరుగా నియమించడం మానేసారు. తరువాత జరిపిన బయో-మెకానికల్ పరీక్షల్లో మురళీధరన్ చర్యకు సమర్థన లభించింది. అనేక ఇతర బౌలర్ల కంటే ఎక్కువగా అతను తన చేయి చాచలేదని తేలింది. అయితే అతని విమర్శకుల దృష్టిలో ఈ పరీక్షలతో అతనికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభించలేదు. టెస్టింగ్‌లో చేసే బౌలింగు, ఆటలో చేసే బౌలింగు భిన్నంగా ఉంటాయని వాళ్ళు అంటారు. నిర్దుష్టమైన కొన్ని డెలివరీలు వేసేటపుడు చేయి పొడిగింపు భిన్నంగా ఉంటుందని వాళ్ళు పేర్కొన్నారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంలో పరీక్ష సమయంలో, మురళీధరన్ మ్యాచ్ పరిస్థితులలో ఎలా చేస్తాడో అలాగే బౌలింగు చేసినట్లు నిర్ధారించడానికి మాజీ క్రికెటర్ బ్రూస్ యార్డ్లీతో సహా పలువురు స్వతంత్ర సాక్షులు హాజరయ్యారు. [2] [3]

పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ దూస్రా వేయడం మొదలుపెట్టిన 1990 ల మధ్య నుండి, సాంప్రాదాయేతర యాక్షన్‌తో దూస్రా వేసే ఆఫ్ స్పిన్నర్లపై చాలాసార్లు త్రోయింగ్ చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చి విచారణలు జరిపారు. అటువంటి బౌలర్లలో హర్భజన్ సింగ్, షోయబ్ మాలిక్, మార్లోన్ శామ్యూల్స్, మహ్మద్ హఫీజ్, సయీద్ అజ్మల్, జోహన్ బోథా, షేన్ షిల్లింగ్ ఫోర్డ్, మోయిన్ అలీ ఉన్నారు. మొయిన్ అలీని బౌలింగ్ నుండి ఎప్పుడూ నిషేధించనప్పటికీ, దూస్రా బౌలింగ్ చేసే ప్రయత్నాన్ని ఆపివేసాడు. ఇప్పుడు క్లాసికల్ ఆఫ్ స్పిన్ మాత్రమే వేస్తాడు. దూస్రా వేసే అతికొద్ది మంది బౌలర్లలో ఒకడైన సక్లైన్‌పై ఎవరూ ఫిర్యాదు చెయ్యలేదు. అయితే అతను క్రీజును దాటడం వలన క్రమం తప్పకుండా నో-బాల్ వేస్తూంటాడు.

ఐసిసి, వెస్టర్న్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ బ్రూస్ ఇలియట్, ఆస్ట్రేలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్‌కు చెందిన డాక్టర్ మార్క్ పోర్టస్, UK కు చెందిన డాక్టర్ పాల్ హురియన్‌లతో కూడిన నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. 2003 చివరలో దుబాయ్‌లో ఏర్పాటు చేసిన ఐసిసి సబ్-కమిటీ సమావేశంలో వీళ్ళు పాల్గొన్నారు. ఆ సబ్‌కమిటీలో డేవిడ్ రిచర్డ్‌సన్, అంగస్ ఫ్రేజర్, అరవింద డి సిల్వా, మైఖేల్ హోల్డింగ్, టోనీ లూయిస్, టిమ్ మే లు ఉన్నారు. ఈ సమావేశం తర్వాత, బౌలర్లందరికీ మోచేయి సాగే అనుమతి 15 డిగ్రీల వరకు ఉండవచ్చని ఐసిసి నిర్ణయించింది.

130 మంది పేస్ బౌలర్లు, స్పిన్ బౌలర్లపై బయోమెకానికల్ పరిశోధనలు జరిపాక, 15 డిగ్రీల కంటే ఎక్కువగా మోచేయి సాగితేనే (20 నుండి 30-డిగ్రీల పరిధిలో ఉంటే) ఉంటేనే "త్రో లాంటివి" లేదా చట్టవిరుద్ధంగా పరిగణించబడే బౌలింగ్ చర్యలుగా భావించాలని ఎంచుకున్నారు.[4]

బౌలరుపై ఫిర్యాదు చేసాక

మార్చు

బౌలరు 24.3 చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడని అంపైరు లేదా మ్యాచ్ అధికారి భావిస్తే, మ్యాచ్ రిఫరీకి పంపే మ్యాచ్ నివేదికలో వారు దానిని వివరంగా తెలియజేస్తారు. మ్యాచ్ ముగిసిన 24 గంటలలోపు మ్యాచ్ రిఫరీ, జట్టు మేనేజరుకు, ICCకీ మ్యాచ్ నివేదిక కాపీని అందజేస్తారు. ఆటగాడిపై రిపోర్టు చేసినట్లు మీడియా ప్రకటన కూడా జారీ చేస్తారు.

ఈ ప్రక్రియలో మొదటి దశ ఆటగాడి బౌలింగ్ చర్యపై స్వతంత్ర సమీక్ష. దీనిని ICC మానవ కదలిక నిపుణుల ప్యానెల్ సభ్యుడు నిర్వహించి, తమ నివేదికను ICCకి అందజేస్తారు. ఆటగాడి యాక్షను చట్టవిరుద్ధంగా ఉందని ఈ నివేదిక నిర్ధారించినట్లయితే, అతడు తమ చర్యను సరిదిద్దుకునే వరకు అంతర్జాతీయ క్రికెట్ పోటీల నుండి వెంటనే సస్పెండ్ చేస్తారు. అయితే, ఒక నిర్దిష్ట రకమైన డెలివరీ మాత్రమే చట్టవిరుద్ధమైతే, వారు అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగు చెయ్యడం కొనసాగించవచ్చు. వారు ఆ డెలివరీని సరిదిద్దుకునే వరకు దాన్ని వేయకూడదు. ఈ స్వతంత్ర అంచనా జరిగే సమయంలో, ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయడం కొనసాగించవచ్చు.

ఈ ప్రక్రియలో మొదటి దశ ఆటగాడి బౌలింగ్ చర్యపై స్వతంత్ర సమీక్ష. దీనిని ICC మానవ కదలిక నిపుణుల ప్యానెల్ సభ్యుడు నిర్వహించి, తమ నివేదికను ICCకి అందజేస్తారు. ఆటగాడి యాక్షను చట్టవిరుద్ధంగా ఉందని ఈ నివేదిక నిర్ధారించినట్లయితే, అతడు తమ చర్యను సరిదిద్దుకునే వరకు అంతర్జాతీయ క్రికెట్ పోటీల నుండి వెంటనే సస్పెండ్ చేస్తారు. అయితే, ఒక నిర్దిష్ట రకమైన డెలివరీ మాత్రమే చట్టవిరుద్ధమైతే, వారు అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగు చెయ్యడం కొనసాగించవచ్చు. వారు ఆ డెలివరీని సరిదిద్దుకునే వరకు దాన్ని వేయకూడదు. ఈ స్వతంత్ర అంచనా జరిగే సమయంలో, ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయడం కొనసాగించవచ్చు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

A ball is fairly delivered in respect of the arm if, once the bowler's arm has reached the level of the shoulder in the delivery swing, the elbow joint is not straightened partially or completely from that point until the ball has left the hand. This definition shall not debar a bowler from flexing or rotating the wrist in the delivery swing.[5]

  1. "Dates in Cricket History". Wisden Cricketers' Almanack. 1966. p. 152.
  2. "Q+A: Cricket – Muttiah Muralitharan's bowling action". Island Cricket. 12 July 2010. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 19 ఆగస్టు 2024.
  3. "Bowling Report: Testing Muralitharan's Doosra". Island Cricket. 12 July 2010. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 19 ఆగస్టు 2024.
  4. "New ICC illegal deliveries process announced". ESPNcricinfo. 1 March 2005.
  5. "Definition of fair delivery - the arm". Laws of cricket. Archived from the original on 2013-07-27. Retrieved 2024-08-19.