త్ర్యంబక మహా మంత్రం
ఈ మంత్రానికున్న ప్రసిధ్ధి అంతా, ఇంతా కాదు. త్రయంబకుడు అంటే సాక్శాత్తూ ఆ పరమేశ్వరుడే.ఈ మంత్రాన్ని అవసాన సమయాల్లొ జపిస్తే ఆ పరమ శివుడే మనకు రక్షను కల్గిస్తాడు.అంతటి మహిమాన్వితమైన మ్త్రము ఇది.మార్కండేయుడు ఈ మంత్రోచ్చారణ వలనే చావునుంచి విముక్తి పొందగలిగాడని భాగవతం లో నారదుని ఉవాచ.
మంత్రం
మార్చు- ఓమ్ త్ర్యంబకం యజామహే
- సుగంధిం పుష్ఠి వర్ధనం
- ఉర్వారుక మివ భంధనాన్
- మృత్యోర్ముక్షీయ మామృతాత్.
విశేషాలు
మార్చుఈ మంత్రమునకు ఋషి వసిష్ఠుడు. ఛందస్సు అనుష్టుప్. దేవత శివుడు (శ్రీ మృత్యుంజయ త్ర్యంబకేశ్వరుడు). బీజము "హామ్". శక్తి దేవి అమృతేశ్వరి.
ఈ మంత్రాన్ని శివుడు శుక్రాచార్యునికి ఉపదేశించాడు.
అర్థం
మార్చుఈ మంత్రం తైత్తిరీయోపనిషత్తు లోని నారాయణప్రశ్నము లోనిది. ఇది తైత్తిరీయం లో 56 వ అనువాకం.
" సుగంధ పరిమళం కలిగి, పుష్టిని వృద్ధి చేసే, మూడు కన్నుల పరమేశ్వరా ! నిన్ను పూజిస్తున్నాను. బంధనాత్ = బంధనం నుంచి ( అంటే తీగనుంచి లేదా తొడిమనుంచి ); ఉర్వారుకమివ = దోసకాయను వలె ; మృత్యోః = చావునుంచి ; ముక్షీయ = విడివడిన వాడను అగుదును గాక; అమృతాత్ = మోక్షము నుంచి; మా = వద్దు ( వదిలిపెట్టబడినవాడను కాకుండా ఉండునుగాక )
తొడిమ నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరుచేయుము. ఆమృత సమానమైన మోక్షము నుండి నేను విడివడకుండ ఉండును గాక."