త్లాజోల్టెయోట్ల్
అజ్టెక్ పురాణాలలో, త్లాజోల్టెయోట్ల్ (లేదా త్లాకోల్టెయోట్ల్, క్లాసికల్ నహుట్ల్: త్లాజోల్టెయోట్ల్, [tɬaʔsoɬˈtéo:tɬ]గా ఉచ్ఛరిస్తారు) అనేది దుర్వ్యసనం, శుద్దీకరణ, ఆవిరి స్నానాలు, కామం, మలినము, వ్యభిచారులకు పోషకురాలు. ఆమెను త్లాహెల్లి (Tlahēlcuāni "అశుద్ధ[పాపం] భక్షిణి"), త్లాజోల్మిక్విజ్ట్లీ(Tlazōlmiquiztli )("కామం వలన సంభవించిన మరణం"), ఇక్స్‌క్యూనా లేదా ఇక్స్‌క్యూనాన్ (Ixcuina,Ixcuinan హుస్టెక్: Ix క్యూనిమ్, కాటన్ దేవత) అనే మూడు పేర్లతో పిలుస్తారు. ఇందులో రెండోది దేవతా సోదరీ చతుష్టయాన్ని సూచిస్తుంది. [1] [2] [3]
త్లాజోల్టెయోట్ల్ | |
---|---|
Member of the నౌహ్ట్జోంటెటివ్ | |
దస్త్రం:Tlazolteotl.svg | |
సెక్స్ దేవత | |
ఇతర పేర్లు | త్లాహెల్కుఅని, త్లాజోల్మిక్విజ్ట్లీ, ఇక్స్‌క్యూనా, ఇక్స్‌క్యూనాన్ |
నివాసం | త్లాల్టీక్పాక్ |
తల్లిదండ్రులు | ఒమేసిహుఅటల్ (టెక్పటల్ ద్వారా ఉద్భవించింది) |
తోబుట్టువులు | నౌట్జోంటెటియో (1,600 దేవుళ్ళు) |
పిల్లలు | పిల్ట్జయింటెకుహట్లి ద్వారా : సింటెయోట్ల్ (కోడెక్స్ ఫ్లోరెన్టైన్) |
మతం | మెసోఅమెరికా |
భారతీయ సంప్రదాయ సమూహం | అజ్టెక్ (నహోవా) |
ట్లాజోల్టెయోట్ల్ అనేది పవిత్రమైన 260-రోజుల క్యాలెండర్ టోనల్ పోహుఅల్లి (Tōnalpōhualli )లోని 13వ ట్రెసెనాకు దేవత. ఇది సే ఓల్లిన్( Ce Ōllin)రోజుతో, లేదా మొదటి చలనంతో ప్రారంభం అవుతుంది. జాగ్వార్ (మచ్చల చిరుత) ను సూచించే రోజు ఆమెకు సంబంధించి ఉంటుంది .[4]
చేసిన తప్పులను ఒప్పుకొనే కార్యక్రమంలో పూజారులద్వారా ట్లాజోల్టెయోట్ల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. [5]
అజ్టెక్ మతం
మార్చుత్లాజోల్టెయోట్ల్ నిజానికి గల్ఫ్ కోస్ట్ [6] నుండి వచ్చిన హుయాక్స్టెక్ (Huaxtec) దేవత అయి ఉండొచ్చు, అజ్టెక్ దేవగణం(పాంథియోన్) లో కలిసిపోయి ఉండొచ్చు.
చతురంగ దేవతలు
మార్చుఇక్స్క్యూనాన్ (Ixcuinan )పేరుతో ఆమెను వివిధ వయసులతో కూడిన నలుగురు సోదరీ చతుష్టయంతో చతురంగ(quadrupartite) దేవతగా భావిస్తారు. వారి పేర్లు, టీయకాప్ఆన్ (Tiyacapan)(మొదటి జననం, టైకిహ (చిన్న చెల్లెలు, Tēicuih,Tēiuc ),త్లాకో (మధ్య సోదరి, Tlahcoyēhua), క్సోకోట్జిన్( Xōcotzin, కనిష్ట సోదరి). వ్యక్తిగత దేవతలుగా నలుగురుని ఇక్స్కుఇన్అమ్మేహ్ లేదా ట్లాజోల్టెటోహ్ ( ixcuinammeh or tlazōltēteoh ) గాను; [2] [3] విలాస జీవనానికి దేవతలుగాను భావిస్తారు. [7]
పాపం
మార్చుఅజ్టెక్ నమ్మకం ప్రకారం, దుష్టమైన కోరికలను ప్రేరేపించేది, అదే విధంగా పాపాలని క్షమించి, ప్రక్షాళన చేసేది ఈ త్లాజోల్టెయోట్ల్ దేవతే . [8] వ్యాధులకి, ముఖ్యంగా లైంగిక సంపర్క వ్యాధుల (STD )కు ఆమె కారణమని కూడా భావిస్తారు. నిషేధించిన ప్రేమకలాపాలకు పాల్పడే వారిని, త్లాజోల్టెయోట్ల్, ఆమె సహచరులు వ్యాధులతో బాధిస్తారని చెబుతారు. [9] భౌతికమైన, నైతికమైన అపరిశుభ్రతను ఆవిరి స్నానం, శుద్దీకరణ ఆచారంతో లేదా ప్రేమా, కోరికల దేవతగా భావించే ట్లాజోల్టెటోహ్‌ను పిలవడం ద్వారా నయం చేయవచ్చు. [9]
శుద్ధి
మార్చుశుద్దీకరణ కార్యాలకు అజ్టెక్‌లకు ఇద్దరు ప్రధాన అధిష్టాన దేవతలు ఉన్నారు : తేజ్‌కట్లిపోకా(Tezcatlipoca), అదృశ్యంగా, సర్వవ్యాపిగా ఉంటూ ప్రతిదీ గమనిస్తుంటాడు; త్లాజోల్టెయోట్ల్, (Tlazolteotl, lechery), చట్టవిరుద్ధమైన ప్రేమ కాలపాల దేవత. [8] త్లాజోల్టెయోట్ల్ ముందు ఒక వ్యక్తి ఒప్పుకునే ప్రతిదీ బహిర్గతంగానే ఉంటుంది. త్లాజోల్టెయోట్ల్ తో జరిగే శుద్దీకరణ పూజారి ద్వారా జరుగుతుంది. వారి జీవితంలో ఎవరైనా ఒక్కసారే ఈ "దయ" ను పొందొచ్చు, అందుకే సర్వసాధారణంగా వృద్ధులు ఎక్కువగా ఈ శుద్దీకరణ పొందుతారు. [10]
పూజారి ( త్లాపౌహ్కి ) పశ్చాత్తాపం చెందే వ్యక్తి తనని సంప్రదించగానే, 260 రోజుల ఆచార క్యాలెండర్ ( టోనల్‌పోహుఅల్లి )ని సంప్రదించి శుద్దీకరణ జరగడానికి ఉత్తమమైన రోజుని, సమయాన్ని నిర్ణయిస్తాడు. ఆ రోజున, అతను అంగీకరించిన పాపాలను వింటాడు, పాపం యొక్క స్వభావాన్ని, తీవ్రతను బట్టి ఉపవాసాలను, నైవేద్యాలు సమర్పించడం, కర్మ పాట, నృత్యంలాంటి తీర్పుల ద్వారా ప్రాయశ్చిత్తం చేస్తాడు. [12]
అశుద్ధ భక్షణం
మార్చుత్లాజోల్టెయోట్ల్ ని "అశుద్ధ దేవత" (Tlazōlteōtl), "మల భక్షిని" (త్లాహెల్లి(Tlahēlcuāni), 'అశుద్ధ[పాపం] భక్షిణి ') గా, తన కున్న ద్వంద్వ ప్రవృత్తి వల్ల ఆమె అశుద్ధ దేవతగాను, శుద్దీకరించే దేవతగాను కొలుస్తారు. పాపాలు అశుద్ధానికి ప్రతీకలు. ఆమె అశుద్ధ భక్షణం (dirt-eating) పాపాలను మింగి ప్రక్షాళన చేసే ప్రక్రియగా భావిస్తారు.[13][14] దీనికి గుర్తుగా ఆమె నోరు, నాసిక చుట్టూ గౌరవర్ణంలో (ochre-colored) దైవిక విసర్జన పూసినట్టు చిత్రించి వుంటుంది.[14] అజ్టెక్ భాషలో పవిత్ర శబ్దానికి అర్థమైన జిన్, జిన్ ట్లి, పిరుదులు, మతాచారంగా సమర్పించే "ద్రవ బంగారం" (మూత్రం), బంగారం" దైవిక విసర్జన" ను, క్లైన్ ఆంగ్లం లోకి అనువదిస్తూ పరిహాసంగా "పవిత్ర మలం"(హోలీ షిట్)గా పేర్కొన్నాడు.[14][15] ఈ ప్రక్రియ ద్వారా ఆమె అన్నివర్గాల మధ్య సామరస్యాన్ని కలిపిస్తుంది.[14]
పండుగ
మార్చుసెప్టెంబర్ 2-21 తేదీలలో జరిగే పంట కాలానికి గుర్తింపుగా జరుపుకునే ఓచ్పానిజ్ట్లీ (Ochpaniztli అంటే "స్వీపింగ్") పండుగలో పూజించే అజ్టెక్ దేవతలలో త్లాజోల్టెయోట్ల్ ఒక దేవత. ఈ సమయ వ్యవధిలో నిర్వహించే వేడుకల్లో ఆచారంగా శుభ్రపరచడం, ఊడ్చివేయడం, మరమ్మత్తు చేయడం,అలాగే మొక్కజొన్న గింజలు వేయడం, నృత్యాలు,సైనిక వేడుకలు జరుగుతాయి.[16]
గ్యాలరీ
మార్చు-
చంద్రుని పోలిన గుర్తులు చక్రీయ లక్షణాలతో ఉండే పాపం, ప్రక్షాళనను సూచిస్తే, జంతు మూలాంశాలు భూమిలో దేవతను, దాని సంతానోత్పత్తిని సూచిస్తాయి.[17]
-
కోడెక్స్ బోర్గియా చిత్రం
-
మరొక కోడెక్స్ బోర్గియా చిత్రం
మూలాలు
మార్చు- ↑ Soustelle, p. 104, 199
- ↑ 2.0 2.1 Sahagun, Florentine codex book 1, p. 23
- ↑ 3.0 3.1 Sullivan, p. 12
- ↑ Sullivan p. ?
- ↑ Sahagun p. 8-9
- ↑ Miller & Taube, p. 168
- ↑ Sahagun p. 8
- ↑ 8.0 8.1 Soustelle, p. 199
- ↑ 9.0 9.1 Soustelle, p. 193
- ↑ Sahagun p. 11
- ↑ Townsend, p. 115
- ↑ Sahagun p. 10-11
- ↑ Sullivan, Thelma D. (1982). Tlazolteotl-Ixcuina: The Great Spinner and Weaver. p. 15.
- ↑ 14.0 14.1 14.2 14.3 Gonzales, Patrisia (2012). Red Medicine: Traditional Indigenous Rites of Birthing and Healing. pp. 98–99.
Klein reinterprets the ochre color symbols found around the mouth and nose of some Tlazolteotl depictions, as well as painted to represent matter emanating from the buttocks — from connoting 'dirt' to 'divine excrement.' She notes that tlazōlli — interpreted by many academics as Tlazolteotl's root word — is not only excrement or something old or used. Similarly the word for 'venerable' is tzin, which comes from tzintli, the buttocks. Urine as 'liquid gold' and offerings of excrement are examples of 'divine excrement' or, as Klein writes playfully, 'Holy Shit'.
- ↑ Klein, Cecelia F. (1993). "Teocuitlatl, 'Divine Excrement': The Significance of 'Holy Shit' in Ancient Mexico". Art Journal. 52 (3): 20–27.
- ↑ Townsend, p. 221
- ↑ Townsend p. 115