ఉష్ణగతికశాస్త్రం

(థర్మోడైనమిక్స్ నుండి దారిమార్పు చెందింది)

ఉష్ణగతికశాస్త్రం (థర్మోడైనమిక్స్ - Thermodynamics) అనేది భౌతికశాస్త్రం యొక్క ఒక విభాగం, ఇది విభిన్న వస్తువుల మధ్య ఉష్ణ కదలికను అధ్యయనం చేస్తుంది. ఉష్ణగతికశాస్త్రం వస్తువుల యొక్క ఒత్తిడి, పరిమాణములలో మార్పును కూడా అధ్యయనం చేస్తుంది. గణాంకశాస్త్రం లేదా సంఖ్యాశాస్త్రం (స్టాటిస్టిక్స్) అనే గణితం యొక్క ఒక విభాగం తరచుగా కణాల యొక్క గమనమును పరిశీలించుటకు ఉష్ణగతికశాస్త్రంలో ఉపయోగించబడుతుంది. ఉష్ణగతికశాస్త్రం చాలా ఉపయోగకరమైనది ఎందుకనగా మనం ప్రతిరోజు చూస్తున్న సువిశాల ప్రపంచంతో అతి చిన్న అణువుల ప్రపంచం సంబంధం ఏలాంటిదో మనం అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. థర్మోడైనమిక్స్ క్లాసికల్ థర్మోడైనమిక్స్, స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ అనే రెండు ప్రధాన విభాగాలుగా కూడా పిలవబడుతుంది. థర్మోడైనమిక్స్‌లో ఒక ముఖ్యమైన ఆలోచన థర్మోడైనమిక్ వ్యవస్థ.

ఈయానిమేషన్ ట్రిపుల్ ఎక్స్పన్షన్ ఆవిరి యంత్రాన్ని చూపిస్తుంది. ఇక్కడ మొదట్లో అధికంగా ఉన్న ఉష్ణం చల్లదనం వైపు గతిస్తూ చల్లబడుతూ ఉంది అలాగే ఈ గమనం తన దారిలో ఉన్న మూడు యంత్రాలను తిప్పుతూ ఉంది.

ఉష్ణగతికశాస్త్ర నియమాలు

మార్చు

ఇక్కడ ఉష్ణగతిక శాస్త్రం యొక్క నాలుగు నియమాలు ఉన్నాయి ఇవి ఉష్ణరూపంలో రెండు వస్తువుల మధ్య శక్తి కదలికలు ఎలా జరుగుతాయో వివరిస్తుంది.

  • థెర్మోడైనమిక్స్ జెరోయేత్ లా :

ఏవైనా రెండు వ్యవస్థలు మూడవ వ్యవస్థతో ధార్మిక సమతుల్యంలో వున్నచో, మొదటి రెండు వ్యవస్థలు కూడా ఒక దానితో మరొకటి ధార్మిక సమతుల్యములో వుండును.దీనిని ఉష్ణోగ్రత నను వివరించేందుకు ఉపకరించేను.

  • థెర్మోడైనమిక్స్ మొదటి సూత్రం :

వేడి అనునది శక్తి యొక్క రూపం .శక్తి నిత్యత్వ సూత్రం ప్రకారముగా వేడి బయటి నుండి వ్యవస్థ లోనికి కానీ, మరొక విధంగా కానీ ప్రవహించినచో, వ్యవస్థ యొక్క అంతర్గత శక్తినందు మార్పునకు కారణం అవుతుంది.అందుచేత ఏ పరికరం అయిననూ ఈ మొదటి సూత్రాన్ని ఉల్లంగిండమనేది అసాధ్యం.

  • థెర్మోడైనమిక్స్ రెండవ సూత్రం :

ఎటువంటి ధార్మిక సమతుల్యతలో లేనటువంటి వివక్త వ్యవస్థ యొక్క ఎంట్రోఫీ అనునది ఎల్లప్పుడూ పెరుగుతుంది . క్లోజ్డ్ వ్యవస్థలు వాటి అంతట అవే సమతుల్యమునకు చేరును –ఈ స్థితి అందు వ్యవస్థకు గరిష్ఠ ఎంట్రోఫీ వుండును-దీనినే థర్మలైజేషన్ అని అంటారు .అందుచేత ఈ ధర్మాన్ని ఉల్లంగించు పరికరాలు అసాధ్యం.

  • థెర్మోడైనమిక్స్ మూడవ సూత్రం:

ఎటువంటి శుద్ధమైన పదార్థము అయిననూ, అది ధార్మిక సమతుల్యములో వున్నచో, దాని ఉష్ణోగ్రత శూన్యానికి చేరుతున్నప్పుడు, దాని ఎంట్రోఫీ విలువ శూన్యము అగును.ఖచ్చిత మైన శూన్యం వద్ద ఎంట్రోఫీ విలువ సరిగ్గా సున్న .మిగిలిన అన్నీసందర్భాలలో దీని విలువ వివిధ స్థితుల సంఖ్య వలన తెలుసుకొనవచ్చును.

ఇవి కూడా చూడండి

మార్చు

ఉష్ణగతిక సూత్రాలు