థామస్ జెఫర్సన్
థామస్ జెఫర్సన్ (April 13 [O.S. April 2] 1743 – July 4, 1826) అమెరికా దేశానికి చెందిన మూడవ అధ్యక్షుడు, అమెరికా దేశ వ్యవస్థాపక పిత్రులుగా పిలువబడే ఐదుగురిలో ఒకరు.వీరు అమెరికా దేశ "స్వాతంత్ర్య ప్రకటన"ను రచించారు. 1801 నుండి 1809 వరకు మూడవ అధ్యక్షుడిగా పనిచేసారు. అంతకు ముందు జాన్ ఆడమ్స్ అధ్యక్షుడిగా వున్న సమయంలో 1797 నుండి 1801 వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేసారు. జెఫర్సన్ ముఖ్యంగా ప్రజాస్వామ్యం, ప్రజా ప్రభుత్వం, మానవ హక్కుల గురించి అమెరికా ప్రజలలో చైతన్యాన్ని కలిగించి అప్పటి వరకు బ్రిటీషు ప్రభుత్వంలో భాగమైవున్న అమెరికాకు స్వాతంత్ర్యం పొందుటలో ప్రముఖ పాత్ర వహించారు.
Thomas Jefferson | |||
Thomas Jefferson by Rembrandt Peale, 1800 | |||
ఉపరాష్ట్రపతి | Aaron Burr (1801–1805) George Clinton (1805–1809) | ||
---|---|---|---|
అధ్యక్షుడు | John Adams | ||
అధ్యక్షుడు | George Washington | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | Democratic-Republican | ||
జీవిత భాగస్వామి | Martha Wayles
(m. 1772; died 1782) | ||
సంతానం | 6, including Martha and Mary | ||
పూర్వ విద్యార్థి | College of William and Mary | ||
సంతకం |
జెఫర్సన్ పూర్వీకులు ఆంగ్లేయులు. వర్జీనియా లో పుట్టి అక్కడే చదువుకున్నాడు. జెఫర్సన్ న్యాయవాద విద్యను అభసించి బానిసల విముక్తి కొరకు పోరాడాడు. అమెరికా విప్లవ సమయంలో వర్జీనియా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి మతస్వేచ్చతో కూడిన చట్టాన్ని రూపొందించారు. అమెరికా దేశ మంత్రిగా ఫ్రాన్సులో పనిచేసారు. అమెరికా దేశ మొట్టమొదటి రాజ్యాంగ కార్యదర్శిగా 1790-93 వరకు మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ అధ్యక్షతన పనిచేసారు. జెఫర్సన్, జేమ్స్ మాడిసన్ కలిసి ఫెడరలిస్టు పార్టీకి వ్యతిరేకంగా డెమోక్రాటిక్-రిపబ్లికన్ పార్టీని నిర్వహించారు
జెఫర్సన్కు ఎన్నో శాస్త్రాల్లో పాండిత్యం వున్నది. గణితము,ఉద్యాన వన నిర్వహణ, భూమి యొక్క కొలతలు చూడడం, భవన నిర్మాణములోను ప్రావీణ్యం వున్నది. జెఫర్సన్కు మతానికి, తత్వశాస్త్రానికి సంబంధించి లోతైన అవగాహన వుండడం వలన అమెరికన్ ఫిలాసఫికల్ సొసైటీకి అధ్యక్షుడిగా పని చేసారు. జెఫర్సన్ కు భాషా పరిజ్ఞానానికి సంబంధించిన శాస్త్రం పట్ల కూడా అవగాహన వున్నది. ఎన్నో భాషలలో ప్రావీణ్యం కూడా వున్నది. జెఫర్సన్ యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాని స్థాపించారు. ప్రభుత్వ పదవులనుండి విరమణ పొందిన తరువాత పేరుపొందిన ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించారు. జెఫర్సన్ రచించిన ఒకే ఒక పుస్తకం "నోట్స్ ఆన్ ది స్టేట్ ఆఫ్ వర్జీనియా" 1800 సంవత్సరానికి ముందు వచ్చిన పుస్తకాలలో ముఖ్యమైనదిగా పేరుగాంచింది.
జెఫర్సన్ వద్ద ఎన్నో తోటలు వుండేవి. వాటి నిర్వహణకు కొన్ని వందల మంది బానిసలు అతని వద్ద పనిచేస్తుండేవారు. చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం అతని భార్య 1782లో మరణించిన తరువాత అతని వద్దనున్న బానిస "సేలీ హెమింగ్స్" తో శారీరక సంబంధం వుండేదని అతని ద్వారా ఆమెకు ఒక బిడ్డ కూడా జన్మించాడని వారు తెలిపారు.
Bibliography
మార్చుScholarly studies