థామస్ నోల్ అడోబ్ ఫోటోషాప్ సృష్టించిన ఒక అమెరికన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. 1988 లో ఇతను ఇమేజ్ ప్రాసెసింగ్ నిత్యకృత్యాల యొక్క అభివృద్ధిని ప్రారంభించాడు[1]. థామస్ ముందుగా కోర్ నిత్యకృత్యాలను సృష్టించాడు, తరువాత అతను వాటిని ఇండస్ట్రియల్ లైట్ అండ్ మేజిక్ లో పనిచేసే తన సోదరుడు జాన్ నోల్ కి చూపించాడు[1]. వాటిని చూసి జాన్ ఇష్టపడ్డాడు, కొత్త లక్షణాలను సూచించాడు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ తో ఒక ప్యాకేజీ చేయాలని థామస్ ను ప్రోత్సహించాడు.[2] 1989 లో జాన్ విజయవంతంగా ఈ ప్రోగ్రామ్‌ను అడోబ్ సిస్టమ్స్ కు విక్రయించాడు, దీనిని అడోబ్ సిస్టమ్స్ ఫోటోషాప్ గా వెలుగు లోనికి తీసుకువచ్చింది. నోల్ ఆన్ ఆర్బర్, మిచిగాన్ లో పుట్టి పెరిగాడు, మిచిగాన్ విశ్వవిద్యాలయం నుండి పట్టా పుచ్చుకొన్నాడు. ఇతను ప్రస్తుతం అన్ అర్బోర్ లో నివసిస్తున్నాడు. టామ్ యొక్క తండ్రి గ్లెన్ నోల్ మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ గా పనిచేశారు[3].

థామస్ నోల్
జననం (1960-04-14) 1960 ఏప్రిల్ 14 (వయసు 64)
విద్యాసంస్థమిచిగాన్ యూనివర్సిటీ
వృత్తిసాఫ్టువేర్ ఇంజనీర్
జీవిత భాగస్వామిరూత్ నోల్
పిల్లలుఆండ్రూ నోల్, హన్నా నోల్

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "From Darkroom to Desktop—How Photoshop Came to Light". 2000-02-18. Archived from the original on 2007-06-26. Retrieved 2010-02-19.
  2. "20 Years of Adobe Photoshop". webdesignerdepot.com. 2010-02-01. Retrieved 2010-02-19.
  3. http://prezi.com/yltwomrmonnj/biography-of-john-thomas-knoll

ఇతర లింకులు మార్చు