థెర్మోడైనమిక్ స్టీము ట్రాప్
థెర్మోడైనమిక్ స్టీము ట్రాప్ ఒక స్టీము ట్రాప్.దీనిని క్లుప్తంగా టిడిఎస్ ట్రాప్ అనికూడా అంటారు.స్టీము ట్రాప్ అనునది స్టీము (నీటి ఆవిరి), ద్రవీకరణ చెందిన నీటి మిశ్రమం నుండి కేవలం ద్రవీకరణ (condensate) ను మాత్రమే వ్యవస్థ బయటకు పంపే ఒకరకమైన కవాటం[1]. ట్రాప్ అను ఇంగ్లీసు పదానికి తెలుగు అర్థం బోను.ఆవిరి, నీటిమిశ్రమంలో, కేవలం ఆవిరిని/స్టీమును మాత్రమే పరికరంలో బోనులా బంధించి కేవలం ద్రవికరణ చెందిన ఆవిరిని (నీరు) బయటికి వదలడం వలన దీనికి ఆవిరి బోను అనగా స్టీము ట్రాప్ అను పేరు ఏర్పడినది.
కవాటానికి స్టీము ట్రాప్ కు ఉన్న వత్యాసం?
మార్చుకవాటం అను ఉపకరణం కేవలం ఒక ద్రవం లేదా వాయువును లేదా ఒకటికన్న ఎక్కువ ద్రవాలను ప్రవహింప చేయును లేదా ప్రవాహా పరిమా ణాన్ని నియంత్రణలోప్రవహింప చేయును.[2] ఇక ఏకదిశ ప్రవాహ కవాటంలో ప్రవాహం కేవలం ఒకదిశలో మాత్రమే ప్రవహించును.వ్యతిరేక దిశలో ప్రవాహం వెళ్ళదు
ఇక స్టీము ట్రాప్ అనునది స్టీము నీటి మిశ్రమం నుండి కేవలం నీటిని మాత్రమే అనుమతించును. ఏకదిశ ప్రవాహ కవాటం లా ఒకదిశలో మాత్రమే ప్రవాహం వెళ్ళును.వ్యతిరేకదిశలో ట్రాపును బిగించిన పనిచేయదు.
టి.డి.ఎస్ ట్రాప్
మార్చుటి.డి.ఎస్ ట్రాప్ అనునది థెర్మోడైనమిక్ స్టీము ట్రాప్ (thermodynamic steam trap) అను ఆంగ్ల పదానికి సంక్షిప్త రూపం.ట్రాప్ గుండా ప్రవహించు ఫ్లాష్ స్టీము యొక్క డైనమిక్ శక్తి ప్రభావం వలన ఈట్రాప్ పనిచేయును.ఇది బెర్నోలి (Bernouli) సూత్రం ఆధారంగా పనిచేయును. ట్రాప్ లో ద్రవీకరణ చెందిన స్టీము (నీరు), స్టీములు ఏర్పరచు పీడనం, త్వరణం సంబంధం ఆధారంగా ఈ ట్రాప్ పని చేయును. ఈ రెండింటి పీడనం, త్వరణం ల వ్యత్యాసం వలన లోపలి డిస్కు పైకి కిందికి కదులును[3] సాధారణ మైనన సరళమైన నిర్మాణం కలిగిన ట్రాప్ ఇది. ఈ ట్రాప్‌లో కదిలే భాగాలు తక్కువ.ఇందులో వృత్తాకారంలో ఉన్న ఉక్కు బిళ్ళ (డిస్కు) మాత్రమే కావాట పీఠంమీద నిలువుగా పైకి కిందికి కదులును.ఈ బిళ్ళ కూడా యాంత్రిక శక్తి వలన కాకుండా ట్రాప్ లోకి ప్రవేశించు ఫ్లాష్ స్టీము యొక్క, ద్రవీకరణ చెందిన ఆవిరి పీడనం వలన పైకి కిందికి చలించును. అందువలన దీనిని థెర్మోడైనమిక్ స్టీము ట్రాప్ అనడం జరిగింది. ఈ ట్రాప్ చూచుటకు తిరగేసిన y ఆకారంలో వుండును.
ఇన్వర్టెడ్ బకెట్ స్టీము ట్రాప్, బాల్ ఫ్లోట్ స్టీము ట్రాప్ వంటి వాటిని ఉపయోగించునపుడు ఈ ట్రాపులకు ముందు స్టీము+ద్రవీకరణ చెందిన స్టీము వచ్చు పైపుకు ఒక స్ట్రయినరు అను దానిని బిగిస్తారు.ఈ స్ట్రయిన రు అనునది ఒక ఫిల్టరు, అనగా ఏవైన ఇతర ఘనపదార్థాల ముక్కలు, రేణువులు వచ్చిన ఈ స్ట్రయినరు లోని సన్నని రంధ్రాలు వున్న ఉక్కుగొట్టం నిరోధించి కేవలం స్టీము, ద్రవీకరణ చెందిన స్టీమును ట్రాప్ కు వెళ్ళుటకు అనుమ తించును. స్ట్రయినరులోని ఫిల్టరు గొట్టం పలుచన్ స్టెయిన్‌లెస్ ఉక్కు రేకుతో చెయ్యబడి సన్నని రంధ్రాలు కల్గి వుండును.టి.డి.ఎస్ ట్రాప్ కు ప్రత్యేకంగా ఇలా స్ట్రయినరును అదనంగా అమర్చవలసిన అవసరం లేదు. ఫిల్టరును ట్రాప్ లో ఒకభాగం ఉంది.ఇది టి.డి.ఎస్ ట్రాప్ కు ఇతర ట్రాపులకు వున్న ముఖ్యమైన తేడా.
టి.డి.ఎస్ ట్రాప్ లోని ముఖ్యమైన భాగాలు
మార్చు- 1.బాడీ
- 2.డిస్కు లేదా కవాట బిళ్ళ
- 3.ఫిల్టరు గొట్టం
బాడీ
మార్చుఇది పోత ఇనుము లేదా పోత ఉక్కుతో చెయ్యబడి వుండును.కిందికి ఏటవాలుగా వున్నా భాగంలో ఫిల్టరు వుండును.సరళంగా (నేరుగా) ఉన్న రెండు చివర లోమరలు కలిగి వుండును. ఒక చివర నుండి స్టీము, ద్రవీకరణ చెందిన స్టీము మిశ్రమం ప్రవహించగా, రెండో చివర నుండి కేవలం వేరు చేయబడిన నీరు (ద్రవీకరణ చెందిన స్టీము) బయటకు ప్రవేశించును. బాడీలో డిస్కు ఉండు పైభాగాన మరలు వున్న మూత వుండును.అలాగే ఫిల్టరు వుండు భాగంలో కూడా ఒక మరలు వున్న బోల్టు వంటి మూత/కవరు వుండును. పై మూతని విప్పి డిస్కును చూడవచ్చును. కింది మూత తీసి, ఫిల్టరును బయటికి తీసి దానిలో ఎవైన పదార్థాలు, తుప్పు వంటివి జమ అయ్యి ఫిల్టరు రంధ్రాలు పూడుకు పోయిన వాటిని తొలగించి మరల బిగించ వచ్చును.
డిస్కు లేదా కవాట బిళ్ళ
మార్చుఇది గుండ్రంగా వృత్తాకారంలో బిళ్ళలా వుండును.ఇది కవాట పీఠం మీద పైకి కిందికి కదులు తుండును. డిస్కు కవాట పీఠం నుండి పైకి లేచినపుడు ద్రవీకరణ చెందిన ఆవిరి మధ్య రంధ్రం ద్వారా, దాని పక్కనే వున్న మరో రెండు రంధ్రాల ద్వారా పయనించి బయటి కెళ్ళు మార్గాన్ని చేరును.
ఫిల్టరు గొట్టం
మార్చుఇది స్తూపాకరగొట్టం వంటి నిర్మాణం. పలుచని స్టెయిన్‌లెస్ గొట్టంతో చెయ్యబడి వుండును. గొట్టం పైన చుట్టూ సన్నని రంధ్రాలు ఉండును. ద్రవీకరణ చెందిన నీటి ఆవిరి ముందు ఈ గొట్టం లోపలికి వెళ్ళి గొట్టంకున్న రంధ్రాల ద్వారా వేలుపలికి వచ్చి కవాట పీఠంచేరును. ద్రవీకరణ చెందిన నీటి ఆవిరిలో ఏమైన మలినాలు (స్టీము గొట్టంలో ఏర్పడు తుప్పు, ప్యాకింగు ముక్కలు, నలుసులు వంటివి) వుంటె అవి ఇక్కడే వుండి పోవును.ఫిల్టరు వున్న భాగం కింద మరలు వున్న మూత వుండును. ఈ మూతను విప్పి ఫిల్టరును బయటికి తీసి శుభ్రం చెయ్యవచ్చు.
పని చేయు విధం
మార్చుట్రాపులో మొదట డిస్కు (కవాట బిళ్ళ) ట్రాప్ కవాట ద్వారం యొక్క కవాట పీఠం మీద కూర్చొని వుండును. నీరుగా ద్రవీకరణ చెందిన స్టీము లోపలి వచ్చి, ఫిల్టరు ద్వారా కవాట రంధ్రంలోకి ప్రవేశించును. కవాట మార్గం యొక్క మధ్య రంధ్రం గుండా పైకి వచ్చిన నీరు నీరు కలగుచేయు తోపుడు శక్తి (పీడనం ) వలన డిస్కు పైకి లేచును. నీరు ట్రాపులో ప్రవహిస్తున్నంత సేపు, నీటి ప్రవాహ పీడనం వలన డిస్కు పైకి లేచి వుండును. బిళ్ళ పైకి లేచి వుండటం వలన కవాట పీఠంలోని మధ్యరంద్రం గుండా వచ్చిన నీరు వృత్తాకార కవాట మార్గం వృత్తాకార భాగంలోనే నిలువుగా వున్న బెజ్జాల ద్వారా నిర్గమ రంధ్రంలోకి ప్రవేశించి బయటకు వెళ్ళును.ద్రవీకరణ చెందిన స్టీముకుబదులుగా స్టీము ట్రాప్ లోకి వచ్చినపుడు స్టీము వత్తిడికి బిళ్ళ కొద్ది సేపు పైకి లేచి వుండును. కాని బిళ్ళ వెనుక భాగంలో చేరిన స్టీము కింది వైపుకు బిళ్ళ పై కలుగ చేయు వత్తిడి వలన బిళ్ళ కిందికి నెట్టబడి, కవాట బెజ్జాన్ని మూయును. స్టీము బయటకు వెళ్ళడం ఆగి పోవును. తిరిగి నీరు ట్రాప్ లోకి రావడం మొదలయ్యకా, బిళ్ళ మీద వత్తిడి కల్గించు స్టీము, వికరణ వలన ఉష్ణాన్ని కోల్పోయి చల్లబడి నీరుగా మారడం వలన వత్తిడి తగ్గి పోవును.ఇప్పుడు బిళ్ళ పైన స్టీము వత్తిడి కన్న నీటి వత్తిడి ఎక్కువ అవ్వడం వలన మళ్ళి డిస్కు పైకి లేచి, నీరుబయటకు వెళ్ళును.ఈ విధంగా ట్రాపులో ద్రవీకరణ చెందిన స్టీము ఆగి ఆగి బయటకు వచ్చును.[4]
ట్రాప్ బిగింపులో తీసుకో వలసిన జాగ్రత్తలు
మార్చుఈ ట్రాపును కచ్చితంగా క్షితిజసమాంతరంగా బిగించాలి.అప్పుడే డిస్కు సరిగా కవాట పీఠం మీద సమతలంగా కూర్చొని సరిగా పనిచేయును.అలాకాకుండా ఏటవాలుగా లేదా పక్కకు వారికి వుండేలా బిగించిన పని చేయదు.అప్పుడప్పుడు ఫిల్టరును బయటికి తీసి శుభ్రం చేస్తూ వుండాలి, ఫిల్టరు తుప్పు వంటి మలినాలతో పూడుకు పోయిన ట్రాప్ పని చెయ్యదు.ట్రాప్ మీడ వున్న బాణం గుర్తు ప్రకారం బిగించాలి.వ్యతిరేక దిసలో బిగించిన పని చెయ్యదు.
బయటి వీడియోల లింకులు
మార్చుఈవ్యాసాలు కూడా చదవండి
మార్చుమూలాలు/ఆధారాలు
మార్చు- ↑ "What Is A Steam Trap & How Does It Work?". thermaxxjackets.com. Archived from the original on 2017-01-21. Retrieved 2018-03-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "valve". whatis.techtarget.com. Archived from the original on 2017-10-02. Retrieved 2018-03-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Thermodynamic steam traps". miyawaki.net/index.php. Archived from the original on 2017-09-08. Retrieved 2018-03-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "How Disc Traps Work: A Look at their Mechanism and Merits". tlv.com. Archived from the original on 2017-09-09. Retrieved 2018-03-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)