దక్షిణాత్యుల నాట్యకళా చరిత్ర

దక్షిణాత్యుల నాట్యకళా చరిత్ర ఒక విశిష్టమైన నాట్యకళ కు సంబంధించిన గ్రంథము.

దాక్షిణ భారతీయుల నాట్యకళా రీతులు, వాటి విశేషాలు, తేడాలు, వివరాలు వంటి వాటితో సమగ్రంగా ఈ గ్రంథాన్ని రూపొందించారు. కేవలం శాస్త్రీయ నృత్యరీతులకే పరిమితం కాకుండా జానపద నృత్యరీతులు, ఇతర విధానాల నృత్యరీతుల గురించి వివరించడం రచయిత విస్తృత అవగాహనకు, సరైన దృక్పథానికి నిదర్శనం. నృత్యప్రదర్శనల ద్వారా జీవించే వివిధ కులాల గురించి కూడా వివరాలు ఇచ్చారు. ఈ గ్రంథంలోని వివరాలు విజ్ఞాన సర్వస్వ శైలిలో ఉంటాయి.

విషయసూచిక

మార్చు
  1. దక్షిణాత్యుల నాట్య కళాచరిత్ర
  2. భారతీయ నృత్యకళ పెంపొందిన రీతి.
  3. కళ
  4. భారతీయ సంగీతకళ
  5. నేటి భారతదేశములోని నృత్యసాంప్రదాయములు
  6. కొన్ని అపూర్వనృత్యములు
  7. శివతాండవము
  8. దేవనర్తకి - ఆలయనృత్యములు
  9. ఆంధ్రదేశములోని ఆలయాల్లో, భరతనాట్యము, బాగవతములందు ప్రదర్శించే నృత్య విన్యాసములు - వాని వివరములు
  10. పురాణేతిహాస కావ్యప్రబంధములందు వర్ణింపబడిన నృత్య విశేషములు
  11. తమిళనాడులోని శాస్త్రీయ నృత్యకళాస్వరూపము
  12. కన్నడ దేశములోని యక్షగానం
  13. కేరళ నృత్యము కథకళీ
  14. బౌద్ధభిక్షువుల అమృతజీవనం
  15. ఆంధ్రలో జానపద ఆరాధాననృత్యములు
  16. కేరళ దేశంలోని జానపద నృత్యరీతులు
  17. తమిళ దేశంలోని జానపద నృత్యములు
  18. కర్ణాటక ప్రాంతంలోని జానపద నృత్యరీతులు
  19. భరతనాట్యము
  20. నాట్యవేదము

మూలాలు

మార్చు