దర్పణం (2019 సినిమా)

దర్పణం 2019లో తెలుగులో విడుదలైన సినిమా. శ్రీనంద ఆర్ట్స్‌ బ్యానర్‌పై రామకృష్ణ వెంప దర్శకత్వంలో క్రాంతి కిరణ్‌ వెల్లంకి ఈ సినిమాను నిర్మించాడు. తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్‌, శుభంగి పంత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 8న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేశారు.[1]

దర్పణం
దర్శకత్వంరామకృష్ణ వెంప
స్క్రీన్ ప్లేరామకృష్ణ వెంప
నిర్మాతక్రాంతి కిరణ్‌ వెల్లంకి
తారాగణంతనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్‌, శుభంగి పంత్‌
ఛాయాగ్రహణంస‌తీష్‌ ముత్యాల‌
కూర్పుస‌త్య‌ గిడుతూరి
సంగీతంసిద్దార్ధ్ స‌దాశివుని
నిర్మాణ
సంస్థ
శ్రీనంద ఆర్ట్స్‌
విడుదల తేదీ
2019 సెప్టెంబర్ 6
సినిమా నిడివి
117 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

కార్తీక్ (తనిష్క్‌ రెడ్డి) అల్లరిచిల్లరగా తిరుగుతూ తన మిత్రులతో కలిసి దొంగతనాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే కార్తీక్ మిత్రులతో కలిసి ఓ బంగ్లాలోకి దొంగతనానికి వెళ్తారు. కానీ అప్పటికే ఆ బంగ్లాలోని శ్రావ్య (శుభంగి పంత్‌) కుంటుంబాన్ని ఎవరో చంపేసి వెళ్తారు. శ్రావ్య దెయ్యంగా మారి వీళ్ళను భయపెడుతూ తన బంగ్లాలో బంధిస్తోంది. ఇంతకీ శ్రావ్య కుంటుంబాన్ని చంపింది ఎవరు ? మరి దెయ్యం నుండి కార్తీక్ బ్యాచ్ ఎలా తప్పించుకుంది ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు మార్చు

  • తనిష్క్‌ రెడ్డి[2][3]
  • ఎలక్సియస్‌
  • శుభంగి పంత్‌

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: శ్రీనంద ఆర్ట్స్‌
  • నిర్మాత: క్రాంతి కిరణ్‌ వెల్లంకి
  • సహ నిర్మాతలు: కేశవ్‌ దేశాయ్, క్రాంతి కిరణ్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామకృష్ణ వెంప
  • సంగీతం: సిద్దార్ధ్ స‌దాశివుని
  • సినిమాటోగ్రఫీ: స‌తీష్‌ ముత్యాల‌
  • ఎడిట‌ర్: స‌త్య‌ గిడుతూరి
  • స్టాంట్స్: మల్లేష్, నందు
  • డాన్స్: బాలు

మూలాలు మార్చు

  1. Sakshi (22 August 2019). "సెప్టెంబర్‌ 6న 'దర్పణం'". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  2. Sakshi (5 September 2019). "ఆర్య చూసి హీరో అవ్వాలనుకున్నా". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  3. The Hans India (5 September 2019). "Tanishq's Darpanam Highlights Revealed!" (in ఇంగ్లీష్). Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.