మున్షీ ఘాట్

వారణాసిలో గంగానదిపై ఉన్న స్నానఘట్టం
(దర్భంగా ఘాట్ నుండి దారిమార్పు చెందింది)

మున్షీ ఘాట్ వారణాసిలోని స్నానఘట్టాల్లో ఒకటి.

మున్షీ ఘాట్
భౌగోళికం
భౌగోళికాంశాలు25°18′20.475″N 83°0′35.68″E / 25.30568750°N 83.0099111°E / 25.30568750; 83.0099111
దేశంభారతదేశం

ప్రాముఖ్యత

మార్చు

1812 సంవత్సరంలో నిర్మించబడిన మున్షీ ఘాట్‌కు నాగ్‌పూర్ ఎస్టేట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన శ్రీధర నారాయణ మున్షీ పేరు పెట్టారు. 1915లో, దర్భంగా (బీహార్)కి చెందిన బ్రాహ్మణ రాజు కామేశ్వర్ సింగ్ గౌతమ్ బహదూర్, ఈ ఘాట్‌ను కొనుగోలు చేసి దాన్ని విస్తరించాడు. ఈ విస్తరణ తర్వాత ఇది దర్భంగా ఘాట్‌గా మారింది. [1]

దర్భంగా ఘాట్ విస్తరణ

మార్చు

దర్భంగా ఘాట్ లోని రాజభవనాన్ని చునార్ నుండి తెచ్చిన ఇసుకరాతితో నిర్మించారు. అందమైన వరండాలు, గ్రీకు స్తంభాలు ఈ భవన విశిష్టత. పౌరాణికంగా ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత ఉంది. దాంతోపాటు, ఈ భవన వైభవానికి, నిర్మాణ శైలికి కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది.

1994లో దర్భంగా ప్యాలెస్‌ని క్లార్క్స్ హోటల్ గ్రూప్ కొనుగోలు చేసింది. దానికి బ్రిజ్రామా ప్యాలెస్ అని పేరు పెట్టి, దానిని ఫైవ్ స్టార్ హోటల్‌గా మార్చాలని ప్లాన్ చేసింది. వారు ఇప్పటికే వెనుక నుండి దాదాపు సగం నిర్మాణాన్ని పడగొట్టారు; దాని వెనుకవైపున విస్తరించారు. హోటల్ వినియోగానికి అనుకూలంగా ఉండేలా దాని ఎత్తును పెంచారు.

మూలాలు

మార్చు
  1. Proposing Varanasi for the World Heritage List of UNESCO (PDF), Varanasi Development Authority