దళం
దళం 1996 డిసెంబరు 19న విడుదలైన తెలుగు సినిమా. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ కింద ఈ సినిమాకు ఆర్ నారాయణ మూర్తి కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం భాద్యతలను నిర్వహించాడు. ఆర్.నారాయణమూర్తి, పి.ఎల్.నారాయణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]
దళం (1996 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఆర్.నారాయణమూర్తి |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | స్నేహచిత్ర పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఆర్. నారాయణమూర్తి
- పి.ఎల్.నారాయణ
- అప్పారావు
- నర్రా
- పురాణం సూర్య
- ముక్కురాజు
- సంధ్యారాణి
- మధురిమ
- శివపార్వతి
సాంకేతిక వర్గం
మార్చు- మాటలు: పి.ఎల్.నారాయణ
- పాటలు: గూడ అంజయ్య, భానూరి, మండే సత్యం, సుద్దాల అశోక్ తేజ
- ఫోటోగ్రఫీ : జి.చిరంజీవి
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి
కథ
మార్చుచిత్రం మొదటి భాగమంతా భూషయ్య అనే రాజకీయ భూస్వామి మొసలి కన్నీరు చుట్టూ తిరుగుతుంది. ముత్తాతలనాటి నుంచి భూషయ్య భూమిని కౌలు చేసుకుంటూ గడేపే వ్యవసాయ కూలీ జీవితాలలో ఈ తరం వరస వెంకన్నది. ఈ పాత్ర పోషించింది నారాయణమూర్తి, వెంకన్నలో అమాయకత్వం కన్నా మంచితనం ఎక్కువ. తనని తన యజమాని దొంగ సానుభూతితో మోసం చేస్తున్నాడని గ్రహించని మనస్తత్వం వెంకన్నది. అయితే వెంకన్న కూతురు ఇది గ్రహించి అప్పటికే వామపక్ష ఉద్యమంలోకి దిగుతుంది. మరోపక్క తండ్రి ఉన్నదంతా సర్దుకుపోవడం పోయి అహంకారంతో కొడుకు అసమర్థతకి చివాడ్లు పెట్టే రకం. భార్య, మరో కూతురు ఈ కుటుంబంలో ఇతర సభ్యులు. భూషయ్యకి వెంకన్న కుడి భుజం లాంటి వాడు. ఆ వాడలోని ఓట్లన్నీ వెంకన్న ఎటు చెబితే అటే పడతాయి. పైగా పది మందిని చితకతన్నగల బలవంతుడు, నేర్పరి. భూషయ్య అతనిలోని ఈ గుణాలన్నీ వాడుకుంటాడు గానీ, అతని బతుకుని మాత్రం సాఫీగా నడవనివ్వడు. అతను పండించే పంటని వడ్డీల మీద అప్పిచ్చి లాక్కుంటాడు. మరో పక్క భూషయ్య రాజకీయ ప్రత్యర్థి మరొకడున్నాడు. అతని పేరు నాగయ్య. అతని కిందా ఓ రౌడీ ఉంటాడు. ఈ చిత్రంలో మొదట్లో వచ్చే దృశ్యాలన్నీ ఈ రాజకీయ భూస్వాముల స్వార్థాన్ని ప్రతిబింబిస్తుంది.
చిత్రం ఈ ధోరణిలో కొంత నడవగా ఎన్నికల్లో గెల్చిన భూషయ్య భూసంస్కరణల విషయంలో మిగులు భూమి పంచడానికి చేసిన వాగ్దానం విషయంలో వెంకన్ననీ, తదితర రైతు కూలీలనీ మోసం చేయడంతో జ్ఞానోదయం కలిగిన వెంకన్న ఎదురు తిరగడంతో కథాస్వరూపం మారుతుంది.
గ్రామంలో ఆ పెద్దలిద్దరూ చేతులు కలిపితే రైతు కూలీలంతా చేతులు కలిపి ఉద్యమానికి ముందడుగేస్తారు. వీరి మధ్య మరో పాత్ర ఉంది. డి.ఎస్.పి పాత్ర. పోలీసుల్లో కూడా నక్సజిలాన్ని సమర్థించి నీరు పోసేవారున్నారని చూపించడానికి బాగా ముందుకు తీసుకు పోయిన పాత్ర అది. చివరికి డియస్పీ కూడా ఉద్యోగాన్ని వదలి, జెండాలు పట్టుకుని అరణ్యాలల్లోకి నడుస్తాడు అన్నల వెంట.
తండ్రినీ, భార్యనీ, కూతురినీ వరసగా బలితీసుకున్న భూషయ్య సమాజంపై కత్తికట్టి వెంకన్న కొందరితో కలసి అన్నల వెంట అడవులకు నడవడంతో కథ సాధారణ మార్గాన పడుతుంది. దాన్ని బ్రేక్ చేయడానికి ఈ నాటి ఉగ్రవాదులు కొందరు పోలీసులకు లొంగిపోవడం అనే ప్రహసనం దీన్లో ఇరికించి అట్లా లొంగిపోతే ఏం జరుగుతుందోనని గ్రహించి, మళ్లీ తుపాకి పట్టుకుని అన్నల్లో కలసి దళపతిగా చివరి యుద్ధం నడిపించడం మిగతా భాగం.
మూలాలు
మార్చు- ↑ "Dhalam (1996)". Indiancine.ma. Retrieved 2021-04-04.