దానియేలు లేక డేనియల్ (హీబ్రూ: דָּנִיאֵל‎, Dani’el, అర్థం "దేవుడే నా న్యాయాధికారి", గ్రీకు: Δανιήλ) బైబిల్లోని బుక్ ఆఫ్ డానియెల్లో కథానాయకుడు.[1] జెరుసలేంలోని యూదు రాజవంశీకుడైన అతనిని బాబిలోనుకు చెందిన నెబుకద్నెజరు అనే రాజు బంధించాడు. ఆపైన దానియేలు రాజును, అతని వారసులను సేవించాడు. ఇలా పర్షియాకు చెందిన దండయాత్రికుడు సైరస్ వచ్చి ఆక్రమించేవరకు సాగింది. అతని జీవితంలో ప్రతీ సమయంలోనూ ఇజ్రాయెల్ దేవుడికి నిజమైన భక్తుడిగా కొసాగాడు.[2] ఆధునిక పండితులు దానియేలు చారిత్రక వ్యక్తి కాడని, అతని పుస్తకం సా.శ.పూ.2వ శతాబ్దికి చెందిన గ్రీకు రాజు నాలుగో ఆంతియోచస్ ఎపిఫానెస్ కాలం నాటి అస్పష్టమైన ఐతిహాసిక పురాణ గాథ అనీ ఏకాభిప్రాయానికి వచ్చారు.[3][1]

బ్రిటన్ రివెరె వేసిన డానియెల్ ఆన్సర్ టు కింగ్ చిత్రం


మూలాలుసవరించు

  1. 1.0 1.1 Noegel & Wheeler 2002, p. 74.
  2. Redditt 2008, pp. 181–82.
  3. Collins 1999, p. 219.
"https://te.wikipedia.org/w/index.php?title=దానియేలు&oldid=2581086" నుండి వెలికితీశారు