దాశరథీ శతకము

తెలుగు పద్యం

దాశరథీ శతకము (Dasarathi Satakamu) శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో రచించిన భక్తి శతకము. ఈ శతకానికి దాశరథీ కరుణాపయోనిధీ అనే మకుటం అన్ని పద్యాలలో చివరగా వస్తుంది. దాశరథీ అనగా దశరథుని పుత్రుడైన శ్రీరాముడు. గోపన్న ఆత్రేయస గోత్రుడు . కాంమాంబ యాతని తల్లి, తండి... లింగన మంత్రి. ఈ విషయమును ఇతడు ఈ పద్యమున తెలెపెను.

దాశరథీ శతకము
కవి పేరుకంచర్ల గోపన్న
ఆంగ్లంలో పేరుDASARATHI SATHAKAM
వ్రాయబడిన సంవత్సరం17 వ శతాబ్దం
దేశంభారత దేశము
భాషతెలుగు
మకుటందాశరథీ కరుణాపయోనిధీ
విషయము(లు)శ్రీరాముని కీర్తిస్తూ
పద్యం/గద్యంపద్యములు
ఛందస్సువృత్తములు
మొత్తం పద్యముల సంఖ్య100 కి పైగా
అంతర్జాలం లోవికీసోర్సు లో దాశరథీ శతకము
అంకితంశ్రీరాముడు
కీర్తించిన దైవంశ్రీరామచంద్రుడు
శతకం లక్షణంఉత్తమ శతకం

 అల్లన లింగ మంత్రి సుతుడత్రిజగోత్రజడాదిశాఖ కం
 చెర్లకులోద్భవుండన బ్రసిద్దుడనై భవ దంకితంబుగా
 నెల్ల కవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
 ద్వల్లభ: నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ.

ఈ కవి ఈ శతకమే గాక మరికొన్ని గ్రంథములను కూడా వ్రాసినట్లు కానీ వాటిని ఇతరులు మోసముతో తస్కరించినట్లూ ఈ క్రింది పద్యము వలన తెలియుచున్నది.

 మసగొని రేగు బండ్లకును మౌక్తికముల్ వెలపోసినట్లు దు
 ర్వ్యసనము జెంది కావ్వము దురాత్ములకిచ్చితి మోసమయ్యెనా
 రసనకు బూతవృత్తి సుకరంబుగ జేకురునట్లు వాక్పుధా
 రసములు చిల్క పద్యముఖరంగము నందు నటింపవయ్య సం
 తపసమును జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

ప్రారంభంసవరించు

శ్రీ రఘురామ! చారుతుల - సీదళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ ! త్రిజ - గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస వి - రామ ! జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ ! భద్రగిరి - దాశరథీ కరుణాపయోనిధీ

కొన్ని ఉదాహరణలుసవరించు

 రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
 త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స
 త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా
 తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.


 పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు
 స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా
 శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో
 త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ.


 రాముఁడు ఘోర పాతక విరాముడు సద్గుణకల్పవల్లికా
 రాముడుషడ్వికారజయ రాముడు సాధుజనావనవ్రతో
 ద్దాముఁడు రాముడే పరమ దైవము మాకని మీ యడుంగు గెం
 దామరలే భుజించెదను దాశరథీ కరుణాపయోనిధీ. ఎంతటిపుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ
 మంతన మెట్టిదో యుడుత మైనిక రాగ్ర నఖాంకురంబులన్
 సంతసమందఁ జేసితివి సత్కులజన్మము లేమి లెక్క వే
 దాంతముగాదె నీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.

ముగింపుసవరించు

ఈ చివరిపద్యంలో కవి తనగురించి వివరాలు తెలియజేశాడు. తాను అల్లన లింగమంత్రిగారి పుత్రుడిగా, అత్రిజగోత్రం ఆదిశాఖలో కంచెర్ల వంశంలో జన్మించినట్లుగా వివరించాడు.

 అల్లన లింగమంత్రి సుతుడత్రిజ గోత్రజుడాదిశాఖ కం
 చెర్ల కులోద్బవుం దంబ్రసిద్ధిడనై భవదంకితంబుగా
 నెల్లకవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
 ద్వల్లభ నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ!

బయటి లింకులుసవరించు

పూర్తి పాఠంసవరించు


శతకములు
ఆంధ్ర నాయక శతకము | కామేశ్వరీ శతకము | కుక్కుటేశ్వర శతకము | కుప్పుసామి శతకము | కుమార శతకము | కుమారీ శతకము | కృష్ణ శతకము | గాంధిజీ శతకము | గువ్వలచెన్న శతకము | గోపాల శతకము | చక్రధారి శతకము | చిరవిభవ శతకము | చెన్నకేశవ శతకము | దాశరథీ శతకము | దేవకీనందన శతకము | ధూర్తమానవా శతకము | నరసింహ శతకము | నారాయణ శతకము | నీతి శతకము | భారతీ శతకము | భాస్కర శతకము | మారుతి శతకము | మందేశ్వర శతకము | రామలింగేశ శతకము | విజయరామ శతకము | విఠలేశ్వర శతకము | వేమన శతకము | వేంకటేశ శతకము | వృషాధిప శతకము | శిఖినరసింహ శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | శ్రీ కాళహస్తీశ్వర శతకము | శ్రీవేంకటాచల విహార శతకము | సర్వేశ్వర శతకము | సింహాద్రి నారసింహ శతకము | సుమతీ శతకము | సూర్య శతకము | సమాజ దర్పణం | విశ్వనాథ పంచశతి | విశ్వనాథ మధ్యాక్కఱలు | టెంకాయచిప్ప శతకము | శ్రీగిరి శతకము | శ్రీకాళహస్తి శతకము | భద్రగిరి శతకము | కులస్వామి శతకము | శేషాద్రి శతకము | ద్రాక్షారామ శతకము | నందమూరు శతకము | నెకరు కల్లు శతకము | మున్నంగి శతకము | వేములవాడ శతకము