దిగువ సుబన్సిరి ఆనకట్ట

సుబన్‌సిరి దిగువ ఆనకట్ట, అధికారికంగా సుబన్‌సిరి దిగువ జలవిద్యుత్ ప్రాజెక్ట్ (SLHEP) అని పేరు పెట్టారు, ఈశాన్య భారతదేశంలోని సుబన్‌సిరి నదిపై నిర్మాణంలో ఉన్న గ్రావిటీ డ్యామ్. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబన్‌సిరి నదికి ఎగువన 2.3 కి.మీ. (1.4 మై.) వద్ద ఉంది. NHPC లిమిటెడ్ ద్వారా రన్-ఆఫ్-ది-రివర్ ప్రాజెక్ట్‌గా వర్ణించబడిన ఈ ప్రాజెక్టు పూర్తయినప్పుడు 2,000 మె.వా. విద్యుత్తు సరఫరా చేస్తుంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కొండచరియలు విరిగిపడటం, రీ-డిజైన్ చేయవలసి రావడం, వ్యతిరేకత వంటి అనేక సమస్యలను ఎదుర్కొంది.

దిగువ సుబన్సిరి ఆనకట్ట
దిగువ సుబన్సిరి ఆనకట్ట, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం
దిగువ సుబన్సిరి ఆనకట్ట is located in India
దిగువ సుబన్సిరి ఆనకట్ట
అరుణాచల్ ప్రదేశ్, అస్సాం లలో దిగువ సుబన్సిరి ఆనకట్ట
అధికార నామంSubansiri Lower Hydroelectric Power Project (LSHEP)
దేశంభారతదేశం
ప్రదేశంఅరుణాచల్ ప్రదేశ్
అక్షాంశ,రేఖాంశాలు27°33′13″N 94°15′31″E / 27.55361°N 94.25861°E / 27.55361; 94.25861
స్థితిUnder construction
నిర్మాణం ప్రారంభం2007 డిసెంబరు
నిర్మాణ వ్యయంRs. 6290 కోట్లు(December 2002 est.)
యజమానిNHPC లిమిటెడ్
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంకాంక్రీట్ గ్రావిటీ
నిర్మించిన జలవనరుదిగువ సిబన్‌సిరి నది
Height116 మీ. (381 అ.)
ఎత్తు (పునాది)130 మీ. (427 అ.)
పొడవు284 మీ. (932 అ.)
Dam volume2,250,000 మీ3 (2,942,889 cu yd)
Spillway typeస్కీ జంప్
Spillway capacity37,500 m3/s (1,324,300 cu ft/s)
జలాశయం
మొత్తం సామర్థ్యం1.37 కి.మీ3 (1,110,677 acre⋅ft)
క్రియాశీల సామర్థ్యం0.44 కి.మీ3 (356,714 acre⋅ft)
ఉపరితల వైశాల్యం33.5 కి.మీ2 (13 చ. మై.)[1]
విద్యుత్ కేంద్రం
నిర్వాహకులుNHPC లిమిటెడ్
Commission date2016-2018 (అంచనా.)
టర్బైన్లు8 × 250 MW Francis-type
Installed capacity2,000 మె.వా. (గరిష్ఠం)
వార్షిక ఉత్పత్తి7,421 గివా.హ
Website
సుబన్‌సిరి దిగువ ప్రాజెక్టు

2019 ప్రారంభంలో, అస్సాం ప్రాంతంలోని రెండు ప్రధాన ఆనకట్టల ప్రాజెక్టులైన దిబాంగ్, లోయర్ సుబన్‌సిరి రెండింటిలో పనులు నిలిచిపోయాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లభించిన తర్వాత 2019 అక్టోబరు 15 న ప్రాజెక్టు నిర్మాణం తిరిగి ప్రారంభమైంది. రేడియల్ గేట్లను అమర్చడంలో మిగిలిన పనులు వర్షాకాలం తర్వాత పూర్తవుతాయని, 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుందని భావించారు.[2]

డిజైన్

మార్చు

కాంక్రీట్ గ్రావిటీ డ్యాం ఎత్తు నది గర్భం నుండి 116 మీ. (381 అ.), అత్యంత లోతు పునాది నుండి 210 మీ. (690 అ.) ఎత్తు ఉంటుంది. ఆనకట్ట పొడవు 284 మీ. (932 అ.), ఘనపరిమాణం 2,250,000 మీ3 (2,942,889 cu yd) ఉంటుంది. ఆనకట్ట వలన ఏర్పడే జలాశయానికి 1.37 కి.మీ3 (1,110,677 acre⋅ft) స్థూల నిల్వ సామర్థ్యం ఉంటుంది. ఇందులో .44 కి.మీ3 (356,714 acre⋅ft) నీటిని విద్యుదుత్పత్తికి, నీటిపారుదలకూ ఉపయోగించవచ్చు. సాధారణ స్థాయిలో, రిజర్వాయర్ ఉపరితల వైశాల్యం 33.5 కి.మీ2 (13 చ. మై.) ఉంటుంది. కుడి ఒడ్డున ఉన్న ఉపరితల విద్యుత్కేంద్రంలో 250 మె.వాట్ల ఫ్రాన్సిస్ టర్బైన్ జనరేటర్లు ఎనిమిది ఉంటాయి.[3]

ఒక్కొక్కటి 9.5 మీ. (31 అ.) వ్యాసం, 608–1,168 మీ. (1,995–3,832 అ.) పొడవు ఉండే ఎనిమిది గుర్రపు నాడా ఆకారపు హెడ్ రేస్ సొరంగాలు ఉంటాయి. ఒక్కొక్కటి 9.5 మీ. (31 అ.) వ్యాసం, 400–485 మీ. (1,312–1,591 అ.) పొడవు ఉండే ఎనిమిది గుర్రపు నాడా ఆకారపు ఉప్పెన సొరంగాలు ఉంటాయి. 7–9.5 మీ. (23–31 అ.) వ్యాసంతో, 168–190 మీ. (551–623 అ.) పొడవుతో ఎనిమిది గుర్రపు నాడా/వృత్తాకారపు పెన్‌స్టాక్‌లు ఉంటాయి. టెయిల్ రేస్ ఛానల్, టర్బైన్‌ల ద్వారా విడుదలైన నీటిని తిరిగి నదికి చేరుస్తుంది. ఇది 206 మీ. (676 అ.) వెడల్పు, 35 మీ. (115 అ.) పొడవు ఉంటుంది.[3]

పూర్తయిన తర్వాత, జలవిద్యుత్ జనరేటర్లతో 500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం మొదలుపెట్టి, క్రమేణా 2000 మెగావాట్లకు పెరుగుతుంది.[4]

నిర్మాణం

మార్చు

సుబన్‌సిరి దిగువ ప్రాజెక్టు నిర్మాణంలో అనేక సవాళ్ళున్నాయి. నిర్మాణం ప్రారంభించాల్సిన సమయానికి భూమి అందుబాటులో లేకపోవడం, రుతుపవనాలు, పరిమితంగా అందుబాటులో ఉండే నిర్మాణ సమయం (ఏప్రిల్ మధ్య నుండి అక్టోబరు మధ్య వరకు మాత్రమే కుదురుతుంది), అధిక వరద ప్రవాహాలు, బలహీనమైన రాతి పరిస్థితులు వంటివి ఇందులో ఉన్నాయి. డ్యామ్ రూపకల్పన తీవ్రమైన పునర్విమర్శలకు గురైంది. ఇది నిర్మాణ పనుల షెడ్యూల్ ను ప్రభావితం చేసింది. [5]

2003 డిసెంబరులో ఆనకట్టను, దాని అనుబంధ నిర్మాణాలను నిర్మించే కాంట్రాక్టును సోమా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ వారి కన్సార్టియమ్‌కు అప్పగించారు. భూమిని సేకరించడంలో ఇబ్బందులు తలెత్తడంతో, కాంట్రాక్టు లభించిన 13 నెలల వరకు నిర్మాణం సవ్యంగా ప్రారంభం కాలేదు. ఆనకట్ట ప్రదేశంలో ఊహించని భౌగోళిక పరిస్థితులు, కొండచరియలు విరిగిపడటం వలన సొరంగం తవ్వకం నెమ్మదిగా సాగింది. 2007 నవంబరు నాటికి, నది మళ్ళింపు విజయవంతంగా పూర్తైంది. మరుసటి సంవత్సరం ఏప్రిల్‌లో, నిర్మాణానికి పునాది స్థలం స్పష్టంగా కనిపించింది. పునాది పూర్తిగా సిద్ధం కావడానికి ముందే, అక్కడి బెడ్‌రాక్ అనుకున్నదాని కంటే 10 మీ. (33 అ.) పైననే ఉందని తెలిసింది. దీనివలన, స్థిరత్వం కోసం ఆనకట్ట రూపకల్పనలో మార్పు చెయ్యవలసి వచ్చింది. డ్యామ్‌ను రీ-డిజైన్ చేస్తున్నప్పుడు, కాఫర్‌డ్యామ్‌లు బలమైన వరదల నుండి పునాదిని రక్షించలేవని గమనించి, రాబోయే వర్షాకాల వరదల నుండి పునాదిని రక్షించడానికి దానిపై కాంక్రీటు వేసారు. 2008 అక్టోబరులో రీ డిజైను పూర్తయింది. వెంటనే పునాదిని మరోసారి క్లియర్ చేసారు. 2009 మేలో వర్షాకాలం కారణంగా పని నిలిపివేసి, అదే సంవత్సరం నవంబరులో తిరిగి మొదలుపెట్టారు.[5]

2011 నవంబరు నాటికి, ఆనకట్ట 138 మీ. (453 అ.) ఎత్తుకు, స్పిల్‌వే ఎత్తు అయిన 145 మీ. (476 అ.) కి కొద్దిగా దిగువకు చేరుకుంది. 2011 డిసెంబరు 16 న నిరసనల కారణంగా నిర్మాణం నిలిచిపోయింది.[6]

2011 డిసెంబరు నుండి పనిని బలవంతంగా నిలిపివేయడం వల్ల నిర్మాణ వ్యయం 1,200 కోట్లు పెరిగింది. NHPC ఇప్పటికే సుమారు 6,600 కోట్లు ఖర్చు చేసిందని కంపెనీ తయారు చేసిన స్టేటస్ రిపోర్ట్ తెలిపింది.[7]

2023 మధ్య నాటికి, ఆనకట్ట ఎత్తు సముద్ర మట్టం నుండి 210 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. [8]

పర్యావరణ ప్రభావం

మార్చు

చాలా పెద్ద డ్యామ్‌లకు ఉండే ప్రత్యేకమైన కొన్ని పర్యావరణ ప్రభావాలు సుబన్‌సిరి ప్రాజెక్టును పూర్తి చేయడం వలన కూడా ఉంటాయి. ఈ ప్రభావాల్లో పర్యావరణ వ్యవస్థకు కలిగే నష్టం, భూమి నష్టం ఉంటాయి.

సుబన్‌సిరి ప్రాజెక్టు జలాశయం వలన, నది 47 కి.మీ. (29 మై.) పొడవున మునిగిపోతుంది. ఇది 37.5–40 కి.మీ2 (14.5–15.4 చ. మై.) విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో హిమాలయ ఉపఉష్ణమండల పైన్ అడవులు, హిమాలయ ఉపఉష్ణమండల విశాలమైన అడవులు, టేల్ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యంలో భాగం, ఏనుగుల కారిడార్, కొన్ని జీవనాధార వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. [9]

అధికారిక సమాచారం ప్రకారం డ్యాం పూర్తయితే 38 కుటుంబాలు నిర్వాసితులవుతాయి. [10]

దిగువన

దిగువ నీటి ప్రవాహాన్ని ఆనకట్ట ద్వారా నియంత్రిస్తారు. దీని ఫలితంగా శీతాకాలంలో తక్కువగాను (6 m 3 /s) విద్యుదుత్పత్తి జరిగేటపుడు చాలా ఎక్కువ గాను (2,560 m 3 /s) నీటి విడుదల జరుగుతుందని భావిస్తున్నారు.[11]

ఈ ప్రాజెక్టు భద్రత, ప్రాజెక్టు దిగువ ప్రభావం గురించి భయపడుతున్న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, కృషక్ ముక్తి సంగ్రామ్ సమితితో సహా అనేక సమూహాల నుండి గట్టి ప్రతిఘటనను ఎదుర్కొంది.[7]

మూలాలు

మార్చు
  1. "India: National Register of Large Dams 2009" (PDF). Central Water Commission. Archived from the original (PDF) on 21 జూలై 2011. Retrieved 10 జూలై 2011.
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :0 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. 3.0 3.1 "Welcome to Subansiri (Lower) Project". NHPC India. Retrieved 12 March 2012.
  4. Sarmah, Nitish (Aug 31, 2021). "Assam: Subansiri Dam To Generate Power Soon, Opposing Bodies Cry Foul". guhahatiplus.
  5. 5.0 5.1 Biswajit Das (2011). "Planning and Building the Subansiri Lower Dam and Hydro Project". HydroWorld. PennWell Corporation. Retrieved 7 March 2012.
  6. Tanmoy Sharma. "Fighting India's mega dams". The Third Pole. China Dialogue. Retrieved 7 March 2012.
  7. 7.0 7.1 "Subansiri Project dispute to be resolved through negotiations". IANS. news.biharprabha.com. Retrieved 6 July 2014.
  8. "Subansiri Lower Hydroelectric Project Achieves Construction of Dam till Top Level". www.pib.gov.in. Retrieved 2024-04-11.
  9. Error on call to Template:cite paper: Parameter title must be specified
  10. Diana Vinding (2004). The Indigenous World 2004. Copenhagen: Eks-Skolens Trykkeri. p. 323. ISBN 87-90730-83-6. ISSN 0105-4503. Retrieved 9 March 2012.
  11. "People's Power Blocks Dam Construction in Northeast India". Tag Archive for 'Subansiri Dam'. Peakwater. 5 December 2011. Archived from the original on 3 March 2012. Retrieved 9 March 2012.