ది ఇండియన్ స్ట్రగుల్

సుభాష్ చంద్ర బోస్ చే రచింపబడిన పుస్తకము

ది ఇండియన్ స్ట్రగుల్, 1920-1942 అనేది భారత జాతీయ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని 1920 నుంచి 1942వ సంవత్సరం వరకు బ్రిటిష్ పాలనను అంతం చేయడానికి దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులు, స్వాతంత్ర్య ఉద్యమం ప్రధాన అంశంగా రెండు భాగాలుగా ప్రచురించారు. బ్రిటిష్ ప్రభుత్వం భారత్ లో నిషేధించిన కారణంగా స్వాతంత్ర్యం సాధించిన అనంతరం 1948లో ఇక్కడ 'ది ఇండియన్ స్ట్రగుల్' ప్రచురించబడింది. భారత స్వాతంత్ర్య పోరాటం ఇతివృత్తంగా ఉన్న ఈ పుస్తకంలో 1920ల ప్రారంభంలో స‌హాయ నిరాక‌ర‌ణ, ఖిలాఫత్ ఉద్యమాల నుండి 1940ల[1] ప్రారంభంలో క్విట్ ఇండియా, ఆజాద్ హింద్ ఉద్యమాల వరకు విశ్లేషించబడ్డాయి.

ది ఇండియన్ స్ట్రగుల్, 1920–1942
రచయిత(లు)సుభాష్ చంద్రబోస్
ప్రచురణ సంస్థభాగం I (1920–1934) విషార్ట్ & కో., లండన్ 1935; భాగం II (1935–1942) ఇటలీ 1942
OCLC3863565

రెండు భాగాలు మార్చు

ది ఇండియన్ స్ట్రగుల్ మొదటి భాగంలో 1920 మొదలు అప్పటి వరకు ఉన్న అంశాలతో 1935లో లండన్‌లోని లారెన్స్ అండ్ విషార్ట్ సంస్థ  ప్రచురించబడింది. బెంగాల్ వాలంటీర్లతో సంబంధాలున్నాయని, అనేక హింసాత్మక ఘటనల్లో అనుమానాస్పద పాత్ర ఉందని బోస్ ని బ్రిటిష్ వలస ప్రభుత్వం అరెస్టు చేసి నిర్బంధించిన తరువాత ఐరోపాలో బహిష్కరించబడ్డాడు[2]. వియన్నాలో బోస్ ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఎలాంటి సమాచారం, పత్రికలు అందుబాటులో లేవు.[3]

దేశంలోకి ప్రవేశించడంపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించినా 1934 డిసెంబర్ నెలలో బోస్ కరాచీకి వచ్చినప్పుడు, అతన్ని అరెస్టు చేసి, ది ఇండియన్ స్ట్రగుల్ పుస్తకం కోసం రాసుకున్న ప్రతిని కూడా స్వాధీనం చేసుకున్నారు.[4] ఆ పై యేడాది ఎట్టకేలకు ఈ పుస్తకం లండన్‌లో ప్రచురించబడింది. బ్రిటిష్ ప్రెస్ నుంచే కాక విమర్శకుల నుండి మంచి ఆదరణ లభించింది. కానీ ప్రజలలో తీవ్రవాదాన్ని ప్రేరేపించిదిగా ఉందని బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే భారతదేశంలో ఈ పుస్తకాన్ని నిషేధించిది. భారత విదేశాంగ కార్యదర్శి శామ్యూల్ హోరె ఈ చర్యను హౌస్ ఆఫ్ కామన్స్‌లో సమర్థించుకున్నారు.

ఇక బోస్ రెండవ భాగం అనగా 1935 నుంచి 1942 వరకు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రాసారు. యూరోప్‌లో 1941,43 సమయంలో బోస్ ఉన్నప్పుడు వస్తుందనుకున్న జర్మన్ ఎడిషన్ రాలేదు. కానీ 1942లో ఇటాలియన్ ఎడిషన్ వచ్చింది. ఈ పుస్తకం రాయడంలో అతనికి ఎమిలీ షెంకెల్ సహాయపడింది. వీరికి ఒక కుమార్తె అనితా బోస్.[5]

మూలాలు మార్చు

  1. "The Indian Struggle". Hindustan Times. Archived from the original on 10 ఏప్రిల్ 2012. Retrieved 22 డిసెంబరు 2013.
  2. "Subhas Chandra Bose". Encyclopædia Britannica. Retrieved 22 December 2013.
  3. "THE INDIAN STRUGGLE". Archived from the original on 30 డిసెంబరు 2014. Retrieved 22 December 2013.
  4. Netaji's Life and Writings Part Two – The Indian Struggle 1920 – 1934 (PDF). Calcutta: Thacker, Spinck and Co. Ltd. 1948. p. 3.
  5. Pelinka, Anton (2003). Democracy Indian Style: Subhas Chandra Bose and the Creation of India's Political Culture. New Brunswick: Transaction Publishers. pp. 81–82, 94–97. ISBN 9781412821544.

బయటి లింకులు మార్చు