దీప్ సిద్ధూ

(దీప్‌ సిద్ధూ నుండి దారిమార్పు చెందింది)

దీప్‌ సిద్ధూ (2 ఏప్రిల్ 1984 - 15 ఫిబ్రవరి 2022) మోడల్‌, పంజాబ్‌ నటుడు, న్యాయవాది. గతంలో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలో దీప్‌ సిద్ధూ చేరాడు. ఎర్రకోటలో 2021 గణతంత్ర దినోత్సవ హింసాకాండ కేసులో నిందితుడు.[1]

దీప్ సిద్ధూ
జననం(1984-04-02)1984 ఏప్రిల్ 2
ముక్త్సార్, పంజాబ్, భారతదేశం
మరణం2022 ఫిబ్రవరి 15(2022-02-15) (వయసు 37)
హర్యానా, భారతదేశం
వృత్తినటుడు, కార్యకర్త, న్యాయవాది

1984లో పంజాబ్‌లోని ముక్త్సార్ లో దీప్ సిద్ధూ జన్మించాడు.[2][3] లా చదివాడు. మోడ‌లింగ్ వైపు దృష్టి సారించాడు. ఆ తరువాత తన సినీ కెరీర్‌ను పంజాబీ చిత్రం రామ్తా జోగితో ప్రారంభించాడు, దీనిని నటుడు ధర్మేంద్ర తన బ్యానర్ విజయతా ఫిల్మ్స్‌పై నిర్మించారు.[4][5]

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో దీప్ సిద్ధూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా బరిలోకి దిగిన బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కోసం ప్రచారం చేసాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన‌లో ఆయ‌న పాల్గొన్నాడు.

2022 ఫిబ్రవరి 15న దీప్ సిద్ధూ ఢిల్లీ నుంచి పంజాబ్‌లోని భటిండాకు వెళుతుండగా కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదంలో మరణించాడు.[6][7]

ఇవీ చదవండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "We only hoisted the Nishan Sahib flag on Red Fort while exercising our democratic right to protest: Deep Sidhu". Tribune India (in ఇంగ్లీష్). 26 January 2021. Retrieved 26 January 2021.
  2. "I fight my own case: Deep". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 15 February 2022.
  3. Brar, Kamaldeep Singh (5 December 2020). "Explained: Who is Deep Sidhu, and why is he getting attention amid the farmers' protests?". The Indian Express. Retrieved 26 January 2021.{{cite news}}: CS1 maint: url-status (link)
  4. "I fight my own case: Deep". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 15 February 2022.
  5. "The new actor on the block Deep Sidhu". Indian Down Under. Archived from the original on 2017-02-21. Retrieved 2022-02-15. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. "Deep sidhu: పంజాబ్‌ నటుడు దీప్‌ సిద్ధూ మృతి". EENADU. Archived from the original on 2022-02-15. Retrieved 2022-02-15.
  7. "Punjabi Actor Deep Sidhu, Accused In Red Fort Violence Case Dies In Road Accident". News18 (in ఇంగ్లీష్). 2022-02-15. Retrieved 2022-02-15.