దుగ్గినేని వెంకయ్య
దుగ్గినేని వెంకయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మధిర నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]
దుగ్గినేని వెంకయ్య | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1962 – 1972 | |||
ముందు | బి.సత్యనారాయణరావు | ||
---|---|---|---|
తరువాత | దుగ్గినేని వెంకట్రావమ్మ | ||
నియోజకవర్గం | మధిర నియోజకవర్గం | ||
ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్
| |||
పదవీ కాలం 1967 డిసెంబరు 27 – 1970 డిసెంబరు 26 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1940 ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | దుగ్గినేని వెంకట్రావమ్మ | ||
నివాసం | హైదరాబాద్ |
రాజకీయ జీవితం
మార్చుదుగ్గినేని వెంకయ్య కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1962లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఆర్. శంకరయ్యపై 5,456 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1967లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఎం అభ్యర్థి బోడేపూడి వెంకటేశ్వరరావుపై 10,404 ఓట్ల మెజార్టీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1967 డిసెంబరు 27 నుంచి 1970 డిసెంబరు 26 వరకు ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌గా పనిచేశాడు.[3][4]
మూలాలు
మార్చు- ↑ Andhra Jyothy (30 October 2018). "ఆరేళ్లూ.. ఎమ్మెల్యే". Archived from the original on 18 April 2022. Retrieved 18 April 2022.
- ↑ Sakshi (14 April 2014). "పోరుగడ్డ మధిర". Archived from the original on 18 April 2022. Retrieved 18 April 2022.
- ↑ Andhra Jyothy (23 December 2020). "సహకార." (in ఇంగ్లీష్). Archived from the original on 18 April 2022. Retrieved 18 April 2022.
- ↑ Namasthe Telangana (12 April 2022). "తెలంగాణ నియోజకవర్గాలు-విశేషాలు". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.