దుష్యంతుడు
దుష్యంతుడు చిన్ననాటి నుండి అడవులలో తిరుగుతూ పులులను సింహాలనూ వేటాడి పట్టుకుంటూ ఆడుకొనేవాడు. దుష్యంతుని రాజ్యపాలనలో ప్రజలు ధర్మ మార్గం అవలంబిస్తూ ప్రశాంత జీవితం అవలంబిస్తూ జీవిస్తున్నారు.
వేటకు వెళ్ళుట
మార్చుఒక రోజు దుష్యంతుడు వేటకు వెళ్ళి వేటాడుతూ ఒక తపోవనానికి చేరుకున్నాడు. అది బద్ద శత్రువులైన సింహాలూ ఏనుగులూ లాంటి జంతువులనేకం తో కలసి సహజీవనం చేస్తున్న మహర్షి కణ్వాశ్రం. దుష్యంతుడు మిగిలిన వారిని వదిలి మహర్షి దర్శనార్ధం ఆశ్రమంలోకి ఒంటరిగా వెళ్ళాడు. అక్కడ అతడు సౌందర్యవతి అయిన కణ్వ మహర్షి పెంపుడు కూతురు శకుంతల ను చూసాడు. ఆమె అందానికి ముగ్ధుడైయ్యాడు. శకుంతలనూ దుష్యంతుని అందం ఆకర్షించింది. పరస్పర పరిచయా లయ్యాక ఆమె కణ్వమహర్షి కూతురని తెలుసుకున్నాడు. దుష్యంతుడు శకుంతలతో బ్రహ్మచారి అయిన కణ్వమహర్షికి కూతురెలా కలిగిందని సందేహం వెలిబుచ్చాడు.
శకుంతలా దుష్యంతుల వివాహం
మార్చుశకుంతల ద్వారా దుష్యంతుడు ఆమె క్షత్రియ కన్య అని తెలుసుకుని దుష్యంతుడు ఆమె మీద మనసుపడి గంధర్వ రీతిన వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో శకుంతలకు పుట్టిన బిడ్డను చక్రవర్తిని చేస్తానని వాగ్ధానం చేసాడు. రాజలాంఛనాలతో ఆమెను రాజధానికి తీసుకు వెళతానని మాటిచ్చి రాజధానికి వెళ్ళాడు. కణ్వమహర్షి ఆ విషయం దివ్యదృష్టి ద్వారా గ్రహించి వారి వివాహానికి అనుమతించి శకుంతల పుత్రుడు చక్రవర్తి కాగలడని దీవించాడు. శకుంతలకు ఆమె పుత్రుడు మహా బలవంతుడై ఆయురారోగ్య ఐశ్వర్యవంతుడు కాగలడని వరం ప్రసాదించాడు. మహర్షి మాటలను నిజంచేస్తూ శకుంతలకు మహాబలవంతుడైన భరతుడు చక్రవర్తి లక్షణాలతో జన్మించాడు.
దుష్యంతుడు శకుంతలను స్వీకరించుట
మార్చుకణ్వమహర్షి శకుంతలను అత్తవారింటికి పంపడం ఉచితమని భావించి శిష్యులను తోడిచ్చి ఆమెను కుమారునితో సహా దుష్యంతుని వద్దకు పంపాడు. దుష్యంతుడు శకుంతలను తెలియనట్లు నటిస్తూ ఆమెను నిరాకరించాడు. శకుంతల దుఃఖిస్తూ పలువిధాల ప్రార్ధించినా దుష్యంతుడు ఆమెను స్వీకరించడానికి అంగీకరించలేదు. చివరిగా ఆకాశవాణి శకుంతల మాటలు సత్యమని చెప్పడంతో దుష్యంతుడు లోకనిందకు వెరచి భార్యా బిడ్డలను స్వీకరించి భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేసాడు. ఆకాశవాణి ఈ పుత్రుడు నీ సంతానమే ఇతనిని భరించు అని చెప్పినందువల్ల ఈ దుష్యంత కుమారుడు భరతుడు అని పిలవబడ్డాడు. ఇతనికి ఇంకొక పేరు సర్వ దమనుడు.