దూద్ సాగర్ జలపాతం
దూద్ సాగర్ జలపాతం భారత రాష్ట్రమైన గోవాలో కర్నాటక రాష్ట్ర సరిహద్దుగా మన్‌డోవి నదిపై ఉంది. దీనిని పాల సాగర జలపాతం అని కూడా అంటారు. జలపాతంలోని నీరు నురగలతో పాలను తలపించునట్లుగా ఉండుట వలన ఈ జలపాతానికి ఈ పేరు వచ్చింది. ఇది నాలుగు అంచెలుగా ఉంటుంది.
దూద్ సాగర్ జలపాతం | |
---|---|
दूधसागर जलप्रपात ದೂಧ್ಸಾಗರ್ ಜಲಪಾತ | |
ప్రదేశం | గోవా, భారతదేశం |
అక్షాంశరేఖాంశాలు | 15°18′46″N 74°18′51″E / 15.31277°N 74.31416°E |
రకం | శ్రేణులుగా |
మొత్తం ఎత్తు | 310 మీటర్లు (1017 అడుగులు) |
బిందువుల సంఖ్య | 4 |
నీటి ప్రవాహం | మన్‌డోవి నది |
ఇది రోడ్డు మార్గం ద్వారా పనాజి నగరం నుండి 60 కిలోమీటర్ల దూరంలో, రైలు మార్గం ద్వారా మడ్గావన్ రైల్వే స్టేషను నుండి 46 కిలోమీటర్ల దూరంలో, బెల్గాం నుండి రైలు మార్గం ద్వారా 60 కిలోమీటర్ల దూరంలో, రోడ్డు మార్గం ద్వారా 55 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వికీమీడియా కామన్స్‌లో Dudhsagar Fallsకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.