దూరపు కొండలు నునుపు

మనం ఏదైనా వస్తువును కానీ, ప్రదేశాన్ని కానీ దగ్గరకు వెళ్ళి గమనిస్తేనే నిజానిజాలు బయట పడతాయి. అంతేకానీ దూరం నుంచి చూసి కొండ చాలా నున్నగా ఉంది అనుకుంటే అది పొరపాటు అవుతుంది. కొండ సాధారణంగా రాళ్ళు రప్పలతో, చెట్లతో ఎగుడుదిగుడు గానే ఉంటుంది. కానీ దూరం నుంచి చూస్తే అలాంటివేమీ కనిపించవు.

దూరంగా కనిపించే కొండలు

నిజజీవితంలో ఎవరైనా దేనిగురించైనా లోతుగా ఆలోచించకుండా కలలు కంటూంటే ఈ సామెతను వాడడం పరిపాటి. బయటికి కనిపించేదంతా నిజం కాదు అనే అర్థంలో ఈ సామెతను వాడుతుంటారు.

వాడుకలు

మార్చు
  • దూరపు కొండలు నునుపు అన్నట్లు దూరం నుంచి చూసేవాళ్లకి సినిమా తారల జీవితం చాలా విలాసవంతంగా అనిపిస్తుంది. కానీ, అందంగా కనిపించడానికి వాళ్లు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.
  • ఒక్కో సారి దూరపు కొండలు నునుపు అన్నట్టు - పక్కింటి వారు, మనకంటే చాలా సంతోషం గా వున్నట్టు భ్రమ పడుతుంటాము. వారు ఎప్పుడైనా మన ఇంటికి వచ్చి తమ గోడు మనతో చెబితే - ఆహా, మనమే వారికంటే కాస్త నయం అనుకుంటూ వుంటాము.
  • అమెరికాను అమరదేశంగా ఊహిస్తూ, ఏదారినైనా సరే వచ్చెయ్యాలని, ఈ అమెరికా (అమర) సుఖాన్ని పొందలేక పోవడం ఒక చేతకాని తనంగా ఊహించుకునే “మన” జనాన్ని చూస్తూంటే, కొంత కాలం తర్వాత అమెరికాని రెండవ స్వర్గంగా గుర్తిస్తామేమో అనిపిస్తోంది. దూరపు కొండలు నునుపు అన్నది ఆర్యోక్తి.[1]

మూలాలు

మార్చు
  1. ఈమాట పత్రికలో ఒక వ్యాసం