దూరప్రసారం
దూరప్రసారం (Telecommunication - టెలికమ్యూనికేషన్) అనగా సమాచార ప్రయోజనం కోసం ఎక్కువ దూరాలకు చేరవేయు సంకేతాల ప్రసారం. ప్రారంభ కాలాల్లో సమాచార ప్రసారాలకు పొగ సంకేతాలు, డ్రమ్ములు, సెమాఫోర్ (సంకేత పదాల ద్వారా వార్తలను చేర వేయు పద్ధతి), జెండాలు, లేదా అద్దం ద్వారా సూర్యకాంతిని ప్రసరింపజేయడం ఉపయోగించి ఉండవచ్చు. టెలిగ్రాఫ్‌తో మొదలుపెట్టి, టెలికమ్యూనికేషన్ సాధారణంగా టెలిఫోన్, టెలివిజన్, రేడియో, ఆప్టికల్ ఫైబర్, కంప్యూటరు వంటి ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మీటర్ల ఉపయోగమును చేర్చుకొని ఉంటుంది.
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |