దృగ్గోచర కాంతిమితి


కాంతి ఒక ప్రవహిస్తున్న శక్తి. సూర్యుడు , వెలుగుతున్న కొవ్వొతి , లేదా మండుతున్న విద్యుత్ బల్బుల వంటి స్వయం ప్రకాశకాల నుండి ఇది ఉద్గారమౌతుంది. ఈ జనకాలన్ని ఉత్సర్గం చేసే వికిరణ శక్తి కంటిలో ఉన్న రెటీనాని తాకి దృశ్య జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ వికిరణ శక్తిని కాంతి అంటారు.[1]

రెండు కాంతి జనకాలు , ఉదాహారణకి వెలుగుతున్నకొవ్వొత్తి , రెండు కాంతి జనకాలు అంటే వేర్వేరు పరిమాణాలున్న కొవ్వొత్తుల మధ్య ప్రకాశంలోని తేడాని పోల్చడం మానవ కంటితో వీలుపడదు. దీనికి కావలసిన ప్రమనలని , సాంకేతిక విజ్ఞానాన్ని ,దృగ్గోచర కాంతిమితి ద్వారా అభివృద్ధి చేసారు. ఒక కాంతి జనకము నుండి ఉద్గారమైన వికిరణ్ శక్తిలో దృగ్గోచర కాంతి ఎంత ఉన్నది. అన్న విషయాన్ని ప్రకాశం లేదా కాంతి తీవ్రత తెలియజేస్తుంది. రెండు కాంతి జనకాల కాంతి తీవ్రతని, ఈ పద్ధతులతో , మానవ కంటితో పరిశీలించవచ్చు. కొన్ని ప్రత్యేక ప్రమాణాలు,పద్ధతులు ద్వారా రెండు కాంతి జనకాల సాపేక్ష కాంతి తీవ్రతని కొలవగలిగే శాస్త్రము దృగ్గోచర కాంతిమితి.

కాంతి అభివాహం(Φ)

మార్చు
కాంతి అభివాహం

ప్రమాణ కాలం లో, ఒక కాంతి జనకం నుండి ప్రవహించే వికరణ శక్తి ని కాంతి అభివాహం అంటారు.కాలంలో ఉద్గారింపబడిన వికిరణ శక్తి ని కాంతి అభివాహం అంటారు. దీనికి ప్రమాణం ఎర్గ్/సెకను. ఈ కాంతి అభివాహం ఒక కాంతి జనకం యొక్క "దీపన సామర్థ్యం"(illuminating power) లేదా "కాంతి తీవ్రత"(luminous intensity) ల పై ఆధారపడి ఉంటుంది.ల్యూమెన్ (lumen) అనే ప్రమాణాన్ని కాంతి అభివాహాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తారు.

ఘనకోణం(solid angle)

మార్చు
ఘన కోణం

ఒక గోళాకార ఉపరితలం పై వున్న కొంత భాగంలోని హద్దుల వెంబడి గోళ కేంద్రమునకు అఖిలంబ రేఖలను గీసిన అవి శంకువును ఏర్పరుచును. ఈ శంకువు పీఠం గోళ కేంద్రం వద్ద చేసే కోణమే ఘన కోణం. ఇది శంకువు పీఠం వైశాల్యానికి, గోళ వ్యాసార్ధము యొక్క వర్గానికి గల నిష్పత్తికి సమానము.

sr

కాంతి తీవ్రత లేదా దీపన సామర్థ్యం

మార్చు

ఒక బిందు జనకం నుండి, ప్రమాణ ఘనకోణంలో ఉద్గారమయ్యే కాంతి అభివాహాన్ని కాంతి తీవ్రత లేదా దీపన సామర్థ్యం అంటారు. దీనిని కాండెలా(cd)లో కొలుస్తారు.

Ι=dΦ/dΩ

కాండెలా (cd)

మార్చు

2046k వద్ద ఘనీభవించిన ప్లాటినం కృష్ణ వస్తువు యొక్క తలముపై చదరపు సెంటీమీటరులో 1/60 వంతు వైశాల్యానికి అభిలంబంగా ఒక ప్రమాణ ఘనకోణంలో ఉద్గారమయ్యే , కాంతి అభివాహాన్ని కాండెలా cdగా నిర్వచించారు.

ల్యూమెన్

మార్చు

కాంతి అభివాహాన్ని ల్యూమెన్ (lm) అనే ప్రమాణంలో కొలుస్తారు.ల్యూమెన్ ని కాండెలా సహాయంతో నిర్వచిస్తారు. ఒక కాండెలా ప్రమాణమున్న కాంతి జనకం, ఒక ఘనకోణంలో ఒక సెకను కాలంలో ఉద్గారించే కాంతి శక్తిని ల్యూమెన్ అంటారు. 1ల్యూమెన్=ఎర్గ్/సె/స్టెరేడియన్/కాండెలా

కాండిల్ సామర్థ్యం

మార్చు

ఏదైనాఒక దిశలో కాంతి జనకం యొక్క కాంతి తీవ్రత కాండెలాలో చెప్పినపుడు, దానిని కాండిల్ సామర్థ్యం అంటారు.

λ =5550A0

ఈ క్రింది పట్టిక కాంతిమితి పదాలు, నిర్వచనాలు, ప్రమణాలను వివరిస్తుంది.

మార్చు
క్రమ సంఖ్య పదం(సంకేతం) నిర్వచనం ప్రమాణం
1 కాంతి అభివాహాం(Φ) కంటితో చుసినపుడు ఒక కాంతి జనకం నుండి ఒక సెకను కాలంలో బహిర్గతమయే కాంతి శక్తి. ల్యూమెన్(lm)
2 ఘనకోణం( Ω) శంకువు పిఠం వైశాల్యానికి, గోళ వ్యాసార్ధము యొక్క వర్గానికి గల నిష్పత్తికి సమానము. స్టెరేడియన్(sr)
3 కాంతి తీవ్రత(l) ప్రమాణ ఘనకోణంలో కాంతి జనకం ఉద్గారించే కాంతి అభివాహం. కాండెలా (cd) /స్టెరే (lm sr)
4 కాండెలా (cd) 1/60 వంతు వైశాల్యానికి అభిలంబంగా ఒక ప్రమాణ ఘనకోణంలో ఉద్గారమయ్యే ,కాంతి అభివాహం. కాండెలా (cd)
5 ల్యూమెన్ (lm) ఒక కాండెలా ప్రమాణమున్న కాంతి జనకం, ఒక ఘనకోణంలో ఒక సెకను కాలంలో ఉద్గారించే కాంతి. ల్యూమెన్(lm)
6 కాండిల్ సామర్థ్యం ఏదైనాఒక దిశలో కాంతి జనకం యొక్క కాంతి తీవ్రత కాండెలాలో చెప్పినపుడు, దానిని కాండిల్ సామర్థ్యం అంటారు. కాండెలా (cd)

ఇది కూడా చూడండి

మార్చు

బయట లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. పదవ తరగతి భౌతిక శాస్త్ర పాఠ్య పుస్తకము